ఆ ప్రవేశ పరీక్షల్లో చెల్లించే ఫీజులకు GST మినహాయింపు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందించే  నో GST మన దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో, వస్తుసేవల పన్ను GST అతిపెద్ద సంస్కరణ అని అనుకోవచ్చు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, సర్ చార్జీలు, వ్యాట్ వంటి రకరకాల పన్నులను విలీనం చేసి GSTని అమల్లోకి తెచ్చారు. ఈ GST విధానం మన దేశంలో 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎన్నో రకాల పన్నుల స్థానంలో […]

Share:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందించే  నో GST

మన దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో, వస్తుసేవల పన్ను GST అతిపెద్ద సంస్కరణ అని అనుకోవచ్చు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, సర్ చార్జీలు, వ్యాట్ వంటి రకరకాల పన్నులను విలీనం చేసి GSTని అమల్లోకి తెచ్చారు. ఈ GST విధానం మన దేశంలో 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎన్నో రకాల పన్నుల స్థానంలో GST విధిస్తున్నారు. వస్తుసేవలపై శ్లాబుల వారీగా పన్ను విధించడం GSTతో మొదలుపెట్టారు. పన్ను శ్లాబులు సున్నా శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. కొన్ని పన్నులు మినహా దాదాపు అన్ని రకాల పన్నులను కలిపి సమగ్రమైన GSTలోకి తెచ్చారు. విలాసవంతమైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, ఎయిరేటెడ్ డ్రింక్స్ వంటి వాటిపై GSTతో పాటు సెస్ కూడా ఉంది. దీని మూలంగా సంబంధిత ఉత్పత్తుల ధరలు మరింతగా పెరిగాయి. GST అమలులోకి వచ్చిన తర్వాత చాలా రకాల ఉత్పత్తులపై పన్నులు తగ్గాయి. అమ్మకం, బదిలీ, కొనుగోలు, లీజు, దిగుమతి లేదా సర్వీసులకు సంబంధించిన అన్ని లావాదేవీలపై GSTని వసూలు చేస్తారు. GST అన్ని రకాల ఉత్పత్తులపైనా ఒకే విధంగా ఉండదు. మనం నిత్యం వాడే వస్తుసేవలలో ఒక్కొక్కదానిపై ఒక్కొక్క విధంగా GST ఉంటుంది. 

GST కౌన్సిల్ సమావేశం

GST కౌన్సిల్ సమావేశంలో కొన్ని ఉత్పత్తులపై GST రేటును తగ్గించడంతో పాటు అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మేలు చేసే అంశాలు కూడా ఉన్నాయి. వాటి గురించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  GST కౌన్సిల్ 49వ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని ఉత్పత్తులపై  GST రేటు తగ్గించగా, రాష్ట్రాలకు బకాయి ఉన్న  GST మొత్తాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాన్ మసాలా, గుట్కాలపై  ఉన్న GST పైన కూడా చర్చ జరిగింది. ఈ సమావేశం ఫిబ్రవరి 18న న్యూ ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిబడి. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఇతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. 

పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ  GST సమావేశంలో నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు నిర్వహించే ఎన్‌టిఎ (National Testing Agency) ని లెవీ పరిధి నుంచి మినహాయిస్తూ ఈ కౌన్సిల్ సిఫారసు చేసింది. అంటే.. విద్యా సంస్థల్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్షల నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అందించే సేవలకు GST మినహాయింపు ఇచ్చారు. దీంతో పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థులకు ఈ మినహాయింపుతో కాస్త ఊరట లభించనుంది. ఈ ఫీజులకు 18 శాతం GSTని విధించేవారు. తాజాగా ఈ ఫీజులపై  GSTని పూర్తిగా మినహాయించడంతో విద్యార్థులకు కొంత ఊరట లభించిందదే చెప్పాలి. వీటితో పాటు విద్యార్థులకు ఉపయోకరంగా ఉండే పెన్సిల్, షార్పనర్‌‌లపై విధించే  GSTని  కూడా తగ్గించారు. అంతకముందు 18 శాతంగా ఉన్న పన్నును 12 శాతానికి తగ్గించారు.

కోర్టులు, ట్రిబ్యునల్‌లు అందించే సేవలపై పన్ను విధించాలని GST కౌన్సిల్ నిర్ణయించింది. లిక్విడ్ బెల్లంపై GST రేటును 18 శాతం నుంచి 0 లేదా 5 శాతానికి తగ్గించారు. ముందుగా ప్యాక్ చేసిన మరియు లేబుల్ చేసిన కొనుగోళ్లకు 5 శాతం వరకు  GST ఉంటుంది. ముసాయిదాకు సవరణలు వచ్చే 5-6 రోజుల్లో విడుదల చేయబడతాయని తెలిపారు.