జాబ్ ఆఫర్ చూపించి 13 లక్షల కొట్టేశారు

ఒకవైపు నుంచి పోలీసుల ద్వారా మరోవైపు నుంచి టీవీలలో, సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నప్పటికీ, నేరగాళ్ళ చెప్పే మోసపూరితమైన మాటలకు భలైపోతున్నారు చాలామంది. జాబ్ ఆఫర్ ఎరగా చూపించి ఒక యువతి దగ్గర 13 లక్షల కొట్టేసారు సైబర్ నేరగాళ్లు. అంతేకాకుండా ఆమె కంప్యూటర్‌కు, సైబర్ నేరగాళ్లకు రిమోట్ యాక్సెస్ ఉందని పోలీసులు తెలిపారు.  మోసపోయిన యువతి:  గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీకి చెందిన యువతి, యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి మరియు సబ్‌స్క్రయిబ్ చేయడానికి, […]

Share:

ఒకవైపు నుంచి పోలీసుల ద్వారా మరోవైపు నుంచి టీవీలలో, సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నప్పటికీ, నేరగాళ్ళ చెప్పే మోసపూరితమైన మాటలకు భలైపోతున్నారు చాలామంది. జాబ్ ఆఫర్ ఎరగా చూపించి ఒక యువతి దగ్గర 13 లక్షల కొట్టేసారు సైబర్ నేరగాళ్లు. అంతేకాకుండా ఆమె కంప్యూటర్‌కు, సైబర్ నేరగాళ్లకు రిమోట్ యాక్సెస్ ఉందని పోలీసులు తెలిపారు. 

మోసపోయిన యువతి: 

గ్రేటర్ నోయిడాలోని ఒక సొసైటీకి చెందిన యువతి, యూట్యూబ్ వీడియోలను చూడటానికి, లైక్ చేయడానికి మరియు సబ్‌స్క్రయిబ్ చేయడానికి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆఫర్ ఇస్తామంటూ వచ్చిన వాట్సాప్ మెసేజ్ ట్రాప్‌లో పడి రూ. 13 లక్షలకు పైగా పోగొట్టుకున్నారని అధికారులు తెలిపారు. తర్వాత, మోసగాళ్లు నకిలీ నాస్‌డాక్ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెట్టమని చెప్పి, అంతేకాకుండా దానికి కారణంగా అధిక రాబడి వస్తుంది అని చెప్పి ఆ యువతీకి ఎర చూపించారు అని వారు తెలిపారు. అయితే ఆ యువతి వారు చెప్పినట్లుగానే వారు పంపిన 

నకిలీ వెబ్సైట్ లింక్ కు అధిక మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసింది. అయితే ఎక్కువ రాబడితో మళ్ళీ తిరిగి చేతికి ఎక్కువ మొత్తం అందుతుందని ఆశపడిన యువతీ, తెలిసిన వారి దగ్గర ఆరు లక్షల రూపాయలు కూడా తీసుకున్నట్లు సమాచారం. గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని పంచశీల్ హైనిష్ సొసైటీకి చెందిన కార్తీక, మోసగాళ్ళు నకిలీ వెబ్‌సైట్‌ను కూడా సృష్టించారని తన ఫిర్యాదులో పేర్కొంది.

జాబ్ ఇస్తామని: 

ఏప్రిల్ 6న, పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్‌కి సంబంధించి మొబైల్ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ అనేది వచ్చింది, అందులో వారు ఉద్యోగం ఇస్తారని, అక్కడ యూట్యూబ్‌లో వీడియోలను చూడాలని, ఛానెల్‌ని లైక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. వారు తమ టెలిగ్రామ్ హ్యాండిల్‌కి కనెక్ట్ చేసారు. అంతేకాకుండా మొత్తం టెలిగ్రామ్ లోనే చాలావరకు ఆ యువతీకి అలాగే మోసగాళ్లకు మధ్య కమ్యూనికేషన్ అనేది జరిగింది. ఈ పని కోసం వారు రోజుకు రూ. 50 నుండి రూ. 5,000 ఆఫర్ చేశారు అని గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని పంచశీల్ హైనిష్ సొసైటీ నివాసి కార్తీక తన ఫిర్యాదులో పేర్కొంది.

ఉద్యోగంలో చేరిన మొదటి రోజున ఆమెకు పంపిన మూడు వీడియో లింక్‌లను ‘లైక్ చేసి సబ్‌స్క్రైబ్’ చేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆమె బ్యాంక్ అకౌంట్లో రూ. 150 జమ చేశారు. అయితే తను హౌస్ వైఫ్ అయినందున, మూడేళ్ల కొడుకును చూసుకుంటూనే తాను చేయగలిగే సులభమైన పనిలా అనిపించింది అని, కార్తిక చెప్పింది. అయితే ఆవిడకి వారి మీద నమ్మకం కుదిరిన తర్వాత, స్కామర్లు US ఆధారిత నాస్‌డాక్ వెబ్‌సైట్‌లో ఎకౌంట్ క్రియేట్ చేసుకోమని అడిగారు. నాస్‌డాక్‌లో రూ. 2,000 పెట్టుబడి పెట్టమని అడిగారు, తర్వాత వెంటనే అదే రోజున, లాభంతో రూ. 3,150 తిరిగి ఇచ్చారు అని ఆమె చెప్పింది. ఇలా సుమారు 3,81,200 పంపించినట్లు ఆమె వెల్లడించింది. ప్రతి ట్రాన్స్ఫర్ తర్వాత, అదే వారి చివరి ట్రాన్స్ఫర్ అని వారు చెప్పారని తేలింది. అయితే నెక్స్ట్ చాలా వరకు టాక్స్స్ కంపల్సరీ చేసి చివరికి 6 లక్షలు తను అప్పు చేస్తున్నట్లు, అంతేకాకుండా తన భర్త అకౌంట్ నుంచి కూడా లోన్ కి అప్లై చేసుకున్నట్లు చెప్పింది. 

అయితే చివరి వరకు భార్య భర్తలు ఇద్దరూ కష్టపడి పర్సనల్ లోన్ తీసుకుని మరి, స్క్యామర్లు తమకు ఇచ్చిన కంపల్సరీ టాస్క్ పూర్తి చేయడానికి చూసినట్లు కంప్లైంట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే వారి కోరినంత అమౌంట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ తిరిగి 5 లక్షల వరకు టాక్స్ కట్టాలని మోసగాళ్ల నుంచి ఒత్తిడి పెరిగిన అనంతరం ఇంక వారు చేసేదేమీ లేక మోసపోయామని తెలిసి పోలీసులను ఆశ్రయించారు.