క‌రాచీ.. ఇక్క‌డ అస‌లు బ‌త‌క‌లేమ‌ట‌!

అత్యధిక జనాభా గల సిటీ కరాచీ : పాకిస్థాన్ లో అతిపెద్ద నగరం కరాచీ. ఈ సిటీ ని ప్రపంచం లోనే అత్యధిక జనాభా ఉన్న సిటీలలో 12 వ సిటీ గా పరిగణిస్తారు. కేవలం ఈ ఒక్క సిటీ లోనే 20 లక్షల మందికి పైగా జనాభా ఉంటారు. ఒకప్పుడు ఇది పాకిస్థాన్ కి రాజధాని కూడా. ఈ సిటీ ని బేటా గ్లోబల్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ […]

Share:

అత్యధిక జనాభా గల సిటీ కరాచీ :

పాకిస్థాన్ లో అతిపెద్ద నగరం కరాచీ. ఈ సిటీ ని ప్రపంచం లోనే అత్యధిక జనాభా ఉన్న సిటీలలో 12 వ సిటీ గా పరిగణిస్తారు. కేవలం ఈ ఒక్క సిటీ లోనే 20 లక్షల మందికి పైగా జనాభా ఉంటారు. ఒకప్పుడు ఇది పాకిస్థాన్ కి రాజధాని కూడా. ఈ సిటీ ని బేటా గ్లోబల్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఫైనాన్సియల్ సెంటర్ గా పరిగణిస్తుంది, అంతే కాకుండా ప్రతీ ఏడాది ఈ సిటీ నుండి 200 బిలియన్ డాలర్ల జీడీపీ ని కూడా నమోదు చేసుకుంటుంది. అలాంటి ప్రసిద్ధి గాంచిన ఈ సిటీ ఇప్పుడు ప్రపంచం లోనే నివసించడానికి అసలు ఏమాత్రం యోగ్యకరమైనా సిటీ కాదని అంటుంది ఎకనామిక్ ఇంటలిజెన్స్ యూనిట్ సంస్థ. ఈ సంస్థ లండన్ కి చెందిన అత్యంత విశ్వసనీయమైన ఫలితాలను ఇచ్చే సర్వే ఏజెన్సీ సంస్థ.

ప్రపంచం లోనే ఎవ్వరూ నివసించడానికి ఇష్టపడని సిటీ గా దిగజారిపోయిన కరాచీ :

ఈ సంస్థ 2023 వ సంవత్సరం కి గాను గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ లిస్ట్ ని విడుదల చేసింది. ఈ లిస్ట్ లో సుమారుగా 173 సిటీలు ఉండగా, వాటిల్లో కరాచీ సిటీ 169 వ స్థానం లో ఉంది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేసి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా ఆస్తి నష్టం కూడా దారుణంగా చేసింది క‌రాచీ. అయితే ఈ సందర్భంగా ఈ ప్రపంచం లో ఉన్న అత్యంత పాపులర్ సిటీస్ మళ్ళీ పూర్వ వైభవం ని సొంతం చేసుకున్నాయి లేదా అనే సర్వే ని నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణ , సుస్థిరత, సంస్కృతి , విద్య మరియు మౌలిక సదుపాయాలను ఆధారంగా తీసుకొని ఈ సర్వే ని నిర్వహించారు. ఒకప్పుడు ఇవన్నీ సరిగ్గా మైంటైన్ చేస్తూ మంచి పేరు ని దక్కించుకున్న కరాచీ సిటీ, ఇప్పుడు మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. అందువల్లే కరాచీ ఇంత తక్కువ స్థాయికి దిగజారిపోయింది అంటున్నారు.

ప్రపంచం లోనే అత్యల్ప నివాసయోగ్యమైన నగరాలలో టాప్ 5 స్థానాలలో 5 స్థానం లో స్థిరపడింది కరాచీ. దీనికంటే అత్యల్ప స్థాయిలో లాగోస్, అల్జీర్స్, ట్రిపోలీ మరియు డమాస్కస్ వంటి నగరాలు ఉన్నాయి. అయితే ఈ నివాస యోగ్యతని అంచనా వేసేందుకు 1-100 కి మధ్యలో మనం ఎంత రేటింగ్ అయినా ఇవ్వొచ్చు. 1 ఇస్తే అత్యంత నీచం అని అర్థం, అలాగే 100 ఇచ్చారంటే మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది అని అర్థం. కరాచీ నగరానికి మొత్తం మీద యావరేజి గా 42.5  మాత్రమే మార్కులు దక్కాయి. అయితే లో విద్య విషయం లో మాత్రం కరాచీ కి బెస్ట్ రేటింగ్స్ వచ్చాయి. అక్కడ ఉన్న ప్రస్తుత విద్య వ్యవస్థ సౌకర్యాలను పరిగణలోకి తీసుకొని జనాలు 75 మార్కులు ఇచ్చారు. కానీ స్థిరత్వ సూచిక లో మాత్రం కేవలం 20 మార్కులు మాత్రమే దక్కాయి. అలాగే ఆరోగ్య సంరక్షణ విషయం లో 50 మార్కులు, మౌలిక సదుపాయాల్లో 51.8 మార్కులు , పర్యావరణ సంరక్షణ లో 38.7 మార్కులు మరియు సంస్కృతి లో కూడా అదే రేంజ్ మార్కులను దక్కించుకుంది. అలా మొత్తం మీద యావరేజి తీస్తే 42.5 మార్కులు మాత్రమే వచ్చాయి. EUI ఇండెక్స్ లో కరాచీ హిస్టరీ గతం లో కూడా పెద్దగా ఏమి బాగోలేదు. 2019 వ సంవత్సరాలలో 140 నగరాలకు లెక్కగడితే కరాచీ 136 వ స్థానం లో నిల్చింది. గత ఏడాది 140 లో 134 వ స్థానం లో నిల్చింది.