గ్రీన్ నిబంధనలను పాటించని పంజాబ్ ధర్మల్ ప్లాంట్స్

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదికల ప్రకారం, పంజాబ్ లోని ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ కూడా గ్రీన్ నిబంధనలకు అనుగుణంగా లేవని తేల్చింది. అంతేకాకుండా 5% బొగ్గు సంబంధిత థర్మల్ పవర్ ప్లాంట్లలో మాత్రమే FGDలు ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఇంత తక్కువ సామర్థ్యంతో ఉన్న కంట్రోలర్, సల్ఫర్ డయాక్సైడ్ హానికారిక పొగను కంట్రోల్ చేయడం చాలా కష్టమని తేల్చి చెప్పింది.  ఏప్రిల్ లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధోరిటీ (CEA) రిలీజ్ […]

Share:

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదికల ప్రకారం, పంజాబ్ లోని ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ కూడా గ్రీన్ నిబంధనలకు అనుగుణంగా లేవని తేల్చింది. అంతేకాకుండా 5% బొగ్గు సంబంధిత థర్మల్ పవర్ ప్లాంట్లలో మాత్రమే FGDలు ఉన్నట్లు తెలుస్తుంది. అసలు ఇంత తక్కువ సామర్థ్యంతో ఉన్న కంట్రోలర్, సల్ఫర్ డయాక్సైడ్ హానికారిక పొగను కంట్రోల్ చేయడం చాలా కష్టమని తేల్చి చెప్పింది. 

ఏప్రిల్ లో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధోరిటీ (CEA) రిలీజ్ చేసిన FGD అనాలసిస్ ప్రకారం, పంజాబీ లోని థర్మల్ పవర్ ప్లాంట్ విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో FGD అనేది ప్రతి ఒక్క ప్లాంట్లో ఇన్స్టాల్ చేయడం కష్టమైన పని, ఇంకా చెప్పాలంటే ఈ ప్లాంట్స్ అన్ని కూడా కేటగిరీ సీ(C) లోకి వస్తాయి. 

5,680MW, అదేవిధంగా రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్లాంట్స్ ద్వారా 1,760MW మరియు ఇతర మూడు పవర్ ప్లాంట్ల ద్వారా 3,920MW జనరేట్ చేసే కెపాసిటీ పంజాబ్ కి ఉంది. కానీ పంజాబ్ లోని ఏ ఒక్క థర్మల్ పవర్ ప్లాంట్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేనట్లుగా తెలుస్తుంది. పంజాబ్ లోని 16% పవర్ ఉత్పత్తి చేస్తున్న గురు హరి గోవిందు థర్మల్ ప్లాంట్ పరిస్థితి కూడా మిగిలిన పవర్ ప్లాంట్స్ తరహాలోనే ఉన్నట్లు తెలుస్తుంది. 

పెరుగుతున్న కాలుష్యం: 

మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ (MoEFCC) ద్వారా 2015 లో థర్మల్ పవర్ ప్లాంట్స్ కు నిబంధనలు ఉండాలని అమల్లోకి వచ్చింది. అయితే 2017కి, అన్ని నిబంధనలు పాటించాలని, పవర్ ప్లాంట్లకు సమయాన్ని కేటాయించినప్పటికీ, ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కేవలం కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్ లు మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. 

అంతేకాకుండా మార్చి 2021లో బొగ్గు సంబంధిత థర్మల్ పవర్ ప్లాంట్స్ ను మూడు విభాగాలుగా విభజించింది . అంతేకాకుండా, గ్రీన్ నిబంధనలను పాటించేందుకు వాటికి కొన్ని డెడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కేటగిరీ A లోకి వచ్చే వాటికి డిసెంబర్ 2022 కల్లా, కేటగిరి బి వాటికి డిసెంబర్ 2023 కి, కేటగిరి సి వాటికి డిసెంబర్ 2024. పట్టణాలకు పది కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నవి క్యాటగిరి ఏ. కాలుష్య ప్రదేశానికి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ క్యాటగిరి బి లోకి వస్తాయి. మిగిలిన పవర్ ప్లాంట్స్ కేటగిరి సి లోకి వస్తాయి. 

కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, డిసెంబర్ 2022 దాటినప్పటికీ ఇప్పటివరకు 58 శాతం బొగ్గు సంబంధిత క్యాటగిరి ఏ లోకి వచ్చే థర్మల్ పవర్ ప్లాంట్స్ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాయి. అందుకనే MoEFCC, డెడ్లైన్ మూడు సంవత్సరాలకి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అంటే డిసెంబర్ 2024 కి క్యాటగిరి ఏ, క్యాటగిరి బి డిసెంబర్ 2025 నాటికల్లా, కేటగిరీ సి డిసెంబర్ 2026 కల్లా నిబంధనలు పాటించడం జరగాల్సిందే. CSE ప్రోగ్రాం డైరెక్టర్ మాట్లాడుతూ, ” కేవలం 5% థర్మల్ పవర్ ప్లాంట్స్ మాత్రమే సల్ఫర్ డయాక్సైడ్ పొగను కంట్రోల్ చేసే FGDలను ఇన్స్టాల్ చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా నిజానికి గ్రౌండ్ ఇన్స్పెక్షన్స్ అనేవి స్టేట్ లెవెల్ పరంగా జరుగుతున్నాయో లేవో అనే విషయంపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు” అంటూ ఆయన చెప్పారు.