Odisha Bus Driver: ప్ర‌యాణికుల‌ను కాపాడి చ‌నిపోయిన బ‌స్సు డ్రైవ‌ర్

ప్రస్తుతం ఒడిషా బస్ డ్రైవర్ (Odisha Bus Driver) కు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. గుండె పోటు (Cardiac Arrest) వచ్చి తాను తనువు చాలించినా కానీ తన చివరి శ్వాసలో కూడా ఆ ఒడిషా బస్ డ్రైవర్ (Odisha Bus Driver)  ప్రయాణికుల (Passengers)  క్షేమం కోసం ఆలోచించాడు. దీంతో అతడు నిజంగా గ్రేట్ అంటూ పలువురు నెటిజన్లు ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా బస్సులో ఉన్న […]

Share:

ప్రస్తుతం ఒడిషా బస్ డ్రైవర్ (Odisha Bus Driver) కు సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది. గుండె పోటు (Cardiac Arrest) వచ్చి తాను తనువు చాలించినా కానీ తన చివరి శ్వాసలో కూడా ఆ ఒడిషా బస్ డ్రైవర్ (Odisha Bus Driver)  ప్రయాణికుల (Passengers)  క్షేమం కోసం ఆలోచించాడు. దీంతో అతడు నిజంగా గ్రేట్ అంటూ పలువురు నెటిజన్లు ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా బస్సులో ఉన్న 40 మందికి పైగా అమాయక ప్రయాణికులను (Passengers)  ఈ ఒడిషా బస్ డ్రైవర్ (Odisha Bus Driver)  సేవ్ చేశాడు. దీంతో అతడు నిజంగా హీరోనే అని అంతా కామెంట్లు చేస్తున్నారు. ఆ బస్ డ్రైవర్ (Odisha Bus Driver)  ఆత్మకు శాంతి చేకూరాలని అంతా ప్రార్థిస్తున్నారు. అతడు చేసింది.. హీరోకంటే తక్కువేం కాదని పొగుడుతున్నారు. యాక్షన్ మూవీలో హీరోకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రయాణికులను (Passengers)  రక్షించాడని కొనియాడుతున్నారు. అతడు కామన్ మ్యాన్స్ లో ఉన్న హీరో అని కీర్తిస్తున్నారు. ఈ ఒడిషా బస్ డ్రైవర్ (Odisha Bus Driver) కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.. 

కార్డియాక్ అరెస్ట్ వచ్చినా

ఒడిషా కు చెందిన బస్ అర్ధరాత్రి ప్రయాణికులతో (Passengers)  భువనేశ్వర్ కు బయలుదేరింది. ఆ బస్సులో దాదాపు 40 మంది కంటే ఎక్కువ ప్రయాణికులు ఉన్నారు. వారంతా సేఫ్ గా తమ గమ్య స్థానానికి చేరుకుంటామని భావించారు. కానీ మధ్యలో అనుకోని విపత్తు సంభవించింది. తమ బస్సును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ (Odisha Bus Driver)  కు అకస్మాత్తుగా గుండె పోటు (Cardiac Arrest) వచ్చింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు (Passengers)  ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. కానీ చివరికి ఆ డ్రైవర్ (Odisha Bus Driver)  చాలా చాక చక్యంగా బస్సును పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డారు. అతడు తనకు కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) రావడంతో ఏ మాత్రం ప్యానిక్ అవ్వకుండా బస్సును పూర్తిగా నిలిపేశాడు. తను అపస్మారక స్థితిలోకి చేరుకోక ముందే వాహనాన్ని పూర్తిగా ఆపేశాడు. కానీ ఆ ప్రయత్నంలో అతడు ఒక గోడను ఢీ కొట్టినట్లు అక్కడి స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో గల  పబురియా గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. 

ఆ డ్రైవరన్నకు ప్యాసింజర్ల క్షేమమే ‘ప్రధానం’ 

ఆ డ్రైవర్ (Odisha Bus Driver) ను సనా ప్రధాన్ గా పోలీసులు గుర్తించారు. అతడు రెగ్యులర్ గా బస్సు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఛాతీ నొప్పి  (Cardiac Arrest) రావడంతో స్టీరింగ్‌ పై నియంత్రణ కోల్పోయినట్లు వారు తెలిపారు. ఇక తనకు చాతిలో నొప్పి రావడంతో బస్సును మరింత ముందుకు నడపలేనని అతడు గ్రహించాడు. ఇది గ్రహించిన ప్రధాన్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ క్రమంలో వాహనం వెళ్లి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీ కొట్టింది. ఇక గోడను ఢీ కొట్టిన తర్వాత రోడ్డు పక్కన ఆ వాహనం ఆగిపోయింది. అలా అతడు ప్రయాణికులను సేఫ్ గా రక్షించగలిగాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అక్కడి ఇన్స్పెక్టర్ కళ్యాణమయి సేంద మీడియాకు తెలిపారు. 

ప్రతిరోజూ ప్రయాణం

ఇలా ప్రమాదానికి గురైన బస్సు ఒక్క రోజు మాత్రమే కాకుండా ప్రతి రోజు కంధమాల్ లోని సారన్ ఘర్ నుంచి భువనేశ్వర్ కు ప్రతి రోజు ట్రిప్పులు వేస్తుందని పోలీసులు తెలిపారు. టికాబలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్.మాట్లాడుతూ.. మా లక్ష్మి అనే ఈ ప్రైవేట్ బస్సు రోజు సాధారణంగా కంధమాల్‌ లోని సారన్‌ ఘర్ నుంచి ఉదయగిరి మీదుగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌ కు ప్రతి రాత్రి తిరుగుతుందని వెల్లడించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ బస్సు డ్రైవర్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

కానీ అప్పటికే అతడు గుండె ఆగి చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. కొద్దిసేపటి తర్వాత మరో డ్రైవర్‌ తో కలిసి బస్సు తన గమ్యస్థానానికి ప్రయాణికుల (Passengers) తో బయలుదేరిందని వారు తెలిపారు. ప్రధాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తును కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు.