జమ్మూ కాశ్మీర్ లో టెర్రర్ ఫండింగ్ కేసులో ఎన్ఐఏ విస్తృత సోదాలు

టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించి జమ్మూ కశ్మీర్ లో ఎన్ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది. వివిధ నేరాలకు పాల్పడుతున్న వారిని NIA అంతు తేలుస్తోంది. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది.  టెర్రర్ ఫండింగ్ కు సంబంధించి ఇప్పటికే హరియత్ నాయకుడు ఖాజీ యాసిర్, జమ్మూ కాశ్మీర్ సాల్వేషన్ మూమెంట్ అధ్యక్షుడు జాఫర్ భట్ ల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సోదాల్లో దొరికిన ఆధారాల ప్రకారం కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా సోదాలు చేసి, వారిని అరెస్టు చేసింది […]

Share:

టెర్రర్ ఫండింగ్ కేసుకు సంబంధించి జమ్మూ కశ్మీర్ లో ఎన్ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది.

వివిధ నేరాలకు పాల్పడుతున్న వారిని NIA అంతు తేలుస్తోంది. అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తోంది.  టెర్రర్ ఫండింగ్ కు సంబంధించి ఇప్పటికే హరియత్ నాయకుడు ఖాజీ యాసిర్, జమ్మూ కాశ్మీర్ సాల్వేషన్ మూమెంట్ అధ్యక్షుడు జాఫర్ భట్ ల ఇళ్లపై దాడులు చేసింది. ఈ సోదాల్లో దొరికిన ఆధారాల ప్రకారం కర్ణాటక, మహారాష్ట్రలలో కూడా సోదాలు చేసి, వారిని అరెస్టు చేసింది ఎన్ఐఏ.

అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. జమ్మూ కాశ్మీర్ లోని రౌజరిలో ఉన్న అల్ హుదా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క అనుమానాస్పద కార్యకలాపాలకు సంబంధించిన కేసులో.. ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు జరుపుతోంది. ఈ కేసులో జమ్మూ, పుల్వామా, శ్రీనగర్, బుద్, గాం పోషియన్, రాజౌరీ,  పూంచ్ జిల్లాలలోని పలు ప్రాంతాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిర్దిష్టమైన సమాచారంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏకకాలంలో దర్యాప్తు సంస్థకు చెందిన అధికారులు అనేక బృందాలుగా ఏర్పడి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని ఏడు ప్రాంతాలలో జరుగుతున్న ఈ సోదాల్లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ పోలీసుల సమన్వయంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

పోషియన్ జిల్లాలోని వాచీ ప్రాంతంలో ఎన్ఐఏ బృందం 

పోషియాన్ జిల్లాలోని వాచీ ప్రాంతంలో దాడి చేస్తుంది. దీనితో పాటు పుల్వామా జిల్లాలోని నేహ్మా, లీట్టార్, కూల్గామ్ జిల్లాలోని ప్రజల ప్రాంతంలో దాడులు కొనసాగుతున్నాయి. ఆనంద్ నాగ్ లోని అచావల్ జిల్లాకు కూడా ఈ బృందం చేరుకొని అక్కడ కూడా తనిఖీలు చేస్తోంది. ఆసియా ఆంధ్రాబీ ఇంట్లో కూడా సోదాలు చేసింది. శ్రీనగర్ లోని మహిళ వేర్పాటువాది ఆసియా ఆంధ్రాబి ఇంట్లో కూడా సోదాలు చేయగా.. ప్రస్తుతం ఆమె ఆసియా జైల్లో ఉంది. కేరళ మాడ్యూల్ కేసులో శ్రీనగర్ ఎన్ఐఏ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. అధికారులు తనిఖీ సమయంలో డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్ లోని కర్పాలి మోహల్లలో ఉజైర్ అజర్ బట్ అనే వ్యక్తి ఇంటిపై దాడి జరిగింది. ఈ కుట్రలో భట్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

గజ్వా ఈ హింద్

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మూడు రాష్ట్రాలలోని ఏడు ప్రాంతాలలో సోదాలు చేపట్టింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని గజ్వా ఈ హింద్ కేసులో గురువారం కేంద్ర సంస్థ తనిఖీలు నిర్వహించింది. ఈ సంస్థ యువతను తప్పుదోవ పట్టించి, ఉగ్రవాదం వైపు దృష్టిని మళ్లిస్తుందని ఆరోపణలతో సోదాలు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశ వ్యతిరేక చర్యలు, యువతను సామాజిక మాధ్యమాల ద్వారా విద్రోహ చర్యలకు ప్రేరేపిస్తున్న అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. గజ్వా ఈ హింద్ పేరుతో సోషల్ మీడియాలో గ్రూప్ క్రియేట్ చేసి, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని పలువురిపై ఎన్ఐఏ కేసు నమోదు చేసింది.