కేరళలో నిఫా వైరస్ కలకలం, కోళికోడ్ జిల్లాలో హై అలర్ట్

కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులు నిఫా వైరస్ సోకింది. గతంలో ఈ సంఖ్య నాలుగు గా ఉండగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు వెల్లడించారు. దీనితో కోళికోడ్ జిల్లాలో నిఫా వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుగురికి చేరింది. తాజాగా వైరస్ సోకిన వ్యక్తి ఆ జిల్లాలోని 24 ఏళ్ళ హెల్త్ వర్కర్ గా గుర్తించారు. కాగా ఆ వ్యక్తితో 706 మంది సన్నిహితంగా […]

Share:

కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులు నిఫా వైరస్ సోకింది. గతంలో ఈ సంఖ్య నాలుగు గా ఉండగా కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్ మరో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు వెల్లడించారు. దీనితో కోళికోడ్ జిల్లాలో నిఫా వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుగురికి చేరింది. తాజాగా వైరస్ సోకిన వ్యక్తి ఆ జిల్లాలోని 24 ఏళ్ళ హెల్త్ వర్కర్ గా గుర్తించారు. కాగా ఆ వ్యక్తితో 706 మంది సన్నిహితంగా ఉన్నట్లుగా మంత్రి వెల్లడించారు. వారిలో 153 మంది హెల్త్ వర్కర్స్ ఉండగా 77 మంది హై రిస్క్ కేటగిరీ లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. దీంతో కోళికోడ్ జిల్లాలో హై అలెర్ట్ ప్రకటించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. 

అసలు నిఫా వైరస్ అంటే ఏమిటి? 

నిఫా వైరస్ ను జంతువుల నుండి మానవులకి సంక్రమించే వ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) పేర్కొన్నది. ఈ వైరస్ కలుషితమైన ఆహారం వలన మరియు మనిషి నుండి మనిషికి వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ లక్షణాలు మాములుగా గుర్తు పట్టే అవకాశం లేదు. ఈ వైరస్ సోకిన వారు శ్వాసకోశ సంబంధమైన ఇబ్బంది కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ వైరస్ మరికొన్ని ప్రాణాంతక వ్యాధులను కూడా కలగజేస్తుంది. ముఖ్యంగా పందులు వంటి జంతువుల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నది. 

ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసిన అధికారులు 

నిఫా వైరస్ కారణంగా కేరళ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు గా అనుమానం వ్యక్తం అవుతుంది. కాగా మరో ఐదు నిఫా వైరస్ కేసులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. వీరు అందరూ ICU లో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే వీరికి సన్నిహితంగా ఉన్న వారి గురించి కూడా ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఈ వైరస్ మనిషి నుండి మనిషికి వ్యాపించే అవకాశం ఉండడంతో డేంజర్ జోన్ లో ఉన్న వారికి వీలైనంత త్వరగా వైద్య పరీక్షలు చేయడానికి 16 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు డేంజర్ జోన్ లో ఉన్న వారిని గుర్తించడం, వారికి వైద్య పరీక్షలు చేయడం, వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించడం మొదలైన అన్ని అంశాలను నిర్వహిస్తారు. 

కేసులు అన్నీ ఒకే జిల్లాలో

కేరళ రాష్ట్రంలో నమోదు అయిన నిఫా వైరస్ కేసులు అన్నీ కోళికోడ్ జిల్లా లోనే నమోదు అవ్వడం ఆ జిల్లా వాసులను ఆందోళన కు గురి చేస్తుంది. పైగా 706 మంది వ్యక్తులు నిఫా వైరస్ సోకిన వారికి కాంటాక్ట్ లిస్ట్ లో ఉండడం వారిని మరింత కలవర పెడుతుంది. వారి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా అందరినీ ట్రేస్ చెయ్యడం సవాలుగా మారింది. రాష్ట్ర ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వం సూచించింది. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన వైద్య పరీక్షలు చేపించుకోవాలి అని అధికారులు సూచించారు. ఈ పరిస్థితి చక్క దిద్దడానికి అధికారులు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి తో కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారు భయపడకుండా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు చేపించుకుంటే త్వరగా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని అన్నారు.

Tags :