ఇండియా, పాక్ లకు మరో ముప్పు

ఇండియా, పాకిస్తాన్ దేశాలు విరోధులు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు దేశాలకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గనుక ఒక్కసారి వింటే ఎవరికైనా సరే గుండె షివర్ అవడం కామన్. రాబోయే రోజుల్లో ఈ దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆ స్టడీ బట్టబయలు చేసింది.  కారణం అదే..  ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కారణాల్లో గ్లోబల్ వార్మింగ్ ఒకటి. ఈ దేశాల్లో కూడా గ్లోబల్ వార్మింగ్ […]

Share:

ఇండియా, పాకిస్తాన్ దేశాలు విరోధులు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు దేశాలకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గనుక ఒక్కసారి వింటే ఎవరికైనా సరే గుండె షివర్ అవడం కామన్. రాబోయే రోజుల్లో ఈ దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆ స్టడీ బట్టబయలు చేసింది. 

కారణం అదే.. 

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కారణాల్లో గ్లోబల్ వార్మింగ్ ఒకటి. ఈ దేశాల్లో కూడా గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఒక స్టడీ వెల్లడించింది. ఇది భారతదేశం మరియు సింధు లోయతో సహా ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగిన కొన్ని ప్రాంతాలలో గుండెపోటు మరియు వేడి స్ట్రోక్‌ లను ప్రేరేపించే అవకాశం ఉందని ఈ స్టడీ అంచనా వేసింది. పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌ మెంట్, పర్డ్యూ యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ మరియు పర్డ్యూ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్ లు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

ఈ పరిశోధలనలు “ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్”లో ప్రచురించబడ్డాయి. రోజురోజుకూ భూ గ్రహం 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి వేడెక్కుతున్నట్లు సూచించింది. పారిశ్రామిక పూర్వ స్థాయిలు మానవ ఆరోగ్యానికి వినాశకరమైనవని ఈ స్టడీ తెలిపింది. హీట్ స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి వేడి-సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ముందు మానవ శరీరాలు వేడి మరియు తేమ యొక్క నిర్దిష్ట కలయికలను మాత్రమే తీసుకోగలవు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే.. పాకిస్తాన్ మరియు భారతదేశంలోని సింధు నది లోయలో నివాసం ఉంటున్న 2.2 బిలియన్ల మంది అలాగే తూర్పు చైనాలో నివసిస్తున్నటువంటి 1 బిలియన్ ప్రజలు మరియు సబ్-సహారా ఆఫ్రికాలో 800 మిలియన్ల మంది ప్రజలు గంటల కొద్దీ వేడిని అనుభవిస్తారని ఈ అధ్యయనం సూచిస్తుంది. 

మన నగరాలు కూడా.. 

ఈ ప్రభావంతో వార్షిక వేడిని అనుభవించే వాటిలో మన దేశంలో ఉన్న ప్రముఖ నగరాలు కూడా ఉన్నాయి. పాక్ లోని కొన్ని నగరాలు, చైనాలోని కొన్ని నగరాలు ఉన్నాయి. ఈ వార్షిక వేడి వేవ్ యొక్క భారాన్ని భరించే నగరాలలో ఢిల్లీ, కోల్‌కతా, షాంఘై, ముల్తాన్, నాన్జింగ్ మరియు వుహాన్ ఉన్నాయి. ఈ  ప్రాంతాలు తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లో ఉన్నందున, ప్రజలకు ఎయిర్ కండిషనర్లు లేదా వారి శరీరాన్ని చల్లబరచడానికి ఇతర ప్రభావవంతమైన మార్గాలు అందుబాటులో ఉండకపోవచ్చు. 

గ్రహం యొక్క గ్లోబల్ వార్మింగ్ పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 3 డిగ్రీల సెల్సియస్‌కు కొనసాగితే హీట్ లెవెల్స్ తూర్పు సముద్ర తీరం మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్యలో ఉన్నటువంటి ఫ్లోరిడా నుంచి న్యూయార్క్ మరియు హ్యూస్టన్ నుంచి చికాగో వరకు ప్రభావితం చేయవచ్చనని ఈ స్టడీ వెల్లడించింది. దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియా కూడా విపరీతమైన వేడిని అనుభవిస్తాయని ఈ పరిశోధనలో తేలింది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రజలు అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే తక్కువ బాధను అనుభవిస్తారని కూడా ఈ సర్వే తెలిపింది. ఎందుకంటే అక్కడ ఎయిర్ కండీషన్స్ వంటి పరికరాలు ఉండడం వలన వారు ఈజీగా వేడిని తట్టుకుంటారని సర్వే వెల్లడించింది. 

అంతే కాకుండా ఇక్కడ వృద్ధులు మరియు అనారోగ్యంతో బాధపడేవారు చనిపోవచ్చునని కూడా తెలిపింది. బిలియన్ల మంది పేదలు బాధపడడం లేదా చాలా మంది చనిపోవచ్చునని వెల్లడించింది. సంపన్న దేశాలు కూడా ఈ వేడికి గురవుతాయని కానీ అక్కడి ప్రజలకు ఉన్న పరికరాల వల్ల వారు ఎక్కువగా సఫర్ కాకపోవచ్చునని సర్వే తెలిపింది. గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను, ముఖ్యంగా శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించాలని పరిశోధకులు తెలిపారు. ఒక వేళ మనం మార్పులు చేయకుండా ఇలాగే కొనసాగితే మధ్యతరగతి, అల్పాదాయ దేశాల ప్రజలు ఎక్కువగా నష్టపోతాయని వారు హెచ్చరించారు. కావున మనం తొందరగా మన అలవాట్లను మార్చుకోవాలి.