ముంబైలో ఒక్క కొత్త కోవిడ్ కేసు కూడా లేదు

అయితే బీఎంసీ బులిటెన్ విడుదల చేసిన నివేదికల ప్రకారం గత 24 గంటల్లో ముంబైలో ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని కరోనా కేసు వల్ల చనిపోయిన వారు ఒక్కరు కూడా చనిపోలేదని తెలుస్తోంది.  ముంబైలో కరోనా కేసులు లేవు:  అయితే గత మూడు సంవత్సరాలలో ప్రతిరోజు ముంబైలో ఏదో ఒక కరోనా కేసు నమోదు అయినప్పటికీ, ఏదో నాలుగైదు సార్లు మాత్రమే సున్నా కేసులు నమోదయ్యాయి. మళ్లీ తర్వాత, ప్రస్తుతం బి ఎం సి […]

Share:

అయితే బీఎంసీ బులిటెన్ విడుదల చేసిన నివేదికల ప్రకారం గత 24 గంటల్లో ముంబైలో ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని కరోనా కేసు వల్ల చనిపోయిన వారు ఒక్కరు కూడా చనిపోలేదని తెలుస్తోంది. 

ముంబైలో కరోనా కేసులు లేవు: 

అయితే గత మూడు సంవత్సరాలలో ప్రతిరోజు ముంబైలో ఏదో ఒక కరోనా కేసు నమోదు అయినప్పటికీ, ఏదో నాలుగైదు సార్లు మాత్రమే సున్నా కేసులు నమోదయ్యాయి. మళ్లీ తర్వాత, ప్రస్తుతం బి ఎం సి అందించిన నివేదిక ప్రకారం, గడచిన 24 గంటల్లో ముంబైలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా కరోనా వల్ల ఒక్కరు కూడా చనిపోవడం జరగలేదు. 

ముంబైలో మళ్లీ మామూలు పరిస్థితి: 

BMC రికార్డుల ప్రకారం, చివరిగా జూన్ 19 న, కరోనా కేసులు సున్నాగా నమోదయ్యాయి. ఆ తర్వాత, 2023లో ఇది ఆరవ సారి. అంటే ఇంతకుముందు ఐదు సార్లు కూడా సున్నా కేసరి నమోదయ్యాయి, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 24 గంటల వ్యవధిలో ముంబై మెట్రోపాలిస్‌లో తాజా COVID-19 కేసు ఏదీ నమోదు కాలేదు.

ఆదివారం నగరంలో రెండు కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో నగరంలో ఎలాంటి కొత్త కరోనావైరస్ సంబంధిత మరణాలు నమోదు కాలేదని, టోల్ కౌంట్ అనేది 19,775 అలాగే ఉంది మారలేదని BMC బులెటిన్ తెలిపింది. ముంబైలో గత కొన్ని రోజులుగా COVID-19 సంబంధిత మరణాలు కూడా ఏవి సంభవించినట్లు నివేదికలో లేదు. వైరస్ ఛాయలు మాయమవుతున్నాయి

బులెటిన్ ప్రకారం, నగరంలో 227 కొత్త కరుణ పరీక్షలు నిర్వహించడం జరిగింది, వాటి సంఖ్య 1,89,07,525కి చేరుకుంది. గత 24 గంటల్లో మెట్రోపాలిస్‌లో ఒక్కరికి కూడా కరోనా వచ్చినట్లు నమోదు కాలేదు. ఫలితంగా ఎప్పటినుంచో,2020 నుంచి కరోనా సోకిన వారి సంఖ్య 11,44,207 వద్ద స్థిరంగా ఉందని పౌర సంఘం తెలిపింది. ముంబైలో ప్రస్తుతం 23 యాక్టివ్ కోవిడ్-19 కేసులు ఉన్నాయని తెలిపింది.

మహానగరం ముంబైలో కరోనావైరస్ రికవరీ రేటు 98.3 శాతంగా ఉంది, జూలై 10 నుండి జూలై 16 వరకు కేసుల వృద్ధి రేటు 0.0003 శాతంగా ఉందని బులెటిన్ తెలిపింది. 

ఊపిరి పీల్చుకుంటున్న భారతీయులు: 

2020 మార్చి తర్వాత నుంచి, భారతదేశం అతలాకుతలంగా మారింది. ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ కండ ఖండాలు దాటి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రజలకు సేవ చేసి ఎంతోమంది డాక్టర్లు, పోలీసులు, సేవలు చేసే ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. అంతేకాకుండా, ఎంతోమంది కరోనా వైరస్ ని పోరాడలేక, ఆక్సిజన్ సిలిండర్లు లేక, తమ కోసం పట్టించుకునే వారు లేక ఎంతో మంది అనాధలుగా శవాలుగా మారారు. కనీసం చనిపోయిన తర్వాత కూడా వారిని కడసారి చూసుకునేందుకు కూడా, ఎవరిని అనుమతించని దుస్థితి. మళ్లీ మూడు సంవత్సరాలు తర్వాత, ఇప్పుడు భారతదేశంలో కొద్ది కొద్దిగా కరోనా వైరస్ ఛాయలు మాయం అవుతున్నాయి. మెల్లమెల్లగా భారతీయులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టారు. ఇది ఎప్పటికీ ఇలాగే మామూలు పరిస్థితుల్లో ఉండాలి అని, ఇంకెప్పటికీ వైరస్ అనేది మన దేశాన్ని కాకుండా ఏ దేశాన్ని కూడా పీడించకూడదని కోరుకుందాం.