ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించిన చిదంబరం

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ చిదంబరం వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన BJD-YSRCP పార్టీల గురించి ప్రస్తావించారు. అసలు ఆ పార్టీలు ఢిల్లీ సర్వీస్ అథారిటీ బిల్ కు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో కూడా ఆయనకి అర్థం కాలేదన్నారు. అయితే బీజూ జనతా దాల్ పార్టీ నవీన్ పట్నాయక్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ సర్వీస్ ఆర్డినెన్స్ మార్చాలి అని వెలుగులోకి వచ్చిన బిల్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో, […]

Share:

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ చిదంబరం వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బిల్లుకు మద్దతు ఇచ్చిన BJD-YSRCP పార్టీల గురించి ప్రస్తావించారు. అసలు ఆ పార్టీలు ఢిల్లీ సర్వీస్ అథారిటీ బిల్ కు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో కూడా ఆయనకి అర్థం కాలేదన్నారు. అయితే బీజూ జనతా దాల్ పార్టీ నవీన్ పట్నాయక్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ సర్వీస్ ఆర్డినెన్స్ మార్చాలి అని వెలుగులోకి వచ్చిన బిల్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో, అసలు ఆ బిల్లుకు సంబంధించి ఎటువంటి లాభం ఆ రెండు పార్టీలకు కనిపించిందో ఆయనకు అర్థం కాలేదు అన్నారు. 

ట్విట్టర్ వేదికగా వాక్యలు: 

కాంగ్రెస్ పార్టీ చిదంబరం బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, బీజూ జనతా దాల్ పార్టీ నవీన్ పట్నాయక్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ సర్వీస్ ఆర్డినెన్స్ మార్చాలి అని వెలుగులోకి వచ్చిన బిల్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో, అసలు ఆ బిల్లుకు సంబంధించి ఎటువంటి లాభం ఆ రెండు పార్టీలకు కనిపించిందో ఆయనకు అర్థం కాలేదు అన్నారు. అసలు ఆ పార్టీలు ఢిల్లీ సర్వీస్ అథారిటీ బిల్ కు సపోర్ట్ ఎందుకు చేస్తున్నారో కూడా ఆయనకి అర్థం కాలేదన్నారు. 

అయితే ఇటువంటి బిల్లులకు మద్దతు ఇచ్చే ఏ పార్టీ వాళ్ళైనా సరే, దేశానికి విరోధులు గానే ఉంటారు తప్పిస్తే, దేశంలో ఒక మంచి పాలన కోసం తోడ్పడే వారుగా ఎప్పటికీ ఉండబోరు అని ఆయన ప్రస్తావించారు. 

అవిశ్వాస తీర్మానం  బిల్లు: 

అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడవలసి ఉన్న సమయాన్ని డిబేట్ జరిపి, సమయాన్ని వృధా కానివ్వకుండా ఏదో ఒక పరిష్కారం నిర్ణయించుకోవచ్చని, అంతేకాకుండా చట్టాన్ని రూపొందించడం మరియు ప్రజా ప్రాముఖ్యత ఉన్న సమస్యలను లేవనెత్తడం మన రాజ్యాంగ విధి అని స్పీకర్ అంగీకరించారు. అయితే ఇంతకుముందు సభ ఆమోదించిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత, ఎటువంటి శాసనసభ లేదా ఇతర ప్రజా ప్రాముఖ్యత ఉన్న ఇతర విషయాలను చేపట్టడాన్ని, రూల్ 198 పక్కన పెట్టడం జరగదు అని కాంగ్రెస్ అభ్యంతరాలను తోసిపుచ్చారు స్పీకర్.

అవిశ్వాస తీర్మానంపై ఈ వారం కూడా చర్చ జరిగే అవకాశం ఉందని, చర్చ జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్ట్ 1, మంగళవారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిబేట్ గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఆయన ఆ క్రమంలో మహారాష్ట్రలో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి బుధ, గురువారాల్లో అవిశ్వాస తీర్మానంపై డిబేట్, సమాధానాలు, ఓటింగ్‌ జరిగే అవకాశం ఉండొచ్చు అని పలువురు అభిప్రాయపడతారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి. ఢిల్లీ బ్యూరోక్రాట్స్ నియంత్రణ బిల్లు లోక్‌సభలో అమలు జరగడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెండింగ్‌లో ఉన్నప్పుడు బిల్లులు ఆమోదింపజేయగలరా అని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రశ్నించింది. 

ప్రభుత్వానికి మెజారిటీ మద్దతు: 

రాజ్యసభలో ప్రస్తుతం 238 మంది సభ్యులు ఉన్నారు, మెజారిటీ మార్క్ 120. బీజేపీ, దాని మిత్రపక్షాలకు 105 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇందులో తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ ఎంపీల మద్దతు ఉంటుంది. అధికార పార్టీ కూడా ఐదుగురు, ఇద్దరు ఇండిపెండెంట్ ఎంపీల మద్దతు ఉండొచ్చు, అయితే ఇప్పుడు మద్దతు ఇచ్చే వారి సంఖ్య 121కు చేరుకుంది. దాదాపు 105 మంది ప్రతిపక్ష సభ్యులు ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రోజు, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం మరియు ఢిల్లీ బిల్లు రెండింటిలోనూ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని ప్రకటించింది, మద్దతు ఇచ్చే వారి సంఖ్య చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.