రాష్ట్రంలో బంగ్లాదేశ్ వేరియంట్ ఉందన్న కేరళ ప్రభుత్వం

దేశంలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేరళలో నాలుగు నిపా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేరళలో వైరస్ అలర్ట్ ప్రకటించారు. ఈ నిపా వైరస్ తో కోజికోడ్ జిల్లాలో ఇద్దరు ఈ వైరస్ వల్ల చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఒక మరణం సంభవించగా, మరొకటి ఆగస్టు 30న కోజికోడ్ జిల్లాలో సంభవించింది. మృతుల బంధువులకు ఇద్దరికి పాజిటివ్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్ వచ్చింది. 2018లో […]

Share:

దేశంలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేరళలో నాలుగు నిపా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కేరళలో వైరస్ అలర్ట్ ప్రకటించారు. ఈ నిపా వైరస్ తో కోజికోడ్ జిల్లాలో ఇద్దరు ఈ వైరస్ వల్ల చనిపోయారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఒక మరణం సంభవించగా, మరొకటి ఆగస్టు 30న కోజికోడ్ జిల్లాలో సంభవించింది. మృతుల బంధువులకు ఇద్దరికి పాజిటివ్ పరీక్ష చేయగా వారికి పాజిటివ్ వచ్చింది. 2018లో కేరళ మొదటిసారిగా నిపా వైరస్ ను గుర్తించారు. ఈ వ్యాధి సోకిన సోకిన 23 మందిలో ఇరవై ఒక్కరు మరణించారు.

2019, 2021లో నిపాతో మరో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. వైరస్ సోకిన గబ్బిలాలు, పందులు లేదా ఇతర వ్యక్తుల శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది మొట్టమొదట 1999లో మలేషియా, సింగపూర్‌లో పందుల పెంపకందారులు, పందులతో సన్నిహితంగా ఉన్నవారి ఈ వ్యాధి వచ్చింది. పరిస్థితిని సమీక్షించడానికి, వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం చేయడానికి నిపుణుల బృందాన్ని జిల్లాకు తరలించారు. “నేను కేరళ ఆరోగ్య మంత్రితో మాట్లాడాను, ఈ సీజన్‌లో ఈ వైరస్ గురించి చాలాసార్లు నివేదికలు వచ్చాయి. కేసులు వస్తున్నాయి. ఈ వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. దీనికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక మార్గదర్శకాన్ని సిద్ధం చేసింది. జాగ్రత్తలు తీసుకోండి” అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా తెలిపారు.

కోజికోడ్‌లోని ఏడు ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించారు. ఈ ఏడు చోట్ల 43 వార్డులకు ప్రవేశ, నిష్క్రమణలను పరిమితం చేశారు. వీటిలో అయంచేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యాపల్లి, కవిలుంపర ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అవసరమైన సేవలు మాత్రమే అనుమతిస్తారు. దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. మెడికల్ షాపులు, ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు తెరిచి ఉంటాయి. కార్యాలయాలు తక్కువ మంది పని చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు, పాఠశాలలు, అంగన్‌వాడీలు మూసివేశారు.

పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. ఐదు శాంపిల్స్‌ను సేకరించగా వాటిలో మూడు పాజిటివ్‌గా తేలింది. జూనోటిక్ వైరస్, నిపా పండ్ల గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఇది మొట్టమొదట మలేషియా గ్రామంలో కనుగొన్నారు. WHO ప్రకారం, ఇది పందులు, మానవులలో తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి.

ఎలా వ్యాపిస్తుంది?:

ఈ ప్రాణాంతక వ్యాధికారక వ్యాధి సోకిన గబ్బిలాలు, పందులు లేదా ఇతర వ్యక్తుల శరీర ద్రవాలతో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది.

కేరళలో నిపా వైరస్ ఎలా వచ్చింది?:

2018 నుండి కేరళలో ఇది నాల్గవ నిపా వ్యాప్తి ఇది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లిన 26 ఏళ్ల వ్యక్తి, అతని పరిస్థితి నిపా అని నిర్ధారించడానికి ముందే అతని కుటుంబ సభ్యులు, ఇతరులకు సోకింది. ఈ వ్యాధి సోకిన 23 మందిలో 21 మంది మరణించారు. గబ్బిలాల వైరస్ వ్యాప్తికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రమాదం ఉన్న ప్రదేశాలలో కేరళను రాయిటర్స్ పరిశోధన గుర్తించింది.

లక్షణాలు ఏమిటి?:

జ్వరం, తలనొప్పి, మైయాల్జియా (కండరాల నొప్పులు), గొంతు నొప్పి, వాంతులు, మైకము లేదా అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ లేదా వైవిధ్య న్యుమోనియా. ఎన్సెఫాలిటిస్, మెదడు వాపు, నిపా వైరస్ లక్షణాలు.

చికెన్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందా?:

గబ్బిలాల లాలాజలం లేదా మూత్రం ద్వారా కలుషితమైన ఆహారం తీసుకోవడం ద్వారా నిపా వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. 

 నిపాకు మందు ఉందా?:

మానవ ఉపయోగం కోసం ఆమోదించబడిన టీకాలు లేదా మందులు ప్రస్తుతం లేవని WHO తెలిపింది.

నిపా నుంచి కోలుకోగలరా?:

చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారు, అయితే ప్రాణాలతో బయటపడిన వారిలో దీర్ఘకాలిక నరాల సంబంధిత వ్యాధులు రావొచ్చు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?:

సోకిన వ్యక్తులతో సన్నిహిత (అసురక్షిత) ఉండకూడదు. NH95-గ్రేడ్ మాస్క్‌లను ధరించాలి. సబ్బుతో చేతులు కడుక్కోవాలి. కలుషితమైన, పాక్షికంగా తిన్న పండ్లను తినకుండా ఉండండి. వాటిని పూర్తిగా కడగాలి.