యువకుడి కోసం పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన మహిళ

అయితే విషయానికి వస్తే పాకిస్తాన్లోని ఒక మహిళ ఒక యువకుడికి పబ్జి ద్వారా పరిచయమైంది. 20 సంవత్సరాల ఆ యువతి తన 4 పిల్లలతో సహా భారతదేశానికి వచ్చింది.  పోలీసుల ఏం చెప్తున్నారు:  పాకిస్తాన్ కి చెందిన ఒక మహిళ తన నలుగురు పిల్లలతో సహా నోయిడాలో ఇల్లీగల్గా ఉంటుంది. అయితే పబ్జి ద్వారా పరిచయమైన నోయిడా వ్యక్తి, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ మహిళకు ఆశ్రయం కల్పించాడు. మహిళతో 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే […]

Share:

అయితే విషయానికి వస్తే పాకిస్తాన్లోని ఒక మహిళ ఒక యువకుడికి పబ్జి ద్వారా పరిచయమైంది. 20 సంవత్సరాల ఆ యువతి తన 4 పిల్లలతో సహా భారతదేశానికి వచ్చింది. 

పోలీసుల ఏం చెప్తున్నారు: 

పాకిస్తాన్ కి చెందిన ఒక మహిళ తన నలుగురు పిల్లలతో సహా నోయిడాలో ఇల్లీగల్గా ఉంటుంది. అయితే పబ్జి ద్వారా పరిచయమైన నోయిడా వ్యక్తి, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ మహిళకు ఆశ్రయం కల్పించాడు. మహిళతో 4 పిల్లలు కూడా ఉన్నారు. అయితే సోమవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం, పబ్జి ద్వారా పరిచయమే ఆ మహిళను భారతదేశానికి రప్పించినట్లు వెల్లడించారు. 

అయితే పాకిస్తానీ మహిళను, ఆహ్వానించిన ఆ యువకుడు తన అద్దె ఇంట్లోనే ఉంచినట్లు సమాచారం. నోయిడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సాద్ మియా ఖాన్ విలేకరులతో మాట్లాడుతూ, ఆ మహిళ అదే విధంగా తన నలుగురు పిల్లలతో సహా తనకి ఆశ్రయం ఇచ్చిన ఆ యువకుడ్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

అంతేకాకుండా వారిద్దరూ కొన్ని రోజుల క్రితం ఆన్లైన్ గేమ్ ‘పబ్జి’ ద్వారా పరిచయమైనట్టు తెలిసింది. అయితే ప్రస్తుతానికి వాళ్లందర్నీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఆ మహిళ ఇల్లీగల్గా ఇండియాకి ఎలా వచ్చింది: 

అయితే ఆన్లైన్ గేమ్ పబ్జి ద్వారా పరిచయమైన ఆ పాకిస్తానీ మహిళ, తన నలుగురు పిల్లలతో సహా ఆ యువకుడు ఆశ్రయం కల్పించిన, నోయిడాలోని అతని అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం కిందటి నెల ఆ మహిళా తన నలుగురు పిల్లలతో నేపాల్ ప్రాంతం ద్వారా ఇండియాలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోకి ఎంటర్ అయ్యి బస్సులో ప్రయాణించి నోయిడా కి చేరుకుంది. ఆ తర్వాత ఆ యువకుడు ఉంటున్న రాబుపర ఏరియాలోని, ఒక అద్దె ఇంట్లో వారందరూ కలిసి ఉంటున్నట్లు సమాచారం. 

ఆన్లైన్ గేమ్ పరిచయాలు: 

ఇటీవల కాలంలో ఆన్లైన్ ద్వారా పరిచయాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం మన చూసిన పాకిస్తానీ మహిళ యువకుడికి పబ్జి ద్వారా పరిచయం అయినట్లే, మరో మహిళ ఆన్లైన్ గేమ్ ద్వారా యువకుడితో పరిచయం పెంచుకుంది. అంతేకాకుండా, తమ కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం, ఇస్లాం మతానికి చెందిన ఆ యువకుడు ఆమెని తన హిందూ మతానికి సంబంధించినవి పాటించొద్దు అని, బొట్టు పెట్టుకోవద్దని, అంతేకాకుండా కురాన్ ఎలా చదవాలి, ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలను కూడా ఆ మహిళతో చెప్పినట్లు, ఆ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే ఆ మహిళకు పరిచయమైన ఆ యువకుడు ఉద్దేశం అది కాదు అని ఆ యువకుడి స్నేహితుడు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఆ మహిళ సోదరుడకి ఈ సమస్యను మరింత పెంచేందుకు ఇష్టం లేక తను పెట్టిన కేసు వాపస్ తీసుకోవడం కూడా జరిగింది.

“కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆ వ్యక్తి తన సోదరితో చాటింగ్ చేసేవాడని. అంతేకాకుండా తన సోదరిని ఇస్లామిక్ మతంలోకి మారమని కోరినట్లు దాని గురించి చాలా సార్లు అడిగినట్లు, అంతేకాకుండా, హిందూ మతానికి సంబంధించిన వాటిని పాటించొద్దని ప్రేరేపించినట్లు, వ్యక్తి కోరారు. గేమింగ్ యాప్ ద్వారా వారిద్దరికీ పరిచయం ఏర్పడిందని. అంతేకాకుండా తర్వాత వాట్సాప్ లో కూడా చాటింగ్ చేసుకునేవారిని. కానీ ఇది ఇంతటితో ముగియాలని, ఎలాంటి అవాంఛిత సందర్భం ఎదురు కాకూడదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు” అని ఆ మహిళా సోదరుడైన శర్మ గతంలో చెప్పారు.