కలవరం రేపుతున్న కేరళలో నిపాహ్ కేసులు

కేరళలో ఇప్పటికీ నిపాహ్ కేసులు కారణంగా హడలు పుట్టిస్తున్నాయి. అక్కడ కేసుల సంఖ్య ఐదుకు చేరగా, కేసులతో సంబంధం ఉన్న 700 మందిని గుర్తించాల్సిన పనిలో పడింది కేరళ ప్రభుత్వం. అంతేకాకుండా అందులో 77 మంది రిస్క్ లో ఉన్నట్లు ప్రకటించింది. నిపాహ్ కలవరం:  కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం మరో నిపా వైరస్ కేసును ధృవీకరించారు. అయితే ఇప్పటికి రాష్ట్రంలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ఐదుకి చేరుకుంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో […]

Share:

కేరళలో ఇప్పటికీ నిపాహ్ కేసులు కారణంగా హడలు పుట్టిస్తున్నాయి. అక్కడ కేసుల సంఖ్య ఐదుకు చేరగా, కేసులతో సంబంధం ఉన్న 700 మందిని గుర్తించాల్సిన పనిలో పడింది కేరళ ప్రభుత్వం. అంతేకాకుండా అందులో 77 మంది రిస్క్ లో ఉన్నట్లు ప్రకటించింది.

నిపాహ్ కలవరం: 

కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం మరో నిపా వైరస్ కేసును ధృవీకరించారు. అయితే ఇప్పటికి రాష్ట్రంలో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య ఐదుకి చేరుకుంది. కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా సుమారు 706 మంది కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నారు, వీరిలో 77 మంది హై-రిస్క్ కేటగిరీలో ఉన్నారు, అయితే ఇందులో 153 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. హై-రిస్క్ కేటగిరీలో ప్రస్తుతం ఎవరికీ లక్షణాలు కనిపించడం లేదు.

13 మంది వ్యక్తులు ప్రస్తుతం హాస్పిటల్లో అబ్జర్వేషన్ లో ఉన్నారు. అంతేకాకుండా వీరిలో తలనొప్పి వంటి తేలికపాటి లక్షణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైరిస్క్ కాంటాక్ట్‌లు వారి ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది.

కేరళ ప్రభుత్వం పెరుగుతున్న కేసులు విషయంలో సరైన జాగ్రత్తలు చేసేందుకు 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్‌లో ఉన్న వారికి నిత్యావసరాలను అందించడంలో సహాయపడేందుకు స్థానిక ప్రభుత్వం ద్వారా వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేశారు. బ్రెయిన్ డ్యామేజింగ్ వైరస్ కేరళలో ఇప్పటి వరకు ఇద్దరిని బలిగొంది. కంటైన్‌మెంట్ జోన్‌లోని అన్ని పాఠశాలల విద్యార్థులకు ఇంటి నుంచే తరగతులకు హాజరయ్యేలా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి పబ్లిక్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను ఆదేశించారు. 

నిపా వైరస్ అంటే ఏమిటి?: 

నిపా వైరస్ (NiV) అనేది జూనోటిక్ వైరస్ మరియు జంతువుల నుండి గబ్బిలాలు లేదా పందులు వంటి వాటి నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తుల మధ్య కూడా వ్యాపిస్తుంది.

టెరోపోడిడే కుటుంబానికి చెందిన పండ్ల గబ్బిలాల ద్వారా నిపా వైరస్‌ వ్యాప్తి జరుగుతుంది. 

నిపా వైరస్ లక్షణాలు ఏమిటి?: 

సోకిన వ్యక్తులలో, నిపా వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారిలో తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వరకు అనేక రకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. ఈ వైరస్ పందుల వంటి జంతువులలో కూడా తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది, దీని ఫలితంగా రైతులకు గణనీయమైన ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, వ్యాధి సోకిన వ్యక్తులు మొదట్లో జ్వరం, తలనొప్పి, మైయాల్జియా (కండరాల నొప్పి), వాంతులు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపించడం జరుగుతుంది. దీని తర్వాత మైకము, మగత, స్పృహ లేకపోవడం మరియు తీవ్రమైన ఎన్సెఫాలిటిస్‌ను సూచించే నరాల వీక్నెస్ ఉంటుంది. కొంతమంది తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను కూడా అనుభవించవచ్చు. ఎన్సెఫాలిటిస్ మరియు మూర్ఛలు తీవ్రమైన సందర్భాల్లో సంభవిస్తాయి, 24 నుండి 48 గంటల్లో కోమాకు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. 

WHO ప్రకారం, ఇన్‌ఫెక్షన్ నుండి లక్షణాల ప్రారంభం వరకు 4 నుండి 14 రోజుల వరకు ఉంటుందని నమ్ముతారు. అయినప్పటికీ, వ్యాధి బయటపడే లక్షణాలు 45 రోజులలో కూడా ఉండొచ్చు అని పేర్కొంది. కేసు మరణాల రేటు 40% నుండి 75% వరకు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఇప్పుడు వస్తున్న ఈ కొత్త రకం వ్యాధి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రపంచ ఆరోగ్య శాఖ సలహా ఇవ్వడం జరిగింది.