ఇకపై రోడ్ల‌పై నో ధ‌ర్నా

5 నెలల తర్వాత ప్రముఖ ఇండియన్ మహిళా రెజ్లర్లు తమపై లైంగిక దాడులు చేసారని  ప్రముఖ పొలిటికల్ పార్టీ లో ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పై దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాన్ని కొనసాగించారు, దీనికి సంబందించిన విచారణను ఇకపై కోర్ట్ లో నే తేలుచుకుంటాం అని ఈ ఆదివారం ప్రకటించారు.  అధికార బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చార్జిషీట్ దాఖలు చేస్తామని   ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ […]

Share:

5 నెలల తర్వాత ప్రముఖ ఇండియన్ మహిళా రెజ్లర్లు తమపై లైంగిక దాడులు చేసారని  ప్రముఖ పొలిటికల్ పార్టీ లో ఉన్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు పై దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమాన్ని కొనసాగించారు, దీనికి సంబందించిన విచారణను ఇకపై కోర్ట్ లో నే తేలుచుకుంటాం అని ఈ ఆదివారం ప్రకటించారు. 

అధికార బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చార్జిషీట్ దాఖలు చేస్తామని   ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీ నెరవేర్చిందని రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియాలు ఒకే విధంగా ట్వీట్ చేసారు. 

“ ఈ కేసులో, మాకు న్యాయం జరిగే వరకు రెజ్లర్ల నిరసన కొనసాగుతుంది, కానీ ఈ (పోరాటం) కోర్ట్ లో కొనసాగుతుందని, విధుల్లో కాదని” ట్వీట్ లో తెలియచేసారు

“డబ్ల్యూఎఫ్ఐ (రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) లో సంస్కరణకు సంబంధించి, తాము ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై 11న ఎన్నికలకు సంబంధించి వాగ్దానం నెరవేర్చడం కోసం మేమందరం వేచి ఉంటాం” అని తెలిపారు, 

ఈ ప్రకటన పోస్ట్ అయిన కొన్ని నిమిషాల తర్వాత, మిస్  ఫోగట్ మరియు మిస్ మాలిక్ సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

 కొందరు జాతీయ మరియు అంతర్జాతీయ  రెజ్లర్లు లైంగిక వేధింపుల అభియోగాలు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసులు ఈ నెల ప్రారంభంలో మిస్టర్ సింగ్‌పై లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపు మరియు వేధింపుల ఆరోపణలు పై పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు,  

అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతల నుండి రిలీవ్ చేయబడిన Mr సింగ్, తనపై వచ్చిన అన్ని ఆరోపణలను తిరస్కరించారు. నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  “పోలీసులతో సహకరిస్తూనే ఉంటాను  అని మరియు కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తాను” అని అతని అనుచరుడు ఒకరు అన్నారు.

 తమకు ఆసియా క్రీడల ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇవ్వడంపై వివాదం తలెత్తడంతో ఈ  నిరసనకు నాయకత్వం వహిస్తున్న ముగ్గురు రెజ్లర్లు శనివారం  సోషల్ మీడియా లైవ్‌లో మిస్టర్ సింగ్‌పై తమ పోరాటం కొనసాగుతుందని గట్టిగ చెప్పారు. ఈ ప్రచారాన్ని ఎలా కొనసాగించాలో అయన పై  దాఖలైన ఛార్జిషీట్‌ తరువాత చర్చిస్తాం అని తెలియచేసారు

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, ఏడుగురు రెజ్లర్లు 66 ఏళ్ల మిస్టర్ సింగ్ తమను అనేక సందర్భాల్లో అసభ్యంగా తాకడం, లైంగిక ప్రయోజనాలను డిమాండ్ చేశారని చెప్పారు. 

జనవరిలో Mr సింగ్‌కి వ్యతిరేకంగా సిట్-ఇన్ నిరసన ను అనేక ఒలంపిక్ మరియు ఆసియా క్రీడల పతక విజేతలతో సహా రెజ్లర్లు ప్రారంభించారు మరియు  దీనిపై ఎలాంటి చర్య తీసుకోని నేపథ్యంలో ఏప్రిల్‌ లో తిరిగి మొదలుపెట్టారు, మరుసటి నెలలో అందరిని అక్కడినుండి  క్లియర్ చేయడంతో వారిని న్యూ ఢిల్లీలో పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు.

క్రీడాకారులను ఈడ్చుకెళ్లి బస్సుల్లో తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్‌ అవ్వడంతో అగ్రశ్రేణి క్రీడాకారులు మరియు ప్రతిపక్ష రాజకీయ నాయకుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

హోం మంత్రి అమిత్ షా మరియు తరువాత క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలవడానికి అంగీకరించే ముందు, రెజ్లర్లు తమ పతకాలను భారతదేశం యొక్క పవిత్ర నది అయిన గంగానదిలోకి విసిరేస్తామని బెదిరించారు. 

 మిస్టర్  ఠాకూర్ మిస్టర్ సింగ్ పై విచారణను పూర్తిచేయడానికి జూన్ 15 గడువు ఇవ్వడంతో 

రెజ్లర్లు తమ నిరసనను నిలిపివేశారు.