ఒరిస్సాలో బీభత్సాన్ని సృష్టిస్తున్న ఏనుగుల దాడి. ఎదురు కనిపిస్తే మనిషిని చంపేస్తున్న ఏనుగులు. ప్రస్తుతానికి ఒరిస్సాలో ఏనుగులు దాడిలో చనిపోయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఏనుగుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య ఈ సంవత్సరం 57 గా ఉండగా, కిందటి సంవత్సరం ఇదే సమయంలో ఏనుగుల దాడిలో మొత్తం 38 మంది మరణించారు.
ఒరిస్సాల రోజు రోజుకి ఏనుగుల బీభత్సం ఎక్కువైపోతుంది. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లోనే ఏనుగుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య 57 గా ఉంది. ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా బాధాకరం అంటూ, కొందరు అధికారులు తెలిపారు.
ప్రతి సంవత్సరం ఏప్రిల్,మే, జూన్ నెలలో ఎక్కువగా ఏనుగులు దాడి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలోనే మామిడిపళ్ళు, చెర్రీలు, అంతేకాకుండా పనసకాయలు ఎక్కువగ పండుతూ ఉంటాయి. కాబట్టి ఇదే సమయంలో ఏనుగులు ఆ పళ్ళను తినడానికి తోటల మీదకు దండెత్తి వస్తాయి.
అయితే తమ తోటల్లో కాపాడుకునేందుకు చాలామంది రైతులు ఏనుగులను పంపించేందుకు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఏనుగుల దాడిలో చాలామంది చనిపోతూ ఉంటారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ప్రతి సంవత్సరం ఏనుగుల దాడిలో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 10 సంవత్సరాల్లో చూసుకుంటే, ఏనుగు దాడిలో చనిపోతున్న వారి సంఖ్య సుమారు 26 శాతానికి పెరిగింది. అంతేకాకుండా చాలామంది, ఏనుగుల దాడిలో తీవ్రంగా గాయపడుతున్నారు.
ఇతర దేశపు ఏనుగులతో పోలిస్తే, ఏషియా ఖండంలో ఉండే ఏనుగులు ఎక్కువగా పొలాల్లో పండించే పళ్లకు ఎక్కువగా ఆకర్షితమవుతాయట. ఇదే సమయంలో పొలాల మీద పడి పంటను నాశనం చేసే తమకు కావలసినంత ఆహారం తినడానికి ఏనుగులు ప్రయత్నిస్తాయి. కానీ దురదృష్టసాతు, తమ పంటను నాశనం చేస్తున్న ఏనుగులను తరిమికొట్టేందుకు ప్రయత్నించిన మనుషులు, ఏనుగులు దాడి చేయగా తీవ్ర గాయాలతో తిరిగి రావడం లేదా మరణించడం జరుగుతుంది.
ప్రతి ఏనుగు సుమారు రోజుకి 200 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. అంటే క్షణాలలో ఒక ఏనుగు హెక్టర్ భూమిలో ఉన్న పంటను నాశనం చేయగలదు. తక్కువ సమయంలోనే రైతుకు నష్టాన్ని మిగిలిచేవి ఏనుగులు. అంతేకాకుండా ఏనుగుల దాడి వల్ల పంట పొలాలు నాశనమై చాలామంది రైతులు రోడ్డు మీద పడిన రోజులు. ఎందుకంటే రైతుకి భూమి ఆధారం, చివరికి పంట చేతికి వచ్చే సమయానికి ఏనుగులు దాడితో పంట నష్టం వల్ల, ఆర్థిక నష్టాల్లో నుంచి రైతు బయటికి రాలేకపోతున్నాడు.
అయితే ఏనుగులు ఎల్లప్పుడూ గ్రామాల్లో ఉండే పంట పొలాల మీద దాడి చేయడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. ప్రస్తుతం ఉంటున్న కాలంలో, తమ తమ అవసరాల కోసం అడవుల్లో కొట్టేయడం, అడవులు అంతరించిపోయేలా చేయడం కూడా, ఏనుగుల దాడికి కారణం. అడుగులు ఉంటే అందులో ఉన్న ఆహారం తినే ఏనుగులు గ్రామాలలో ఉన్న పంట పొలాల మీద దాడి చేయడం తగ్గిస్తాయి. కానీ, ప్రస్తుతం అడవులు అంతరించిపోతున్నాయి, అడవుల్లో ఆహారం దొరకకపోవడం వల్ల, ఆకలితో ఏనుగులు క్రూరంగా పంటల మీద దాడి చేస్తున్నయి, ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.