ప్రపంచాన్నంటిన ఉల్లి కొరత

అనేక దేశాల్లో తీవ్రమైన కొరత కారణంగా ఉల్లి ధర విపరీతంగా పెరగడంతో ప్రజలు వంటకాలలో ఉల్లిపాయ వేసుకోవడం మానేసే పరిస్థితి వచ్చింది. ఈ ధరల పెరుగుదల మొదట్లో ఫిలిప్పీన్స్‌ని ప్రభావితం చేసింది. విపరీతమైన కొరత వల్ల ఉల్లిపాయలను అక్రమ రవాణా కూడా చేసే పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో ఉల్లి కొరత సంక్షోభాన్ని రేకెత్తిస్తోంది ప్రపంచ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఇంకా పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక సూచిస్తుంది. ఈ పరిస్థితిలో మొరాకో, టర్కీ, […]

Share:

అనేక దేశాల్లో తీవ్రమైన కొరత కారణంగా ఉల్లి ధర విపరీతంగా పెరగడంతో ప్రజలు వంటకాలలో ఉల్లిపాయ వేసుకోవడం మానేసే పరిస్థితి వచ్చింది. ఈ ధరల పెరుగుదల మొదట్లో ఫిలిప్పీన్స్‌ని ప్రభావితం చేసింది. విపరీతమైన కొరత వల్ల ఉల్లిపాయలను అక్రమ రవాణా కూడా చేసే పరిస్థితి వచ్చింది.

కొన్ని దేశాల్లో ఉల్లి కొరత సంక్షోభాన్ని రేకెత్తిస్తోంది

ప్రపంచ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఇంకా పెరుగుతున్నాయని, ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయని బ్లూమ్‌బెర్గ్ నివేదిక సూచిస్తుంది. ఈ పరిస్థితిలో మొరాకో, టర్కీ, కజికిస్థాన్ వంటి దేశాలు తమ వద్దనున్న నిత్యావసర సరుకులను సురక్షితంగా ఉంచేలా ప్రేరేపించింది.

ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకుల నివేదికలను బట్టి, ఉల్లిపాయల కొరత, క్యారెట్లు, టమోటాలు, బంగాళాదుంపల వంటి కూరగాయలు, యాపిల్స్ వంటి పండ్ల ధరలపై ప్రభావం చూపి, ప్రపంచవ్యాప్తంగా వాటి కొరతకు కారణమవుతుంది.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. సూపర్ మార్కెట్‌లలో కొన్ని పండ్లు, కూరగాయల కొనుగోళ్ళపై పరిమితులు పెట్టారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి దక్షిణ స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాలలో పంటలు తగ్గిపోవడమే కారణమని తెలుస్తోంది.

కూరల నుండి సలాడ్‌ల వరకు, అన్ని రకాల ప్రపంచ వంటకాలలో ఉపయోగించే ప్రధానమైన పంట ఉల్లిపాయ. ఇది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే కూరగాయలలో ఒకటి. సంవత్సరానికి సుమారు 106 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచం మొత్తంలో క్యారెట్లు, టర్నిప్‌లు, మిరపకాయలు, మిరియాలు, వెల్లుల్లి కలిపి ఎంత అవుతాయో, అన్ని ఉల్లిపాయలు ఉత్పత్తి అవుతాయి.

కొరతను ప్రేరేపించినది ఏమిటి?

ప్రతికూల వాతావరణం నుండి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వరకు అనేక కారణాల వల్ల ధరలు పెరిగాయి. గత సంవత్సరం పాకిస్తాన్‌ను తాకిన భయంకరమైన వరదలు, మధ్య ఆసియాలో మంచు కొండలు దెబ్బతినడం, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం వంటివి వీటిలో కొన్ని ప్రధాన కారణాలు.

ఉత్తర ఆఫ్రికాలో కూడా, తీవ్రమైన కరువు, విత్తనాలు, ఎరువుల ధరల కారణంగా ఉల్లిపాయల ఉత్పత్తి దెబ్బతింది. మొరాకోలో ఉల్లి సాగుదారులు ప్రతికూల వాతావరణం కారణంగా  దెబ్బతిన్నారు.

ఉల్లిపాయల కొరత ప్రపంచ ఆహార సంక్షోభానికి దారితీయవచ్చు

ఫిలిప్పీన్స్‌లో ఉల్లిపాయల కొరత గత కొన్ని నెలలుగా ఉప్పు, పంచదార వంటి ఇతర కీలక గృహోపకరణాల ధరలపై ప్రభావం చూపింది. ఉల్లిపాయల ధరలు చాలా పెరిగాయి. ఉల్లిపాయలు కొనాలంటే మాంసం కంటే ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. కొంతమంది విమాన సహాయకులు మిడిల్ ఈస్ట్ నుండి ఉల్లిపాయలని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు.

కజికిస్థాన్‌లో.. ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటుతున్నందున అధికారులు వాటిని నిల్వ చేయవలవలసి వచ్చింది. స్థానిక సూపర్ మార్కెట్‌లలో ఉల్లిపాయలను భద్ర పరచడానికి రద్దీ ఉన్నందున ఉల్లిపాయల బస్తాలను కొనుగోలు చేయవద్దని వాణిజ్య మంత్రి ప్రజలను కోరారు. ఇది ఎగుమతి నిషేధానికి అదనంగా ఉంది. ఈ చర్యను కజికిస్థాన్‌, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ ఇటీవల ప్రవేశపెట్టాయి. అజర్‌బైజాన్ కూడా అమ్మకాలపై పరిమితిని విధించింది. అయితే బెలారస్ సరుకులకు లైసెన్స్ ఇస్తుందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక జోడించింది.

ఉల్లి ధరలలో తీవ్రమైన పెరుగుదల ఒక పెద్ద సవాలుగా ఉంది, ఎందుకంటే ఇది పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు, పండ్ల ధరలను పెంచడం ద్వారా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని రేకెత్తిస్తుంది. యునైటెడ్ నేషన్స్ డేటా ప్రకారం.. ప్రపంచంలో 3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఎటువంటి దారుణమైన ఇబ్బందులను చూడవలసి వస్తోందో అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.