అమెరికా ఆర్మీలో జాతి వివక్ష…  పారిపోయిన అమెరికా సైనికుడు..

చాలా మంది ఉత్తరకొరియా నుంచి ఇతర దేశాలకు పారిపోయి అక్కడ హ్యాపీగా బతకాలనుకుంటారు. ఎందుకంటే ఆ దేశంలో ప్రజలపై ఉన్నన్ని ఆంక్షలు మరే దేశంలో లేవంటే అతిశయోక్తి కాదు. కానీ, ఉత్తర కొరియాలోకి రావాలన్నా.. ఆ దేశం నుంచి పోవాలన్నా.. కత్తిమీద సాము చేయడం లాంటిది. దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఆయన నియంతృత్వ విధానాలకు దేశంలో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కిమ్‌కు ఇవన్నీ ఏమీ […]

Share:

చాలా మంది ఉత్తరకొరియా నుంచి ఇతర దేశాలకు పారిపోయి అక్కడ హ్యాపీగా బతకాలనుకుంటారు. ఎందుకంటే ఆ దేశంలో ప్రజలపై ఉన్నన్ని ఆంక్షలు మరే దేశంలో లేవంటే అతిశయోక్తి కాదు. కానీ, ఉత్తర కొరియాలోకి రావాలన్నా.. ఆ దేశం నుంచి పోవాలన్నా.. కత్తిమీద సాము చేయడం లాంటిది. దీనికి కారణం ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌. ఆయన నియంతృత్వ విధానాలకు దేశంలో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ కిమ్‌కు ఇవన్నీ ఏమీ పట్టవు. ఈ దేశంలోకి వెళ్లాలంటే కూడా ఆ దేశ రూల్స్‌ కచ్చితంగా పాటించాలి. లేకపోతే కఠిన శిక్షలు తప్పవు.. అలాంటి దేశంలోకి ఓ అమెరికా ఆర్మీకి చెందిన సైనికుడు శరణార్థిగా వెళ్లాడు. 

23 ఏళ్ల అమెరికా సైనికుడు ట్రావిస్‌ కింగ్‌ జులైలో దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాకు పారిపోయాడు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉన్న గస్తీ నిర్వహణ ప్రాంతం నుంచి తమ దేశంలోకి  అక్రమంగా ప్రవేశించిన అమెరికా సైనికుడు ట్రావిస్‌ కింగ్‌పై ఉత్తరకొరియా ఆసక్తికర ప్రకటన చేసింది. అమెరికా ఆర్మీలో జాతి వివక్ష, అమానవీయ ప్రవర్తనల కారణంగా ట్రావిస్‌ కింగ్‌ తమ భూ భాగంలోకి వచ్చాడని ఉత్తరకొరియా తెలిపింది. 

దక్షిణ కొరియా నుంచి గైడెడ్‌ టూర్‌‌లో ఉన్నప్పుడు సరిహద్దును దాటాడు. దీంతో అతన్ని ఉత్తర కొరియా సైన్యం అదుపులోకి తీసుకుంది. ట్రావిస్‌ ను విచారించగా, తాను చట్టవిరుద్ధంగానే బార్డర్‌‌ దాటినట్లు అంగీకరించాడని ఉత్తర కొరియా తెలిపింది. అంతేకాకుండా అతను తమ దేశంలో శణార్థిగా ఆశ్రయం పొందాలనుకుంటున్నాడని డీపీఆర్‌‌కే (డెమోక్రాటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్ కొరియా) వెల్లడించింది. 

విచారణ సమయంలో ట్రావిస్‌ కింగ్‌ అమెరికా సైన్యంలో అమానవీయ ప్రవర్తనలు, జాతి వివక్ష కారణంగానే డీపీఆర్‌‌కే రావాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడని ఆ దేశ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. అతను డీపీఆర్‌‌కే లేదా మరేదైనా దేశంలో శరణార్థిగా ఉండేందుకు అంగీకరించాడని వెల్లడించింది. అయితే, అతడి విషయంలో ప్యాంగ్‌యాంగ్‌  ఏ నిర్ణయం తీసుకుందో మాత్రం వెల్లడించలేదు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన అతడిని విచారించి శిక్షిస్తారా.. అనే విషయంలో స్పష్టత లేదు.

అధికారిక సమాచారం ప్రకారం.. ట్రావిస్‌ కింగ్‌ ఇంకా కొరియా సైన్యం అదుపులోనే ఉన్నాడని తెలిసింది. ఈ విషయం గురించి ఇంకా దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, అతను ఉత్తరకొరియా  అధీనంలో  ఉన్నాడని తాము ధ్రువీకరించాల్సి ఉందని అమెరికా తెలిపింది. మరోవైపు కొరియా మాటలను నమ్మలేమని వెల్లడించింది. ఒకవేళ ఇదే నిజమైతే, అతన్ని సురక్షితంగా అమెరికాకు తిరిగి తీసుకురావడంపై మాత్రమే దృష్టి పెట్టామని చెప్పారు. అతన్ని వెనక్కి రప్పించేందుకు అందుబాటులో ఉన్న అన్నీ అవశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. 

ట్రావిస్‌ కింగ్‌ రోటేషన్‌లో భాగంగా దక్షిణ కొరియాలో  విధులు నిర్వర్తిస్తున్నాడు. సరిహద్దు దాటడానికి ముందు అతనిపై పలు ఆరోపణలు రావడంతో అతన్ని రెండు నెలలు  అధికారులు నిర్బంధించారు. ఈ మేరకు అతను క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొనేందుకు అమెరికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. 

 జులై 18న కొందరు సందర్శకుల బృందంతో కలిసి ట్రావిస్‌ కింగ్‌ సంయుక్త గస్తీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచి అతడు ఉత్తరకొరియాలోకి పారిపోయాడు. కాగా, అతడిని ఉత్తర కొరియా నుంచి విడిపించేందుకు ఐక్యరాజ్య సమితి కమాండ్‌ సాయంతో అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఉత్తర కొరియా ప్రకటనపై పెంటగాన్‌ అధికారి మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించి ట్రావిస్‌ కింగ్‌ను సురక్షితంగా తన ఇంటికి చేర్చడమే తమ ప్రాధాన్యమమన్నారు.