హిమాచల్ ను అతాలకుతలం చేస్తున్న భారీ వర్షాలు

ఈశాన్య రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు జనజీవనం అస్థవ్యస్థం అవుతోంది. ఇప్పటికే చాలా మంది నిరాశ్రయులయ్యారు. అక్కడ ఉన్న నదులు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా అనుకోకుండా ప్రాణాలు కోల్పోతున్న వారితో అక్కడ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం […]

Share:

ఈశాన్య రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దెబ్బకు జనజీవనం అస్థవ్యస్థం అవుతోంది. ఇప్పటికే చాలా మంది నిరాశ్రయులయ్యారు. అక్కడ ఉన్న నదులు ఉప్పొంగడం, కొండచరియలు విరిగిపడడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా అనుకోకుండా ప్రాణాలు కోల్పోతున్న వారితో అక్కడ మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలుపుతున్నారు. 

అండగా నిలుస్తున్న  IAF

అక్కడి వర్షాలకు అనేక మంది అతలాకుతలం అవుతున్నారు. దీంతో ఎంతో మంది ఇళ్లు లేక గూడు కోల్పోయి అవస్థలు పడుతున్నారు. ఇలా అవస్థలు పడుతున్న వారికి  IAF తనదైన శైలిలో సహాయం చేస్తోంది. ఇప్పటి వరకు గత 72 గంటల్లో దాదాపు 1000 మందికి పైగా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు IAF తెలియజేసింది. ప్రతి ఏడు వర్షాకాలం వస్తే వర్షాలు కురవడం సహజం కానీ ఈ ఏడు పరిస్థితి మరింత దిగజారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఎడతెరిపి లేని వర్షాల వల్ల 1,762 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అంతే కాకుండా 8,952 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అంతే కాకుండా 113 కొండచరియలు కూడా విరిగిపడినట్లు అధికారులు వెల్లడించారు. 

పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారీ వర్షాలతో వాగులు వంకలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్న నదులు కూడా పొంగిపొర్లుతున్నాయి. దీంతో నష్టం అంచనా వేయలేని విధంగా ఉంటోందని అధికారులు తెలుపుతున్నారు. ఇంత విపత్తులో కూడా నేనున్నానంటూ IAF సేవలందిస్తోంది. వర్షాల వల్ల ఘోరంగా ప్రభావితం అయిన ప్రజలను ఎయిర్ లిఫ్ట్ చేస్తోంది. అదేదో సినిమాలో చూసిన విధంగానే ఇదంతా ఉంది. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. IAF అధికారుల చొరవతో ఇక్కడ ప్రాణనష్టం భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇంత నష్టాన్ని ఎప్పుడూ చవిచూడలేదని ఇది హిమాచల్ కు భారీ దెబ్బ అని పలు మీడియా సంస్థలు కూడా పేర్కొంటున్నాయి. 

నదుల ఉధృతి.. 

ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల బియాస్, సట్లెజ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నదుల మీద ఉన్న ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలా అనూహ్య రీతిలో నీటిమట్టాలు పెరగడంతో పొరుగున ఉన్న పంజాబ్ లోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయ్యాయి. ఇలా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తో పాటు జాతీయ విపత్తుల సంస్థ కూడా బరిలోకి దిగింది. 

సీఎం ప్రకటన

కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎంతో నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. కేవలం ఇళ్లు దెబ్బతినడం మాత్రమే కాకుండా అనేక వేల ఎకరాల్లో పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టం అంచనా వేయడానికి అనేక మంది అధికారులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. ఇక కొండచరియలు విరిగిపడడంతో  పలు రోడ్లు కూడా  అక్కడ బ్లాక్ అయ్యాయి. కేవలం చిన్న రహదారులనే కాకుండా జాతీయ రహదారులు కూడా కొండచరియలు విరిగిపడడం వల్ల బ్లాక్ అయ్యాయి. దీంతో నష్టం తీవ్రత  భారీగా పెరుగుతోంది. ఇలా వర్షాల వల్ల తీవ్రంగా ప్రభావితం అయిన ప్రాంతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అధికారులతో కలిసి పర్యటించారు.