నేను యూసీసీకి వ్యతిరేకి కాదు: మాయావతి

నిజానికి తాను యూనిఫాం సివిల్ కోడ్‌కి వ్య‌తిరేకిని కాన‌ని, బీజేపీ  భారతదేశంలో యుసిసి ఇంప్లిమెంట్ చేసే విధానం త‌న‌కు నచ్చ‌లేద‌ని అన్నారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధ్య‌క్షురాలు మాయావ‌తి. యుసిసి గురించి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం, దేశంలో యూసీసీని బలవంతంగా అమలు చేయడం సరికాదని మాయావతి స్పష్టం చేసారు. బిజెపిపై మండిపడ్డ మాయావతి:  ఇటీవలి యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి)పై లా కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత, బహుజన్ సమాజ్ పార్టీ […]

Share:

నిజానికి తాను యూనిఫాం సివిల్ కోడ్‌కి వ్య‌తిరేకిని కాన‌ని, బీజేపీ  భారతదేశంలో యుసిసి ఇంప్లిమెంట్ చేసే విధానం త‌న‌కు నచ్చ‌లేద‌ని అన్నారు బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ అధ్య‌క్షురాలు మాయావ‌తి. యుసిసి గురించి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం, దేశంలో యూసీసీని బలవంతంగా అమలు చేయడం సరికాదని మాయావతి స్పష్టం చేసారు.

బిజెపిపై మండిపడ్డ మాయావతి: 

ఇటీవలి యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి)పై లా కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాత, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి ఆదివారం మాట్లాడుతూ, తమ పార్టీ నిజానికి యుసిసికి “వ్యతిరేకం” కాదు. భారతదేశంలో యుసిసిన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది అంటూ పేర్కొన్నారు.

“మా పార్టీ (బిఎస్‌పి) యూనిఫాం సివిల్ కోడ్ భారతదేశంలో అమలుకు వ్యతిరేకం కాదు కానీ, బిజెపి ఇంకా ప్రభుత్వం దానిని అమలు చేస్తున్న తీరుతో ఏకీభవించడం అనేది వీలుపడదు. ఎందుకంటే ఇందులో కూడా వారు స్వప్రయోజనాల రాజకీయాలు కనిపిస్తున్నాయి, ఇది సరికాదు” అని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు.

యుసిసి అంటే: 

దేశంలో ఉంటున్నా అనేక మంది ప్రజలు అనేకమైన మతాలను వారి పద్ధతులను అనుసరిస్తూ జీవనాన్ని గడుపుతున్నారు, అయితే ఈ విషయంపై ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన మాయావ‌తి మాట్లాడుతూ, “ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లోకి వస్తే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన చట్టం అనేది ఉండటం జరుగుతుంది. ఇది మత సామరస్యం మరియు సోదరభావానికి కూడా దారి తీస్తుంది.” అని అన్నారు.

సామాజిక సామరస్యం యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంటే, యుసిసిని రూపొందించడానికి చేసిన కృషిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 లో ప్రస్తావించారు, “కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎటువంటి బిల్లునైనా సరే బలవంతంగా అమలు చేసేందుకు ఎవరికీ హక్కు లేదు. ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకోవడం ఎంతో ఉత్తమం అవుతుంది. కానీ అలాంటి పద్ధతి కాకుండా, బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం స్వప్రయోజనాల రాజకీయాలు చేస్తున్నారు, వారి ప్రవర్తన దేశ ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా కనిపిస్తుంది” అని ఆమె మండిపడ్డారు.

దేశం ఎన్నో కష్టనష్టాల్లో ఉన్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా, వాటిని పక్కదారి పట్టించేందుకు, బిజెపి ఒక కొత్త పథకాన్ని అమలు చేసిందని ఆమె ఉద్దేశం. ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, విద్య, వైద్యం మొదలైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు బిజెపి ఈ యుసిసి అంశాన్ని లేవనెత్తిందని ఆమె ఆరోపించారు. “ప్రభుత్వం ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టడం లేదనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది, అంతేకాకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి, ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వం UCC గురించి మాట్లాడుతున్నారు, ”అని ఆమె గట్టిగా మాట్లాడారు.  

బీజేపీ 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తూ రామ మందిర నిర్మాణంతో పాటు యూసీసీని అమ‌లు చేస్తామ‌ని మేనిఫెస్టోలో ప్ర‌క‌టించింది. రామ మందిరం ఎటూ నిర్మాణం మొద‌లైపోయింది కాబ‌ట్టి ఇప్పుడు లోక స‌భ ఎన్నిక‌ల‌కు ముందు యూసీసీని కూడా అమ‌లు చేస్తే ఒక ప‌ని అయిపోతుందని భావిస్తోంది. ఇందుకోసం ఇత‌ర రాష్ట్రాల‌ను, వివిధ మ‌ఠాల‌కు చెందిన గురూజీల నుంచి కూడా అభిప్రాయాన్ని సేకరించింది బీజేపీ.