Lucknow: ఆస్పత్రిలో బెడ్‌లు ఖాళీ లేక కుమారుడ్ని కోల్పోయిన మాజీ ఎంపీ..

అనారోగ్యంతో బాధపడుతోన్న కుమారుడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు బీజేపీ మాజీ ఎంపీ. అయితే, అక్కడ ఎమర్జెన్సీ వార్డు(Emergency ward)ల్లో బెడ్‌లు ఖాళీ లేకపోవడంతో కొద్ది గంటల్లోనే అతడు చనిపోయాడు. దీంతో ఆయన తన కుమారుడి డెడ్ బాడీతో ఆస్పత్రి వార్డు ముందు నిరసన చేపట్టారు. లక్నో(Lucknow)లో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. యోగి ప్రభుత్వంపై ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మండిపడ్డారు.  […]

Share:

అనారోగ్యంతో బాధపడుతోన్న కుమారుడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు బీజేపీ మాజీ ఎంపీ. అయితే, అక్కడ ఎమర్జెన్సీ వార్డు(Emergency ward)ల్లో బెడ్‌లు ఖాళీ లేకపోవడంతో కొద్ది గంటల్లోనే అతడు చనిపోయాడు. దీంతో ఆయన తన కుమారుడి డెడ్ బాడీతో ఆస్పత్రి వార్డు ముందు నిరసన చేపట్టారు. లక్నో(Lucknow)లో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతి పక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. యోగి ప్రభుత్వంపై ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మండిపడ్డారు. 

Read More: S Jaishankar: ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారిని విడిపిస్తాం- జై శంకర్‌

అస్పత్రి ఎమర్జెన్సీ వార్డు(Emergency ward)లో బెడ్‌ల ఖాళీలేక మాజీ ఎంపీ ఒకరు తన కుమారుడిని కోల్పోయారు. దీంతో తన కుమారుడి మృతదేహంతో ఆస్పత్రిలోని వార్డు ముందు కూర్చొని నిరసనకు బీజేపీ నేత దిగారు. విషాదకర ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నో(Lucknow)లో చోటుచేసుకుంది. తన కుమారుడు మృతికి వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని, తక్షణమే అతడ్ని విధుల్లోంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనతో పాటు మృతుడి కుటుంబ సభ్యులు కూడా ధర్నాకు దిగారు. మాజీ ఎంపీ భైరాన్‌ ప్రసాద్‌ మిశ్రా(Bhairon Prasad Mishra) కుమారుడు ప్రకాశ్‌ మిశ్రా(Prakash Mishra) (41) కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో లక్నో ఎస్‌జీపీజీఐ ఆసుపత్రికి(SGPGI Hospital) తరలించారు.

రాత్రి 11 గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా.. కొన్ని గంటలకే ప్రకాశ్‌ మిశ్రా(Prakash Mishra) మృతి చెందాడు. దీంతో తన కుమారుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆసుపత్రి వార్డులో నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. ఎమర్జెన్సీ వార్డు(Emergency ward)లో బెడ్‌లు ఖాళీగా లేవని, విధుల్లో ఉన్న వైద్యుడు ఎలాంటి సహాయం చేయలేదని ఆయన ఆరోపించారు. ‘నేను నా కొడుకును కోల్పోయాను. నా కుమారుడి చనిపోయిన తర్వాత దాదాపు 20-25 మంది రోగులకు చికిత్స చేశారు. నేను నిరసనకు దిగడంతో సదరు డాక్టర్‌ను తొలగించాలని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు.. నా కుమారుడు మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలి’ అని భైరాన్ ప్రసాద్(Prasad Mishra) కోరారు.

ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని వేశారు.  ఘటనపై సమాచారం అందుకున్న పీజీఐ ఆస్పత్రి డైరెక్టర్​ డాక్టర్ ఆర్​.కే ధీమాన్(Dr. RK Dhiman)​.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అక్కడకు చేరుకుని ఘటనపై ఆరాతీశారు. దీనిపై వివరణ ఇచ్చిన ఆసుపత్రి చీఫ్‌.. “మాజీ ఎంపీ కుమారుడి మృతి విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. అయితే రోగి ఆస్పత్రికి చేరుకున్న సమయానికే అతడి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దీంతో అతడికి ఐసీయూ(ICU) బెడ్​ అవసరం పడింది. కానీ, ఆస్పత్రిలో అప్పటికే బెడ్స్ నిండిపోయాయి. మరో వైపు రోగి పరిస్థితి విషమిస్తున్నా వైద్యులు ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని మృతుడి తండ్రి చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ కమిటీని వేశాము. కమిటీ రిపోర్ట్​ వచ్చాక.. దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతం డాక్టర్‌ను విధుల్లోంచి తొలగించాం’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌(Akhilesh Yadav) ఈ ఘటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ(BJP) ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇది ఆసుపత్రి తప్పిదం కాదని, సీఎం యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) తప్పిదమని ఆరోపించారు. ఆసుపత్రులకు ఎందుకు నిధులు సమకూర్చడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరో వైపు, ఈ ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య(Deputy CM Keshav Prasad Maurya) స్పందిస్తూ.. బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదొక దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఇక, బైరాన్ ప్రసాద్ మిశ్రా 2014 సాధారణ ఎన్నికల్లో బండా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.