అమ్మ కోసం చంద్రుడిపై భూమి కొనేసింది

చంద్రుడిపై అప్పుడే రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌ స్టార్ట్ అయింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 3 ల్యాండర్‌‌ చంద్రుడిపై అడుగుపెట్టగానే, తెలంగాణకు చెందిన ఓ మహిళ అక్కడ ఎకరం భూమిని కొనేసింది. దానిని తన తల్లికి గిఫ్ట్‌ గా అందజేసింది.  ‘‘చందమామ రావే.. జాబిల్లి రావే..” అంటూ చంద్రుడి కోసం చిన్నప్పటి నుంచి పాటలు పాడాం.. కానీ చందమామ రాలేదు.. అందుకే మనమే చందమామ దగ్గరికి వెళ్లాం. చంద్రయాన్‌ 3 ప్రయోగం ద్వారా ఇండియా చంద్రుడి మీదకు రోవర్‌ను […]

Share:

చంద్రుడిపై అప్పుడే రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌ స్టార్ట్ అయింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 3 ల్యాండర్‌‌ చంద్రుడిపై అడుగుపెట్టగానే, తెలంగాణకు చెందిన ఓ మహిళ అక్కడ ఎకరం భూమిని కొనేసింది. దానిని తన తల్లికి గిఫ్ట్‌ గా అందజేసింది. 

‘‘చందమామ రావే.. జాబిల్లి రావే..” అంటూ చంద్రుడి కోసం చిన్నప్పటి నుంచి పాటలు పాడాం.. కానీ చందమామ రాలేదు.. అందుకే మనమే చందమామ దగ్గరికి వెళ్లాం. చంద్రయాన్‌ 3 ప్రయోగం ద్వారా ఇండియా చంద్రుడి మీదకు రోవర్‌ను దింపింది. అక్కడ నివాసయోగ్యమైన స్థలం ఉందా.. ఆక్సిజన్ ఉందా.. వాటర్‌‌ ఉంయా.. మనిషి నివసించడానికి కావాల్సిన సౌకర్యాలు ఉన్నాయా.. అనే విషయాలను ఈ ప్రజ్ఞాన్‌ రోవర్‌‌ పరిశోధించనుంది. జాబిల్లి పైకి రోవర్‌‌ను సక్సెస్‌ఫుల్‌గా ల్యాండ్‌ చేయడంతో  ప్రపంచ దృష్టి ఇండియాపై పడింది. అలాగే, ఓ మహిళ ఏకంగా చంద్రుడిపై ఎకరం భూమినే కొనేసింది. చిన్నప్పటి నుంచి కని, పెంచిన తల్లి కోసం జీవితాంతం  గుర్తుండిపోయేలా ఓ గిఫ్ట్ ను ఇవ్వాలనుకుంది. అందుకే తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన ఓ ఎన్‌ఐఆర్‌‌ మహిళ చంద్రుడిపైన ఎకరం ల్యాండ్‌ కొని, దానికి సంబంధించిన పత్రాలను అందుకుది. 

సాయి విఘ్నత.. సింగరేణి ఉద్యోగి అయిన సుద్దాల రాంచంద్రం, వకుళాదేవి దంపతుల కుమార్తె. తెలంగాణలోని గోదావరిఖని పట్టణానికి చెందిన సాయి విఘ్నత.. అమెరికాలోని లోవా స్టేట్‌ గవర్నర్‌‌ కింబర్లీ కే రోనాల్డ్స్‌ కు ప్రాజెక్ట్‌ మేనేజర్‌‌గా, ఆర్థిక సలహాదారుగా ఆమె పనిచేస్తున్నారు. న్యూయార్క్‌ లోని  ‘ఇంటర్నేషనల్‌ లూనార్‌‌ రిజిస్ట్రీ’ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత పత్రాలను అందుకుంది. మాతృదినోత్సవం సందర్భంగా 2022లో చంద్రుడిపై ఒక ఎకరం భూమిని తన తల్లి వకుళా దేవి, ఆమె కుమార్తె అర్థ పేరు మీద లూనార్‌‌ రిజిస్ట్రీతో దరఖాస్తు చేసుకున్నారు. 

చంద్రయాన్‌ 3 అంతరిక్ష నౌకను ఇస్రో విజయవంతంగా ల్యాండిం చేసిన రెండ్రోజుల తర్వాత ఎకరం రూ.35 లక్షలతో చంద్రుడిపై కొనుగోలు చేసిన ప్లాట్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ పత్రాలను సాయి విఘ్నత అందుకుంది. 

ప్రగ్యాన్ రోవర్ పని మొదలు పెట్టింది

చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెటిన చంద్రయాన్‌ 3 ఇప్పటికే తన పని మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే మిషన్‌కు సంబంధించిన మొదటి పరిశోధన వివరాలను ఇస్రో ఆదివారం ప్రకటించింది. విక్రమ్‌ ల్యాండర్‌‌లోని చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌ పరిమెంట్‌ పేలోడ్‌ చందమామ ఉపరితలంపై, కాస్త లోతులో సేకరించిన ఉష్ణోగ్రతల గణాంకాలను గ్రాఫ్‌ రూపంలో వెల్లడించింది. చాస్టే పేలోడ్‌ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద నేల పైపొర టెంపరేచర్లను లెక్కిస్తుంది. నేలపై 10 సెంటీమీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లి, ఉష్ణోగ్రతలను లెక్కించే సామర్థ్యం ఈ పేలోడ్‌కు ఉంది. దీనికి 10 సెన్సర్లు అమర్చి ఉన్నాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీలుగా ఉంది. అదే 80 మిల్లీమీటర్ల లోతులో దాదాపు  మైనస్‌ 10 డిగ్రీలుగా చూపిస్తోంది. 

ఇప్పటికే రెండు లక్ష్యాలు పూర్తి..

చంద్రుడి దక్షిణ ధృవంలో ఉష్ణోగ్రతలకు సంబంధించి ఇవి మొదటి వివరాలు అని ఇస్రో వెల్లడించింది. పూర్తిస్థాయిలో రోవర్‌‌ తన పనిని చేస్తోందని పేర్కొంది. ల్యాండర్‌‌ మాడ్యుల్‌లోని రాంభా, చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌ పరిమెట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌‌ లూనార్‌‌ సీస్మిక్‌ యాక్టివిటీ పేలోడ్‌లను ప్రారంభించింది. చంద్రయాన్‌ 3 మిషన్‌ ఇప్పటికే తన రెండు లక్ష్యాలను పూర్తి చేసుకున్నట్లు ఇస్రో వెల్లడించింది.