పిల్లలతో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ఎందుకు మాట్లాడాలంటే..

ప్రపంచం ఎంత ముందుకెళ్తున్నా.. కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడలేం. అలాంటి వాటిలో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఒకటి. దీని గురించి చాలా విషయాలు పిల్లలకి ముందు నుంచే చెప్పడం అవసరమని కొంతమంది అంటే.. కొంతమంది అది అవసరం లేదని చెబుతుంటారు. వాస్తవానికి, లైంగిక అవగాహన అనేది ముఖ్య అంశం. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారికి ఈ విషయాల గురించి కచ్చితమైన అవగాహన ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.  అల్లో హెల్త్ అనే లైంగిక […]

Share:

ప్రపంచం ఎంత ముందుకెళ్తున్నా.. కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడలేం. అలాంటి వాటిలో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఒకటి. దీని గురించి చాలా విషయాలు పిల్లలకి ముందు నుంచే చెప్పడం అవసరమని కొంతమంది అంటే.. కొంతమంది అది అవసరం లేదని చెబుతుంటారు. వాస్తవానికి, లైంగిక అవగాహన అనేది ముఖ్య అంశం. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారికి ఈ విషయాల గురించి కచ్చితమైన అవగాహన ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. 

అల్లో హెల్త్ అనే లైంగిక ఆరోగ్య క్లినిక్ ఇటీవల నిర్వహించిన సర్వేలో 57.32% మంది భారతీయులు సెక్స్ ఎడ్యుకేషన్ కోసం అశ్లీలతపై ఆధారపడగా, 65.42% మంది సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. 530 భారతీయ నగరాల్లో 8,625 మంది పాల్గొన్న ఈ సర్వేలో, 59.77% మంది సెక్స్ సంబంధిత సమాచారం కోసం వారి స్నేహితులు మరియు తోటివారిపై ఆధారపడుతున్నారని, కేవలం 7.93% మంది సెక్స్ ఎడ్యుకేషన్ కోసం తమ తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారని పేర్కొంది. దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్  లేకపోవడంతో, ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

కేరళ ఫౌండేషన్‌లోని లైంగికత అధ్యాపకురాలు నిహారిక బీజా ప్రదౌష్ ఈ అంశంపై మాట్లాడారు.. అశ్లీలత, స్వీయ ఆనందం కోసం ఉద్దేశించబడింది. కానీ విద్య కోసం ఉద్దేశించబడలేదు. తరచుగా, ఇది స్త్రీలను లొంగదీసుకునేవారిగా చిత్రీకరిస్తుందని, చాలా మంది మహిళలు గృహ హింస మరియు లైంగిక వేధింపులను ఎదుర్కొంటారని, అటువంటి కంటెంట్‌ను వినియోగించడం వలన హాని శాశ్వతంగా ఉంటుందని, సంబంధాలు మరియు వివాహాలలో స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారు అనే దానిపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

శృంగారమంటే చాలా చోట్ల మానవ పునరుత్పత్తి మాత్రమే అని అనుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ, అది కేవలం ఆ ఒక్క దాని కోసమే కాకుండా హెల్దీ రిలేషన్స్‌ని మెంటెయిన్ చేస్తుంది. వయస్సుతో పాటు గౌరవప్రదమైన సంబంధాలని అభివృద్ధి చేయడం, మెంటెయిన్ చేయడమే కాకుండా సమాజంలో స్నేహాలు, కుటుంబ సంబంధాలు పరస్పర చర్యలని కూడా విస్తరిస్తుంది శృంగారం.

అయితే, డిజిటల్ యుగంలో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కొంత తప్పుడు సమాచారం ఉంది. దీని వల్ల యూత్ తప్పుదారి పట్టొచ్చు. కానీ, వారు యుక్త వయసుకి రాగానే సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ముందు నుంచే జాగ్రత్తపడొచ్చు. వయసులోకి వచ్చే కొద్దీ పిల్లల్లో శరీరాల్లో మార్పులు వస్తాయి. మనస్సు కూడా మారుతుంటుంది. అలాంటప్పుడు వారి ఆలోచనలు తప్పు దారి పట్టకుండా తల్లిదండ్రులు, టీచర్స్ ముందుగానే అవగాహన కల్పించాలి. దీని వల్ల వారు ఈ సహజ మార్పులను అర్థం చేసుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు.

సెక్స్ ఎడ్యుకేషన్ కోసం అశ్లీలతపై ఆధారపడటం హానికరమని లైంగికత విద్యావేత్తలు చెబుతున్నారు. పాఠశాలల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ను అమలు చేయడమే దీనికి పరిష్కారం. అదే విధంగా, సరైన అవగాహన లేకుండా ఉంటే పిల్లలని ఎవరైనా మాయమాటలు చెప్పి దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుంది. కానీ, ముందునుంచి పిల్లలకి దీని గురించి చెప్పడం, అనుచిత స్పర్శలపై పిల్లలకి అవగాహన కల్పించడమనేది చాలా అవసరం. లైంగిక విద్య గురించి అవగాహన కల్పించడంతో వారు ఎలాంటి తప్పుదారి పట్టకుండా ఉంటారు. దీని వల్ల లైంగిక సమస్యలు, అంటు వ్యాధుల రాకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చు. పిల్లల్ని వారి విలువలు, గోల్స్ రీచ్ అవ్వడానికి ఇవి హెల్ప్ చేస్తాయి.

పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారితో కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. అందులో లైంగిక విద్య కూడా ఒకటి. దీని వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. దీని చెప్పడానికి ఏ తల్లిదండ్రులు కూడా వెనుకడుగు వేయొద్దు. మీకు ఇబ్బందిగా ఉంటే మంచి డాక్టర్‌, ఎక్స్‌పర్ట్స్‌ సలహాలు, సూచనలు తీసుకోవడం మరువొద్దు.