చంద్రబాబు నాయుడుకి ఇన్కమ్ టాక్స్ నోటీసులు

ఎన్నికలు దగ్గర పడుతున్న చంద్రబాబు నాయుడు పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అధికార పార్టీ మీద బురద జల్లే క్రమంలో ఎలెక్షన్ కమిషన్ కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి, ఆయనకి ఆదాయంగా వచ్చిన 118 కోట్లకు గాను ఇప్పటికీ టాక్స్ కట్టలేదు అంటూ ఐటీ శాఖ పేర్కొంది.  ఆధారాలు ఉన్నాయి:  తెలుగుదేశం పార్టీ అధినేత […]

Share:

ఎన్నికలు దగ్గర పడుతున్న చంద్రబాబు నాయుడు పలు ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు అధికార పార్టీ మీద బురద జల్లే క్రమంలో ఎలెక్షన్ కమిషన్ కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇటీవల చంద్రబాబు నాయుడుకి ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి, ఆయనకి ఆదాయంగా వచ్చిన 118 కోట్లకు గాను ఇప్పటికీ టాక్స్ కట్టలేదు అంటూ ఐటీ శాఖ పేర్కొంది. 

ఆధారాలు ఉన్నాయి: 

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కి ఇటీవల ఇన్కమ్ టాక్స్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వారు తమ దగ్గర సరైన ఆధారాలు ఉండడం వల్లే ఆయనకి నోటీసులు జారీ చేసామని ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా అతనికి అనధికారికంగా ఎంతో డబ్బు వచ్చి పడుతోందని, బోగస్ సబ్ కాంట్రాక్టు ద్వారా కూడా ఆయనకి ఆదాయం వస్తుందని ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆయనకి ఐటి నోటీసులు జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్. 

ఫేక్ సబ్-కాంట్రాక్టర్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆదాయం సంపాదించేందుకు SPCL ద్వారా నిధులను స్వాహా చేసేందుకు బోగస్ కాంటాక్ట్‌లు, అదేవిధంగా వర్క్ ఆర్డర్‌లను ఏర్పాటు చేసినట్లు పర్దాసాని అంగీకరించాడని, అంతేకాకుండా ప్రస్తుతం పార్దాసానీ నుంచి అదే విధంగా అతని సహచరుల నుండి అనేక నేరారోపణలు, చాట్‌లు మరియు ఎక్సెల్ షీట్‌లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు, ఐటీ శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొంది. నాయుడుకు నగదు బట్వాడా చేయడంతో పాటు, ప్రధాన మౌలిక సదుపాయాలు అనేవి అనేక సంస్థల ద్వారా నిధులు ఎలా స్వాహా చేశారు.. ఇంకా ఆధారాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నారో కూడా స్పష్టంగా నోటీసులో పేర్కొనడం జరిగింది. 

ఇటీవల ఎలక్షన్ కమిషన్ను సంప్రదించిన చంద్రబాబు: 

పోల్ ప్యానెల్‌ను కలిసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, అర్హులైన ఓటర్లందరినీ ఓటర్ల జాబితాలో చేర్చాలని, అయితే ఇక మరణించిన ఓటర్ల పేర్లు మీద నమోదు అవుతున్న “నకిలీ” ఓటర్లను తొలగించాలని కోరుతూ ఒక మెమోరాండం అందజేశారు. ఓటర్ల డేటా, ఆధార్ నంబర్లను ప్రైవేట్ ఏజెన్సీలకు ‘బదిలీ’ చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

ఎన్నికలకు సంబంధించిన పనిని నిర్వహించడానికి, గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికి బదులుగా ఉపాధ్యాయులు మరియు ఇతర డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఎన్నికల పనుల కోసం వెళ్లేలా ప్రత్యేకించి చూడాలని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ని కోరారు. ఫోరెన్సిక్ నైపుణ్యాలు కలిగిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి అంతేకాకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకే రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 

ఎలక్షన్స్ సందర్భంగా పలు ప్రాంతాలలో సందర్శిస్తున్న చంద్రబాబు నాయుడు, వైయస్సార్సీపి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాడని, చంద్రబాబు నాయుడు ఒక ముసలి నక్క అంటూ, రాష్ట్రాన్ని మళ్ళీ చేజెక్కించుకుని నాశనం చేసే క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేరుకుతున్నారని, అతని మాటలు నమ్మి ఓటు వేస్తే చివరికి మిగిలేది ఏంటో అందరికీ తెలుసు అంటూ వాక్యానించారు మంత్రి బొత్స. సేవ చేస్తున్న సచివాలయ, గ్రామ వాలంటీర్లు గురించి ఆరోపణలు చేస్తున్న నాయకులు మీద ఫైర్ అయ్యారు బొత్స.