G20 సందర్భంగా ఢిల్లీలో ఫుడ్ డెలివరీలకు ఆంక్షలు

G20 సమ్మిట్ సమీపిస్తున్న వేళ, ఢిల్లీలోని కొన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రత్యేకించి ఫుడ్ డెలివరీ సర్వీసులు సెప్టెంబర్ 8-10 తేదీలలో నిలిపి వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే నిబంధనలు వర్తించవు అని ప్రకటించారు.  కొన్ని సర్వీసులకు మాత్రమే అర్హత:  G20 సమ్మిట్ సమయంలో అంటే సెప్టెంబర్ 8-10 తేదీలలో, జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొన్ని కమర్షియల్ డెలివరీ సర్వీసులు కూడా మూడు […]

Share:

G20 సమ్మిట్ సమీపిస్తున్న వేళ, ఢిల్లీలోని కొన్ని ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రత్యేకించి ఫుడ్ డెలివరీ సర్వీసులు సెప్టెంబర్ 8-10 తేదీలలో నిలిపి వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కేవలం మెడికల్ సర్వీసులకు మాత్రమే నిబంధనలు వర్తించవు అని ప్రకటించారు. 

కొన్ని సర్వీసులకు మాత్రమే అర్హత: 

G20 సమ్మిట్ సమయంలో అంటే సెప్టెంబర్ 8-10 తేదీలలో, జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొన్ని కమర్షియల్ డెలివరీ సర్వీసులు కూడా మూడు రోజులు పాటు ఢిల్లీలో పూర్తిగా నిషేధం అని పేర్కొన్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సర్వీసులు కూడా మూడు రోజులపాటు సర్వీసులో ఉండవని, మరికొన్ని ఆన్లైన్ సర్వీసులు కూడా నిలిపివేస్తున్నట్లు స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్, ఎస్ఎస్ యాదవ్, సెప్టెంబర్ 4న ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. 

అయితే మెడికల్ సర్వీసులకు, ల్యాబ్ రిపోర్ట్స్, శాంపుల్ కలెక్షన్స్, అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన హోటల్స్ కి, హాస్పిటల్స్ కి వెహికల్ సర్వీస్లు, హౌస్ కీపింగ్, క్యాటరింగ్, పారిశుద్ధ్య కార్యకలాపాలకి పర్మిషన్ ఉంటుందని, అది కూడా కొన్ని వెరిఫికేషన్ జరిగిన తర్వాతే సర్వీసులు నడిపేందుకు అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. 

G20 సమ్మిట్:

వచ్చేనెల సెప్టెంబర్ లో మన భారతదేశంలో G-20 సమ్మిట్ నిర్వహించబోతున్నారు. G-20 అంటే డెవలప్డ్ అలాగే డెవలపింగ్ దేశాల ఆర్థిక వ్యవస్థ కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశం అని చెప్పుకోవచ్చు.

ఇంచుమించు 110 దేశాల నుంచి సుమారు 12,300 మంది ప్రతినిధులు రానున్నట్లు అంచనా. ఇప్పుడు వరకు భారతదేశంలో జరిగిన సమావేశాలలో, ఇప్పుడు జరగబోయే G-20 సబ్మిట్ అనేది అతి పెద్ద సమావేశం అని చెప్పుకోవచ్చు. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు.

G20 ముఖ్య ఉద్దేశాలు: 

అయితే ప్రస్తుతం సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమ్మిట్ ముఖ్యంగా, మల్టీ లేటరల్ ఇన్స్టిట్యూషన్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా, ప్రమాదాల నుంచి సమస్యలను పాండమిక్స్ను ఈజీగా ఎదుర్కొనే విధంగా, తమ దేశాలను మరింత బలంగా మార్చుకోవడమే కాకుండా, ప్రపంచంలో ఉండే ప్రతి దేశం కూడా బలంగా మారేలా, డెవలప్డ్ కంట్రీస్ గా మారేలా ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయాల మీద చర్చించడమే, G-20 సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే 2023 జూన్ లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా సందర్శించడం జరిగింది. అయితే అదే సమయంలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్ మాట్లాడుతూ, ఆయన వచ్చే నెల సెప్టెంబర్ లో జరగబోయే G-20 సమిట్ కి హాజరు అవ్వడానికి చూస్తానని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు బిడెన్ సెప్టెంబర్ 8న ప్రత్యేకించి నరేంద్ర మోదీతో కొన్ని చర్చలు జరపడానికి హాజరుకానున్నట్లు వైట్ హౌస్ ప్రకటించడం జరిగింది.

G20 సమ్మిట్ లో ముఖ్యంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కియే, UK మరియు US ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ (EU). అతిథి దేశాలు: బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ మరియు UAE.