భార‌త పౌర‌స‌త్వం కోసం రాష్ట్ర‌ప‌తికి సీమా హైద‌ర్ లేఖ‌

పాక్ మహిళ సీమా హైదర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను పాకిస్థాన్ తిరిగి వెల్లను అని .. భారత్‌లోనే ఉంటానని సీమా హైదర్ మొండికేస్తోంది. పబ్జీ గేమ్‌లో యూపీ యువకుడితో.. పాక్ మహిళ సీమా హైద‌ర్కు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అతడి కోసం పాక్ నుంచి నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మే నెలలో ఆమె వచ్చేసింది.  సీమా హైదర్‌ తరపున సచిన్‌ తండ్రి ఓ న్యాయవాది సాయంతో రాష్ట్రపతి ముందు […]

Share:

పాక్ మహిళ సీమా హైదర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను పాకిస్థాన్ తిరిగి వెల్లను అని .. భారత్‌లోనే ఉంటానని సీమా హైదర్ మొండికేస్తోంది. పబ్జీ గేమ్‌లో యూపీ యువకుడితో.. పాక్ మహిళ సీమా హైద‌ర్కు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అతడి కోసం పాక్ నుంచి నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మే నెలలో ఆమె వచ్చేసింది. 

సీమా హైదర్‌ తరపున సచిన్‌ తండ్రి ఓ న్యాయవాది సాయంతో రాష్ట్రపతి ముందు ఈ పిటిషన్‌ దాఖలు చేసినట్లు కొన్ని  కథనాలు వెల్లడించాయి.ఇప్పుడు సీమా హైదర్ కేసు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. తాను భారత్‌లోనే జీవిస్తానని.. అందుకు భారత పౌరసత్వం కల్పించాలని ఆమె రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు అభ్యర్థన చేసింది. “నోయిడా నివాసి ఆయన సచిన్‌ను పెళ్లిచేసుకోవడంతో ఆమె ఇప్పుడు భారత కోడలు

అయ్యింది. అందువల్ల ఆమెకు భారత పౌరసత్వం ఇవ్వాలి అని పిటిషన్‌ వేశాం” అని సీమా తరపు న్యాయవాది తెలిపారు.

సీమా హైదర్‌…. సచిన్ మీనా ప్రేమ కథ ….

కోవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సచిన్ మీనా, పాకిస్థాన్‌ సింధు ప్రావిన్సుల్లోని ఖైరాపూర్ జిల్లాకు చెందిన సీమా హైదర్‌ లకు పబ్‌జీలో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం స్నేహంగా మారి.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే, సీమాకు అప్పటికే వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ, ప్రియుడి కోసం ఆమె ఈ ఏడాది మార్చిలో కరాచీ నుంచి బయలుదేరి దుబాయ్‌ మీదుగా నేపాల్‌కు చేరుకుంది. సచిన్, సీమా మొదటిసారి ప్రత్యక్షంగా నేపాల్‌లోనే కలుసుకున్నారు. అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు.

నా భర్త సచిన్‌ భారతీయుడు.. నేనూ భారతీయురాలిగానే భావిస్తున్నా’ అని ఓ వార్తాసంస్థతో తెలిపింది. పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని, అక్కడ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంది

అంతేకాదు, తాను హిందువుగా మారి, తన పేరును సీమా సచిన్‌గా మార్చుకున్నట్టు ఆమె తెలిపారు. ‘హిందూ, ముస్లిం మతాల్లో సీమా పేరు కామన్.. కాబట్టి నా మొదటి పేరును సచిన మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు.. నన్ను నేను సీమ లేదా సీమ సచిన్‌గా భావిస్తాను.. మా పిల్లల పేర్లను రాజ్, ప్రియాంక, పరి, మున్నీగా మార్చాం’ అని తెలిపింది. ప్రేమించిన వ్యక్తి కోసం తన నలుగురు పిల్లలతో కలిసి

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమాను జులై 4న యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ వలసదారులకు ఆశ్రయమిచ్చిన కారణంగా సచిన్‌ మీనాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం వారికి బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం

వీరిద్దరూ నోయిడాలో కలిసే ఉంటున్నారు.

అయితే, సీమ. పాక్‌ ఏజెంట్‌ అయి ఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు ముమ్మర దర్యాప్త చేపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు అటు 19 దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా తన పిల్లలతో కలిసి పాక్‌ నుంచి ముందుగా నేపాల్‌కు చేరుకున్న సీమా… తన పేరును ప్రీతీ గా  చెప్పి భారత్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. నేపాల్‌లోని పోఖారాలో బస్సు ఎక్కినప్పుడు ఆమె ఇదే పేరు చెప్పినట్లు బస్సు నిర్వాహకులు తెలిపారు. ఐడీ కార్డు చూపించాలని అడిగినప్పుడు… తాను భారతీయురాలినేనని, ఆధార్‌ కార్డు కూడా ఉందని ఎటువంటి బెరుకు లేకుండా చెప్పినట్లు వారు వెల్లడించారు 

ఈ కేసులో మరిన్ని విషయాలు బయటికి తీసుకువచ్చేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ – ఎన్ఐఏ అధికారులు కూడా రంగంలోకి దిగారు  అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని సీమా హైదర్.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు అభ్యర్థన పెట్టుకోవడం సంచలనంగా మారింది.