మేదాంత హాస్పిట‌ల్‌ను వెంటాడుతున్న దెయ్యం భ‌యం

మూఢనమ్మకాలు అనేవి ఇండియాలో చాలా కామన్. మన దేశం ఎంత డెవలప్ అయినా కానీ ఎక్కడో ఓ చోట ఈ మూఢ నమ్మకాల వల్ల ప్రజలు సఫర్ అవుతూనే ఉన్నారు. ఈ మూఢ నమ్మకాలను రూపుమాపేందుకు అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇవి మాత్రం పూర్తిగా లేకుండా పోవడం లేదు. ఒక రూపంలో అంతం అయ్యాయని సంబరపడే లోపే మరో రూపంలో వస్తున్నాయి. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ […]

Share:

మూఢనమ్మకాలు అనేవి ఇండియాలో చాలా కామన్. మన దేశం ఎంత డెవలప్ అయినా కానీ ఎక్కడో ఓ చోట ఈ మూఢ నమ్మకాల వల్ల ప్రజలు సఫర్ అవుతూనే ఉన్నారు. ఈ మూఢ నమ్మకాలను రూపుమాపేందుకు అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇవి మాత్రం పూర్తిగా లేకుండా పోవడం లేదు. ఒక రూపంలో అంతం అయ్యాయని సంబరపడే లోపే మరో రూపంలో వస్తున్నాయి. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మూఢ నమ్మకాలతో కేవలం చదువు లేని వారు మాత్రమే కాకుండా చదువుకున్న వ్యక్తులు కూడా అవస్థలు పడుతున్నారు. ఈ అవస్థల నుంచి సాధారణ ప్రజలను గట్టెక్కించేందుకు ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా నడుం బిగిస్తున్నాయి. 

ఏకంగా ఆసుపత్రిలోనే 

మూఢ నమ్మకాలను గ్రామస్తులు పాటించడం వాటి వల్ల తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడం కామన్. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోను చూస్తే మాత్రం అసలు నవ్వాలో ఏడవాలో కూడా సరిగ్గా అర్థం కాదు. ఏకంగా ఓ పేరు మోసిన ఆసుపత్రే మూఢ నమ్మకాలను విశ్వసిస్తుండడం గమనార్హం. అదీ మరేదే మారుమూల పల్లెలో ఉందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ ఆసుపత్రి ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉండడం గమనార్హం. ఢిల్లీ పరిసరాల్లో ఉన్న గురుగ్రామ్ లో ఉన్న మేదాంత అనే ఓ పెద్దాసుపత్రిలో ఓ చోద్యం వెలుగు చూసింది. ఆ ఆసుపత్రి ఎలవేటర్ లో 13 వ ఫ్లోర్ కు సంబంధించిన గుర్తు లేదు. దీంతో ఆ బహుళ అంతస్తుల బిల్డింగ్ లో 13వ ఫ్లోర్ లేదనే విషయం మనకు ఇట్టే అర్థం అవుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం రెడ్డిట్‌ లో హల్‌ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన పిక్ ను ఓ యూజర్ పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. 

ఎక్కడికి పోతోంది వైజ్ఞానం

నేటి రోజుల్లో విజ్ఞానం అనేది ఎంతో డెవలప్ అయిందని చాలా మంది నమ్ముతారు. కానీ విజ్ఞానం డెవలప్ అవుతుందని అనుకున్న తరుణంలో ఆసుపత్రిలో ఇటువంటి ఘటన వెలుగు చూడడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. 13వ ఫ్లోర్ అనేది దెయ్యాలు, భూతాలకు నెలవు అనేది మనం ఇప్పటి వరకు సినిమాల్లోనే చూసుంటాం. కానీ ఇప్పుడు ఈ సీన్ ఆస్పత్రిలో కూడా కనిపించడంతో అంతా షాక్ అవుతున్నారు. 13 నెంబర్ చుట్టూ ఉన్న భయాలను “ట్రిస్కైడెకాఫోబియా” అని వ్యవహరిస్తారు. ఇక వాస్తు అనేది చూసుకుంటే అనేక సంస్కృతులలో ఈ 13 నెంబర్ ని చాలా మంది అలాగే వదిలేస్తుంటారు. అంతే కాకుండా 13వ నెంబర్ ఫ్లోర్ ను కొనేందుకు కూడా చాలా మంది నిరాశ చూపుతుంటారు. ఇంకా చెప్పాలంటే 13 నెంబర్ ను చాలా మంది దురదృష్ట సంఖ్యగా భావిస్తుంటారు. అందుకోసమే చాలా మంది 13వ ఫ్లోర్ లో ఓ అంతస్తును కొనుగోలు చేసేందుకు అందరూ మక్కువ చూపరు. ఈ నిరాసక్తి అనేది కేవలం సినిమాలకు మరియు ఫ్యామిలీ బిల్డింగ్స్ కు మాత్రమే కాకుండా ప్రస్తుతం రోగుల ప్రాణాలను కాపాడే ఆసుపత్రులకు కూడా సోకడాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ ట్రెండ్ అనేది కేవలం ఆసుపత్రులకు మాత్రమే పరిమితం కాలేదు. పెద్ద, పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు అని చెప్పుకునే వాటిలో కూడా ఇదే ట్రెండ్ మొదలయింది. 13 వ ఫ్లోర్ అంటేనే చాలు వాటిని కొనేందుకు జనాలు వెనకడుగు వేస్తున్నారు. సాధారణ జనం ఇలా చేస్తున్నారని అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఎన్నో పెద్ద చదువులు చదివి నలుగురికి చెప్పాల్సిన వారు కూడా ఇలా సిల్లీ రీజన్లతో ఫ్లోర్లకు ఫోర్లే విడిచి పెట్టడం అనేది గమనార్హం. ఇటువంటి వారు సమాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామని అనుకుంటున్నారో తెలియదు. ఇలాంటి ఘటనలు బయట ఎక్కడో కాకుండా ఆసుపత్రులలోనే కొనసాగడం షాక్ అనే చెప్పాలి.