పసిబిడ్డ మృతి.. డాక్టర్లే కారణమా!

కర్ణాటకలో ఒక చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక నాలుగు నెలల పసివాడు ఊపిరి తీసుకోలేక ఇబ్బందితో మరణించాడు. సరైన అందుబాటులో డాక్టర్లు లేకపోవడం వల్లే పసివాడు మరణించాడని, కుటుంబ సభ్యులు వాపోతున్నారు.  అసలు ఏం జరిగింది:  నాలుగు నెలల పసిబిడ్డను కర్ణాటకలోని తుమాకూరు హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు కుటుంబ సభ్యులు. కానీ, హాస్పిటల్ లో ఒక డాక్టర్ కూడా లేకపోవడం కారణంగా, ఆ పసివాడు ఊపిరి ఆడక విలవిల్లాడుతూ మరణించాడు. కేవలం ఇది డాక్టర్ల […]

Share:

కర్ణాటకలో ఒక చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక నాలుగు నెలల పసివాడు ఊపిరి తీసుకోలేక ఇబ్బందితో మరణించాడు. సరైన అందుబాటులో డాక్టర్లు లేకపోవడం వల్లే పసివాడు మరణించాడని, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 

అసలు ఏం జరిగింది: 

నాలుగు నెలల పసిబిడ్డను కర్ణాటకలోని తుమాకూరు హాస్పిటల్ కి తీసుకుని వచ్చారు కుటుంబ సభ్యులు. కానీ, హాస్పిటల్ లో ఒక డాక్టర్ కూడా లేకపోవడం కారణంగా, ఆ పసివాడు ఊపిరి ఆడక విలవిల్లాడుతూ మరణించాడు. కేవలం ఇది డాక్టర్ల లోటు కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, హాస్పిటల్ యాజమాన్యం మీద కుటుంబ సభ్యులు విరుచుకుపడుతున్నారు. 

నిజానికి సమయానికి తుమ్ముకూరులోని సప్తగిరి హాస్పిటల్ లో ఒక డాక్టర్ కూడా లేకపోవడం కారణంగా నాలుగు నెలల పసివాడు ఊపిరి ఆడక చనిపోయిన దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్లో స్టాప్ ఉన్నప్పటికీ సరైన ప్రాథమిక చికిత్స కూడా పిల్లవాడికి అందించలేదని, అంతే సరైన వైద్యం అందించేందుకు ఒక డాక్టర్ కూడా అందుబాటులో లేడని కుటుంబ సభ్యులు వివరంగా తెలుపుతున్నారు. డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగానే తాము ఒక పసి బిడ్డను కోల్పోయామని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదురుగా ధర్నా చేశారు. 

అందిన నివేదిక ప్రకారం: 

కెంకేరా గ్రామానికి చెందిన దివాకర్ మరియు అరుణలకు పుట్టిన మగ బిడ్డ ఆయష్. అయితే ఆయష్ తీవ్రమైన శ్వాస సంబంధిత బాధతో చాలా భయానకమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సప్తగిరి హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. అయితే డాక్టర్లు ఎవరు కూడా హాస్పిటల్లో అందుబాటులో లేరు. హాస్పిటల్ ఉన్న స్టాఫ్, తమ బాబు పరిస్థితిని చూసినప్పటికి ప్రాథమిక చికిత్స కూడా అందించలేదని, కుటుంబ సభ్యులు తమ దుఃఖాన్ని బయటపెట్టారు. 

అయితే ఆ బాబు తీవ్రమైన ఆరోగ్యని గమనించిన హాస్పిటల్ యాజమాన్యం, ఆ బాబుని చుంచానగరి హాస్పిటల్ కి స్పెషల్ ట్రీట్మెంట్ కోసం తరలించాలని సలహా ఇచ్చినప్పటికీ, తమ హాస్పిటల్లో చేయవలసిన ప్రాథమిక చికిత్స కూడా అందించలేదని నివేదికలో తేలింది. 

అయితే తమ బాబుని కోల్పోవడానికి కేవలం ఆ హాస్పటల్ నిర్లక్ష్యమే అని, స్థానిక పోలీస్ స్టేషన్లో బాబు తరపున కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో, అసలు ఏం జరిగిందని హాస్పిటల్ యాజమాన్యం మీద ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. 

ఎవరిది తప్పు: 

అయితే ప్రస్తుతానికి ఈ వార్త సామాన్య కుటుంబంలో తీవ్ర బాధని అలాగే విషాదాన్ని మిగిల్చింది. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆ పసి బిడ్డకి కనీస ప్రాథమిక చికిత్స అందించడం ఒక హాస్పటల్ యాజమాన్యం యొక్క కనీస బాధ్యత. కానీ తమకి సంబంధం లేనట్లు, సమస్య తీవ్రంగా ఉన్నదని వేరే హాస్పటల్కి పంపించాలి అని సలహా ఇచ్చినప్పటికీ, అసలు కనీస ప్రాథమిక చికిత్స కూడా అందించకపోవడం ఏంటి అని, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం, ఆ చిన్న పసిబిడ్డని ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పటల్ కి తరలించడానికి సమయం తక్కువగా ఉన్నదని గ్రహించి, హాస్పిటల్ స్టాఫ్ త్వర త్వరగా స్పందించి మరొక డాక్టర్ని ఆ సమయంలో అరేంజ్ చేయకపోవడం కూడా తీవ్రమైన ఆరోపణలకు దారితీస్తున్నాయి. 

అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి ప్రస్తుతం మహా హాస్పిటల్ యాజమాన్యం మీద అయితే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు పోలీసులు.