రాహుల్ గాంధీ అనర్హత వేటుపై పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు..

“ఎవరికైనా రెండేళ్ల శిక్ష ఎప్పుడైనా పడిందా?” అని మండిపాటు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. రాహుల్ ని అనర్హుడిగా ప్రకటించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్ సభ, రాజ్యసభలో ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ పై తీసుకున్న చర్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు నల్ల దుస్తుల్లో పార్లమెంట్ కి వచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాల సభ్యులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళనకు […]

Share:

“ఎవరికైనా రెండేళ్ల శిక్ష ఎప్పుడైనా పడిందా?” అని మండిపాటు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. రాహుల్ ని అనర్హుడిగా ప్రకటించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్ సభ, రాజ్యసభలో ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ పై తీసుకున్న చర్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు నల్ల దుస్తుల్లో పార్లమెంట్ కి వచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాల సభ్యులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో  రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి, న్యాయ ప్రముఖుడు పి చిదంబరం స్పందించారు. 

ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో ట్రయల్ కోర్టు వ్యవహరించిన వేగాన్ని చూస్తే.. ఉసేన్ బోల్డ్ కూడా ఆశ్చర్యపోతారని.. ఆ వెంటనే రాహుల్ గాంధీని అనర్హులుగా ప్రకటించారని విమర్శించారు. ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో ఇదే అత్యంత కఠినమైన శిక్ష అని తాను భావిస్తున్నానని అన్నారు.  ఈ వ్యవహరాన్ని పియూష్ గోయల్ ,  ప్రభుత్వం ఎందుకు వివరించడానికి ప్రయత్నించడం లేదని పి చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి పరువు తీసినందుకు ఇప్పటి వరకు ఎవరికైనా రెండేళ్ల శిక్ష ఎప్పుడైనా పడిందా ? అని ప్రభుత్వాన్ని ఏకిపారేసారు.  చట్టాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.  

తృణమూల్ కాంగ్రెస్ ఎంట్రీ ..

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు అంశంపై సుమారు అన్ని విపక్షాలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నాయి. ఈ నిర్ణయానికి నిరసనగా సోమవారం తృణమూల్ ఆకస్మిక ప్రవేశం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సమాన దూరం పాటిస్తామని ప్రకటించే.. తృణమూల్ కాంగ్రెస్ ఎంట్రీ  ప్రతిపక్ష ఐక్యత సాధించిన అరుదైన విజయాల్లో ఒకటిగా నిలుస్తుంది.

కాగా.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ప్రధాన వ్యూహాత్మక సమావేశం జరిగింది. TMC తరపున ప్రసూన్ బెనర్జీ, జవహర్ సర్కార్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీపై పార్లమెంట్‌కు అనర్హత వేటు వేయడంపై విపక్షాల వ్యూహంపై చర్చ జరిగింది. మిగతా విషయాలలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న విపక్షాలు సైతం ప్రతిపక్షాన్ని ఈ విషయంలో ఎదిరించేందుకు సిద్ధం అవ్వడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 

రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. భారత రాష్ట్ర సమితి, శివసేన తో కలిసి బ్యాక్ బ్యాడ్జ్ పెట్టుకుని నిరసనలో చేరాయి.  రాహుల్ గాంధీ క్షమాపణ కోరడంపై బీజేపీపై “సావర్కర్ కాదు” అని వ్యాఖ్యానించిన తరువాత.. ఉద్ధవ్ థాకరే సావర్కర్‌ను తక్కువ చేయడం వల్ల ప్రతిపక్ష కూటమిలో చీలిక మొదలవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాలను పెంచుతుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీనే ప్రధాన లక్ష్యంగా చేసుకుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిదంబరం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.