నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు

ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ పలు ప్రాంతాలలో సందర్శిస్తూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన G20 సదస్సు లో భారతదేశం తరుపున అతిథులుగా వచ్చిన ఎన్నో దేశాలకు ఆతిథ్యం ఇవ్వడంలో మోదీ విజయాన్ని సాధించారు. సెప్టెంబర్ 17న 73వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన గురించి మరిన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం..  మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు:  భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన […]

Share:

ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ పలు ప్రాంతాలలో సందర్శిస్తూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన G20 సదస్సు లో భారతదేశం తరుపున అతిథులుగా వచ్చిన ఎన్నో దేశాలకు ఆతిథ్యం ఇవ్వడంలో మోదీ విజయాన్ని సాధించారు. సెప్టెంబర్ 17న 73వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన గురించి మరిన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం.. 

మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు: 

భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టిన రోజు వేడుకలను వివిధ రకాలుగా జరుపుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 17, 1950న, భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన మూడు సంవత్సరాల తర్వాత, రిపబ్లిక్ అవతరించడానికి నెలల ముందు, నరేంద్ర మోదీ దామోదరదాస్ మోదీ మరియు హీరాబా మోదీ దంపతులకు కలిగిన ఆరుగురు సంతానంలో మూడవ వాడిగా జన్మించారు నరేంద్ర మోదీ.

మొదటి నుంచి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడుగా ఉండేవాడు. 1970ల నుండి రాజకీయాల్లో నిమగ్నమైనప్పటికీ, 1990ల చివరి వరకు అతని రాజకీయ జీవితంలో ఎటువంటి మైలురాయిలకు చోటు దక్కలేదని చెప్పుకోవాలి. 1987లో మోదీ గుజరాత్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పని చేయడం ప్రారంభించారు. 1995లో గుజరాత్‌లో పార్టీ మెజారిటీని గెలుచుకున్న అనంతరం, అందరి చూపు నరేంద్ర మోదీ వైపు ఒక్కసారిగా తిరిగింది. 

ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన నరేంద్ర మోదీ:

అక్టోబర్ 7, 2001 న, నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు తన మొదటి రాజ్యాంగ పాత్రను స్వీకరించారు. అంతేకాకుండా అప్పటి నుంచి నరేంద్ర మోదీ నమ్మిన బిజెపి ప్రభుత్వ నాయకుడిగా కొనసాగుతున్నాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం తన విధులను నిర్వహించిన ప్రధానమంత్రి మాత్రమే కాదు, దేశంలోని ప్రధాన మంత్రులందరిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలకు పైగా తన పదవీకాలాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి అధిపతిగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కూడా..నరేంద్ర మోదీ.

2014లో, నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి తన అడ్డంకులను పూర్తిగా తొలగించి.. ఎవరు ఊహించని విధంగా ఎన్నికల వేల తనదైన శైలిలో విజయాన్ని కైవసం చేసుకుంది, మూడు దశాబ్దాలకు పైగా మెజారిటీని గెలుచుకున్న మొదటి పార్టీగా అవతరించింది. ఆయన నిజానికి ప్రధానమంత్రిగా న్యూఢిల్లీకి వెళ్ళక ముందు, ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు 2001 నుంచి 13 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ప్రధానమంత్రిగా తన రెండవ పదవీకాలం వచ్చే ఏడాది ముగియబోతున్నందున, నరేంద్ర మోదీ ఇప్పటికీ భారత రాజకీయాలు, దేశంలోని చాలా రాజకీయ చర్చలపై మెరుగ్గా తనదైన శైలిలో చురుగ్గా పనిచేస్తున్నారు.

ఇటీవల ఎంపీలకు పిలుపునిచ్చిన మోదీ: 

ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందర్భంగా బిజెపిలో ఎలక్షన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సక్సెస్ మంత్ర సూచించినట్లు ఉత్తరప్రదేశ్ లో జరిగిన సమావేశమే తెలియజేస్తోంది. ప్రస్తుతం ప్రజలకు దగ్గరగా ఉన్న బిజెపి మరింత దగ్గర అవ్వాలని, భారతదేశ ప్రధానమంత్రి మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఇతరుల మాదిరిగా ఎన్ డి ఏ అన్నది స్వార్థపూరితమైనది కాదని, ఇతరుల కోసం సహాయం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వీలైతే సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలు సమకూరే సమావేశాలలో కూడా పాల్గొనాల్సిన అవసరం ఉందని ఎంపీలకు మోదీ సూచించారు. అంతేకాకుండా వీలైతే పెళ్లిళ్లకు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని, ప్రజలతో ఎంత కనెక్ట్ అయితే వారి సమస్యలు అంత ఈజీగా పరిష్కరించవచ్చు అని అభిప్రాయపడ్డారు.

రామ మందిరం విషయమే కాకుండా, ముఖ్యంగా ఇతర అంశాలపై కూడా దృష్టి సారించాలని, తమ ఎంపీలకు మోదీ సూచించారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలతో మమేక్యమైపోవాలని, వారి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని ఎంపీలకు సూచించారు.