Ap High Court: హైకోర్టులో చంద్రబాబుకు మరోసారి ఎదురుదెబ్బ

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు(Skill development Case)లో బెయిల్ పిటిషన్‌(Bail Petition), మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాయి. ఈ పిటిషన్లపై విచారణ దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) ముందుకు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు(Ap High Court) ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు వైద్య నివేదికలను తదుపరి విచారణ నాటికి తమ ముందు ఉంచాలని రాజమహేంద్రవరం(Rajamahendravaram) సెంట్రల్ జైల్ అధికారులను కోర్టు ఆదేశించింది. స్కిల్‌ […]

Share:

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు(Skill development Case)లో బెయిల్ పిటిషన్‌(Bail Petition), మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాయి. ఈ పిటిషన్లపై విచారణ దసరా సెలవుల ప్రత్యేక బెంచ్‌ (వెకేషన్‌ బెంచ్‌) ముందుకు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు(Ap High Court) ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు వైద్య నివేదికలను తదుపరి విచారణ నాటికి తమ ముందు ఉంచాలని రాజమహేంద్రవరం(Rajamahendravaram) సెంట్రల్ జైల్ అధికారులను కోర్టు ఆదేశించింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిలు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు(ACB Court) నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టు(Highcourt)ను ఆశ్రయించారు. విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా(Siddhartha Luthra), దమ్మాలపాటి శ్రీనివాస్‌(Dammalapati Srinivas) వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యిపేజీలతో దాఖలు చేసిన కౌంటర్‌ కాపీని తమకు బుధవారం రాత్రి అందజేసిందని కోర్టుకు చెప్పారు. ప్రభుత్వం కౌంటర్‌ ఇంకా కోర్టు ఫైలులోకి రాలేదని… పేజీలు సరిగా కనిపించట్లేదని దాన్ని హైకోర్టు రిజిస్ట్రీ వెనక్కి పంపినట్లు న్యాయమూర్తి తెలిపారు.

పిటిషనర్‌ ఇప్పటికే 40 రోజులకు పైగా జైల్లో ఉన్నారని.. ఆయనను పోలీసులు కస్టడీ(Custody)లోకి తీసుకొని రెండు రోజులు ప్రశ్నించిన విషయాన్ని చంద్రబాబు(Chandrababu) లాయర్లు ప్రస్తావించారు. మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ(CID) పిటిషన్ దాఖలు చేయగా.. ఏసీబీ కోర్టు(ACB Court) తిరస్కరించిన విషయాన్ని పేర్కొన్నారు. ఈ కేసులో 40 రోజులుగా దర్యాప్తులో పురోగతి లేదని.. చంద్రబాబు బరువు బాగా తగ్గడంతో ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన ఉందన్నారు. తనకు నచ్చిన డాక్టర్ దగ్గర పరీక్షలు నిర్వహించుకునే హక్కు పిటిషనర్‌కు ఉందని.. అందుకు అనుమతించాలని కోరారు. ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రెండువారాల పాటు మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని కోరారు. మధ్యంతర బెయిల్ కోసం అనుబంధ పిటిషన్‌ వేశామనర్నారు.

క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో వాదనల అనంతరం తీర్పు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాక మధ్యంతర బెయిలు ఇవ్వాలని పిటిషనర్‌ లాయర్లు విజ్ఞప్తి చేశారని ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించిందని.. అందువల్ల ప్రస్తుత పిటిషన్లోనూ మధ్యంతర బెయిలు ఇవ్వడానికి వీల్లేదన్నారు.ఏఏజీ వాదలనపై చంద్రబాబు లాయర్లు అభ్యంతరం తెలిపారు.

ఏఏజీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని.. తాము మధ్యంతర బెయిలు కోసం సుప్రీంకోర్టు(Supreme Court)ను కోరగా.. గురువారం (19న) హైకోర్టులో బెయిలు పిటిషన్‌(Bail Petition)పై విచారణ ఉందని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారన్నారు అందుకే మధ్యంతర బెయిలు విషయాన్ని హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందన్నారు. వైద్య నివేదికలను సుప్రీంకోర్టు ముందు ఉంచలేదని.. అనారోగ్య కారణాల దృష్ట్యా మధ్యంతర బెయిలు ఇవ్వాలని తాము సుప్రీంకోర్టును కోరలేదన్నారు. వైద్యపరీక్షల విషయంలో అధికారుల నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉందని ఏఏజీ అన్నారు. దీంతో మధ్యాహ్నం 2.15కి విచారణ వాయిదా పడగా.. ఆ తర్వాత జరిగిన విచారణలో చంద్రబాబు వైద్య నివేదికలను హైకోర్టు ముందు ఉంచేలా జైలు అధికారులను ఆదేశించాలని లాయర్లు కోరారు. అలాగే మధ్యంతర బెయిలు అనుబంధ పిటిషన్‌, ప్రధాన పిటిషన్లపై విచారణను వెకేషన్‌ బెంచ్‌ వద్దకు వాయిదా వేయాలని కోరగా.. న్యాయమూర్తి అంగీకరించారు. 

ఫైబర్ నెట్ కేసు

చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు(Fiber net case) బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. నవంబర్‌ 9కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ బోస్(Justice Bose), త్రివేది (Trivedi)ధర్మాసనం తెలిపింది. చంద్రబాబుపై నమోదు చేసిన మూడు ఎఫ్‌ఐఆర్‌లకు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ తీర్పుకు ముడిపడి ఉన్నాయని సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు వివరించారు.. దీంతో విచారణను నవంబర్‌ 9కి వాయిదా వేశారు. అలాగే క్వాష్ పిటిషన్‌పై తీర్పును వచ్చే నెల 8న వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై తీర్పు తర్వాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది. అప్పటి వరకు పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఫైబర్‌నెట్‌ కేసులో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.