ఇజ్రాయెల్ లో భారత విద్యార్థులు క్షేమమా?

ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రవాదులు భీకర రీతిలో పోరు చేస్తున్నారు. వారు వినూత్నంగా గ్రనేడ్లు, రాకెట్ లాంచర్లతో పోరు చేస్తున్నారు. వీరి దాడితో ఇజ్రాయెల్ అతలాకుతలం అవుతోంది. ఈ దాడి గురించి అనేక మంది భయపడుతున్నారు. ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఇక ఇజ్రాయెల్ లో ఉండి విద్యను అభ్యసిస్తున్న లేక అక్కడ ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబీకులైతే నెక్ట్స్ లెవల్ లో టెన్షన్ పడుతున్నారు. అక్కడ ఉన్న భారత విద్యార్థుల గురించి వారి […]

Share:

ఇజ్రాయెల్ మీద హమాస్ ఉగ్రవాదులు భీకర రీతిలో పోరు చేస్తున్నారు. వారు వినూత్నంగా గ్రనేడ్లు, రాకెట్ లాంచర్లతో పోరు చేస్తున్నారు. వీరి దాడితో ఇజ్రాయెల్ అతలాకుతలం అవుతోంది. ఈ దాడి గురించి అనేక మంది భయపడుతున్నారు. ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు. ఇక ఇజ్రాయెల్ లో ఉండి విద్యను అభ్యసిస్తున్న లేక అక్కడ ఉండి ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబీకులైతే నెక్ట్స్ లెవల్ లో టెన్షన్ పడుతున్నారు. అక్కడ ఉన్న భారత విద్యార్థుల గురించి వారి క్షేమం గురించి కేంద్ర మంత్రి మీనాక్షి లేఖీ స్పందించారు. మంత్రి ఏం చెప్పారంటే… 

పరిస్థితిని సమీక్షిస్తున్నాం: మంత్రి

కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ లోని భారతీయుల గురించి తనకు రాత్రిపూట అనేక మెస్సేజెస్ వచ్చాయని, ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని ఆమె ఓ ప్రముఖ మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ లో ఉంటున్న ఒంటరి విద్యార్థులను అక్కడి నుంచి తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రధానమంత్రి, అతని కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ఆ దేశంలో చిక్కుకున్న మన విద్యార్థులను తిరిగి తీసుకురావడానికి భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

రష్యా-ఉక్రెయిన్ భయమే.. 

రష్యా-ఉక్రెయిన్ చాలా రోజుల నుంచి యుద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం నేపథ్యంలోనే పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఈ యుద్ధం వల్ల కరువుతో అలమటిస్తున్నాయి. ఇక ఇజ్రాయెల్-హమాస్ దేశాల యుద్ధం వల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా భయపడుతున్నారు. మళ్లీ ఎంతటి భయానక పరిస్థితులను చూడాల్సి వస్తుందోనని వణుకుతున్నారు. ఇదే యుద్దం విషయాన్ని మంత్రి కూడా ప్రస్తావించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో కూడా ఇండియన్లను ఇలాగే తీసుకొచ్చామని ఆమె పేర్కొన్నారు. ఇంకా అప్పుడు కరోనా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.  అయినా కానీ విద్యార్థులను విజయంవంతంగా మన దేశానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. అప్పుడు అక్కడ చిక్కుకున్న విద్యార్థులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్లను చేపట్టింది. ఈ ఆపరేషన్ల ద్వారా సక్సెస్ ఫుల్ గా  అక్కడ ఉన్న విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చింది. ఈ సారి కూడా అవసరం అయితే అలాగే ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి ఇండియన్లను ఇక్కడికి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం భారత ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం నేరుగా వారితో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ ప్రయోగించిన రాకెట్ దాడుల్లో మరణించిన వ్యక్తుల పట్ల ఆమె సంతాపం వ్యక్తం చేశారు.

సంతాపం తెలిపిన మోదీ.. 

ఇజ్రాయెల్ మీద హమాస్ రాకెట్ల దాడిని పెంచింది. ఇప్పటికే ఈ దాడుల్లో చాలా మంది అమాయక పౌరులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా తమ దాడులను ముమ్మరం చేసింది. ఈ దేశం చేసే దాడుల్లో కూడా చాలా మంది మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అనేక మంది దేశాధినేతలు ఈ దాడుల పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ యుద్ధం పట్ల తన సానుభూతిని వ్యక్తం చేశారు. మంత్రి కూడా అదే తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ ఇప్పటికే తన సానుభూతిని తెలియజేశారని అంతే కాకుండా ఇజ్రాయెల్‌ కు అండగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు. పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ ను కవ్వించి అక్కడి ప్రభుత్వం యుద్ధం ప్రకటించేలా చేసుకున్నారు. వీరు పక్కా ప్లాన్ తోనే ఇజ్రాయెల్ మీద దాడులకు తెగబడుతున్నారు. వారు ఇజ్రాయెల్ పట్టణాలలోకి ప్రవేశించి అక్కడి అమాయకులను హింసిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. 

కంగారొద్దు.. 

ఇజ్రాయెల్ లో ఉన్న ఇండియన్ విద్యార్థుల గురించి ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ స్పందించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని కావున టెన్షన్ పడాల్సిన అవసం లేదని తెలిపారు. భారతీయ విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా సురక్షితంగా తీసుకొస్తామని హామీనిచ్చారు.