బీజేపీ, అన్నాడీఎంకేపై డీఎంకే మంత్రి సెటైర్లు

తమిళ రాజకీయాల్లో ఘోరమైన కుదుపు సంభవించింది. ఎన్నో రోజులుగా కలిసి ఉన్న బీజేపీ-అన్నాడీఎంకే పార్టీలు విడిపోయాయి. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే పార్టీ ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి ఇప్పుడు ఇది ఎఫెక్ట్ చూపకపోయినా 2024 ఎన్నికల్లో ఈ నిర్ణయం వారి మీద ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడంటే బీజేపీకి బంపర్ మెజార్టీ […]

Share:

తమిళ రాజకీయాల్లో ఘోరమైన కుదుపు సంభవించింది. ఎన్నో రోజులుగా కలిసి ఉన్న బీజేపీ-అన్నాడీఎంకే పార్టీలు విడిపోయాయి. తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే పార్టీ ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీకి ఇప్పుడు ఇది ఎఫెక్ట్ చూపకపోయినా 2024 ఎన్నికల్లో ఈ నిర్ణయం వారి మీద ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పుడంటే బీజేపీకి బంపర్ మెజార్టీ ఉందని 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందో అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో కలిసి ఉంటే మైనార్టీ ఓట్లు దెబ్బతింటాయనే అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో తెగ దెంపులు చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. అంతే కాకుండా రాష్ర్ట బీజేపీ నాయకత్వం కూడా తమకు సరిగ్గా సపోర్ట్ చేయడం లేదని అందుకే కూటమి నుంచి విడిపోయామని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. 

దొందూ దొందే… 

ఇలా ఈ రెండు పార్టీలు విడిపోవడం పై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఆయన ఆ రెండు పార్టీల మీద ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీల తీరు ‘ఒకరు రాబర్ (గజ దొంగ) అయితే మరొకరు థెఫ్ట్ (దొంగ)  అన్నట్లుగా ఉంందన్నారు. వారు మళ్లీ 2024 ఎన్నికల వరకు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. తమిళనాడు ప్రజలను మోసం చేయడమే ఆ రెండు పార్టీల పని ఆయన మరోమారు స్పష్టం చేశారు. 

ఇద్దరు కలిసినా కానీ విజయం మాదే

2024 ఎన్నికల్లో విజయంపై స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా కానీ విజయం మాత్రం మాదేనని (డీఎంకే పార్టీదే) స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. వారు మళ్లీ ఎన్నికల్లో కలిసేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు. కాగా బీజేపీ నుంచి విడిపోతున్నట్లు అన్నాడీఎంకే పార్టీ నేత మునుసామి ప్రకటించారు. ఆయనపై స్టాలిన్ సెటైర్ వేస్తూ మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా లేకపోయినా కానీ వచ్చే ఎన్నికల్లో మేము తప్పకుండా గెలుస్తామని తెలిపారు. మీరు ఎన్నో రోజుల పాటు ప్రజలను మోసం చేయలేరని మంత్రి అన్నారు. 

ఇదే మొదటి సారి కాదు

అన్నాడీఎంకే-బీజేపీ విడిపోయినట్లు నటించడం ఇదే మొదటి సారి కాదని, ఇప్పుడు వారు విడిపోయినట్లు ప్రకటించినా కానీ ఎన్నికల్లో మాత్రం మళ్లీ కలిసే పోటీ చేస్తారని స్టాలిన్ అన్నారు.  ఆ రెండు పార్టీలు దొందూ దొందే అని మంత్రి విమర్శించారు. ఏఐడీఎంకే అంటే ‘అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం’ కాదని.. ‘అమిత్ షా ద్రవిడ మున్నేట్ర కజగం’ అని ఉదయనిధి ఎద్దేవా చేశారు. ధర్మపురి జిల్లాలో ఓ పార్టీ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. గత రెండు మూడు రోజులుగా అన్నాడీఎంకే, బీజేపీల మధ్య పొత్తు ఉందా లేదా అన్నదే ప్రశ్న. మరుక్షణంలో పొత్తు ఉందని చెబుతారు. మధ్యాహ్నానికి పొత్తు ఉండదని చెబుతారని ఆరోపించారు. 

ఈ మధ్యే నలుగురు మాజీ మంత్రులు ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు. చెన్నై నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సౌకర్యం ఉందని కానీ వారు మాత్రం ఆ ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్లకుండా వేరే దారిలో ఢిల్లీకి వెళ్లారని తెలిపాడు. తమ ఢిల్లీ పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా ఉండేందుకే ఇలా చేశారని ఆరోపించారు. ఆ నలుగురిలో ఇద్దరు నేతలు బెంగళూరు నుంచి, మరో ఇద్దరు నేతలు కొచ్చిన్ నుంచి ఫ్లైట్ ఎక్కారని తెలిపారు. వారు అంత జాగ్రత్త పడ్డా కానీ వారు మాత్రం పట్టుబడ్డారని తెలిపారు. డీఎంకే పార్టీకి యువజన విభాగం, విద్యార్థి విభాగం మరియు మత్స్యకారుల విభాగం వంటి అనే విభాగాలు ఉన్నట్లు అన్నాడీఎంకే పార్టీ అనేది బీజేపీకి ఒక విభాగం అన్నారు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ బీజేపీ ఆధీనంలోకి వెళ్లిపోయిందని తెలిపారు. ఇప్పుడు విడిపోయినట్లు ప్రకటించినా కానీ త్వరలోనే వారు కలిసి పోతారని స్టాలిన్ ఎద్దేవా చేశారు.