పమేలా చోప్రా గుర్తుగా అద్భుతమైన వీడియో రూపొందించిన YRF

ప్రసిద్ధ బాలీవుడ్ దర్శక నిర్మాత దివంగత యష్ చోప్రా సతీమణి పమేలా చోప్రా 74 సంవత్సరాల వయసులో గురువారం ముంబైలో ఆమె స్వర్గస్తులయ్యారు.  గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం బాధాకరం.  ఇకపోతే బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ  యష్ రాజ్ ఫిలింస్ ప్రస్థానంలో భర్త యష్ చోప్రాతో పాటు పమేలా చోప్రా కీలక పాత్ర పోషించారు. కేవలం కుటుంబ బాధ్యతలకు మాత్రమే ఆవిడ పరిమితం కాకుండా […]

Share:

ప్రసిద్ధ బాలీవుడ్ దర్శక నిర్మాత దివంగత యష్ చోప్రా సతీమణి పమేలా చోప్రా 74 సంవత్సరాల వయసులో గురువారం ముంబైలో ఆమె స్వర్గస్తులయ్యారు.  గత కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం బాధాకరం.  ఇకపోతే బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ  యష్ రాజ్ ఫిలింస్ ప్రస్థానంలో భర్త యష్ చోప్రాతో పాటు పమేలా చోప్రా కీలక పాత్ర పోషించారు. కేవలం కుటుంబ బాధ్యతలకు మాత్రమే ఆవిడ పరిమితం కాకుండా రచయితగా, క్యాస్టింగ్ డిజైనర్ గా,  నేపద్య గాయనిగా కూడా పేరు తెచ్చుకున్న ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు. ఇకపోతే యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన పలు చిత్రాలలో కూడా ఈమె పాటలు కూడా పాడారు.. సినిమాల స్క్రిప్ట్ రచనల్లో కూడా పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఆమె కుమారులు ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రా,  యష్ రాజ్  ఫిలింస్ బ్యానర్ సారథ్యం వహిస్తున్నారు. ఇక పమేలా చోప్రా మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.  అలాగే హృతిక్ రోషన్,  అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ తదితరులు ముంబైలోని నిర్మాత ఆదిత్య చోప్రా గృహానికి చేరుకొని పమేల చోప్రా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.  ఇకపోతే ఈమె చేసిన సేవలను గుర్తించుకొని తాజాగా వైఆర్ఎఫ్ వినూత్నమైన ఒక వీడియోతో మన ముందుకు వచ్చింది. ట్విట్టర్ మరియు యూట్యూబ్ లో దీనిని షేర్ చేస్తూ వైఆర్ఎఫ్ ఒక అధికారిక ప్రకటన చేసింది.

ముఖ్యంగా బాలీవుడ్లో ఆమె పాడిన కొన్ని పాటలను ఒకచోట చేర్చి ఆ వీడియోను షేర్ చేసింది. ఇందులో పమేలా దిల్వాలే దుల్హనియా లేజాయేంగే ఆల్బమ్ కు ఎలా కట్ చెప్పారో కూడా తెలిపారు.. అసలు నేను లతాజీ కి డబ్బింగ్ చెప్పాను. నేను డబ్బింగ్ చెబుతున్నాను కానీ నాకున్న గొప్ప ఆనందం ఏమిటంటే మిమ్మల్ని మళ్లీ గుర్తు చేసుకోవడం. జతిన్ లలిత్ నాకు చెప్పారు.. లేదు మీరు చాలా బాగా పాడారు.. దానికి డబ్బింగ్ చేయించడం మాకు ఇష్టం లేదు అని. ఆ సమయంలో నాకేం అనిపించిందో చెప్పలేను అంటూ తెలిపింది.

1995లో దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, 1989లో వచ్చిన చాందిని, 1989లో వచ్చిన మై నే ససురాల్ నహి జావుంగి, 1993లో ఐనా, 1993లో వచ్చిన మేరీ బన్నో కి ఆయేగీ భరత్, 1993లో డర్ మూవీ నుంచి మేరే మా నే లాగా దియే వంటి ఎన్నో చిత్రాలకు పమేలా చోప్రా తన గాత్రాన్ని అందించారు. ఇక ఈ సినిమాల్లోని కొన్ని పాటలను ఒక వీడియోగా పంచుకుంటూ ఇలా వ్రాసుకొచ్చారు.. శ్రీమతి పమేలా చోప్రాకు మా హృదయపూర్వక నివాళి.  ఆమె జ్ఞాపకాలు మన హృదయాల్లో చెక్కబడి ఉంటాయి. ఇక మన జీవితం ఉన్నంతవరకు ఆమె మన నుంచి దూరం కాలేరు అంటూ రాసుకు వచ్చారు. 

ఇకపోతే పమేలా 2023 నెట్ ఫ్లెక్స్ డాక్యు సిరీస్ ది రొమాంటిక్స్ లో చివరిసారి స్క్రీన్ పై కనిపించారు.  అక్కడ ఆమె సినిమా కెరియర్, తమ ప్రొడక్షన్ హౌస్ వారసత్వం గురించి మాట్లాడారు. దాదాపు 15 రోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆమె లీలావతి ఆసుపత్రిలో వెంటిలేటర్ పైనే ఉన్నారు. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె ప్రాణాలను కాపాడలేకపోయాము అంటూ ముంబై లీలావతి హాస్పిటల్ డాక్టర్ ప్రహల్లాద ప్రభుదేశాయ్ తెలిపారు.