AP High Court : ఇద్దరు ఏపీ ఐఏఎస్ (AP IAS) అధికారులకు హైకోర్టు (High Court) నెల రోజుల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ పాల్పడినందుకు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది.
కోర్టు ధిక్కరణకు (Contempt of Court) పాల్పడ్డారని ఇద్దరు ఐఏఎస్లకు (IAS) నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ ఏపీ హైకోర్టు (AP High Court) కీలక తీర్పు ఇచ్చింది. ఐఏఎస్ (IAS) అధికారులు జె. శ్యామలరావు(J. Shyama Rao), పోలా భాస్కర్కు (Pola Bhaskar) జైలు శిక్ష (Imprisonment) విధించింది. ఇద్దరు ఐఏఎస్లకు రూ. వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు. నీరు-చెట్టు అంశంపై హైకోర్టు (High Court) ఆదేశాలను ధిక్కరించారని హైకోర్టు (High Court) తేల్చింది. వచ్చే నెల 8 లోపు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ (Registrar Judicial) వద్ద లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
వీటికి చెల్లింపులు చేయకపోవడంతో బాధితులు కోర్టుకు వెళ్లారు. చెల్లించాలని కోర్టు తీర్పు (Court judgment) ఇచ్చినా చెల్లించకపోగా.. ఎంపిక చేసుకున్న కొందరికే మంజూరు చేస్తూ.. మిగిలిన వారి విషయంలో వివక్ష చూపుతోంది. హైకోర్టు(High Court) జోక్యంతో కొంతమందికి ఉపశమనం లభించినా.. ప్రభుత్వం బిల్లులను చెల్లించలేదంటూ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల సంఖ్య వేలల్లో ఉంది. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (National Judicial Data Grid) ప్రకారం.. 2023 అక్టోబర్ 23 వరకూ దేశ వ్యాప్తంగా లక్షా 17 వేల 324 కోర్టు ధిక్కరణ కేసులు హైకోర్టుల్లో పెండింగ్ల్లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా అలహాబాద్ హైకోర్టులో 25 వేల 719 ధిక్కరణ కేసులుంటే.. రెండో స్థానంలో ఉన్న ఏపీ హైకోర్టులో 13 వేల 312 ధిక్కరణ కేసులు ఉన్నాయి. గతంలో కోర్టు ధిక్కరణ కేసుల్లో (Case of Contempt of Court) పలువురు ఐఏఎస్లకు (IAS) ఇలాగే శిక్షలు పడ్డాయి. అయితే డివిజన్ బెంచ్ కు వెళ్లి ఎలాగోలా బయటపడ్డారు. శిక్షలు పడిన తర్వాత కోర్టు ఉత్తర్వులు అమలు చేసి బయపడ్డారు. ఇప్పుడు కూడా అదే చేస్తారా లేకపోతే.. జైలుకు వెళ్తారా అన్నది చూాడాల్సి ఉంది.
ఏపీ హైకోర్టులో రెండో కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (Chief Minister YS Jaganmohan Reddy) దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం కౌంటర్ దాఖలు చేసింది. నాలుగేళ్ల తర్వాత తనపై ఎయిర్పోర్టులో (Airport) కత్తితో దాడి ఘటనలో కుట్ర జరిగిందని ఆరోపిస్తూ విజయవాడ ఎన్ఐఏ కోర్టులో సీఎం పిటిషన్ వేశారు. ఎన్ఐఏ కోర్టు విచారణ చేపట్టింది కానీ కేసును కొట్టివేసింది.
తాజాగా సీఎం హైకోర్టులో(High Court) మరో పిటిషన్ వేశారు. సీఎం పిటిషన్‌పై కౌంటర్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మంగళవారం ఎన్ఐఏ దాఖలు చేసింది. విమానాశ్రయంలో నిందితుల ప్రవర్తనపై ఎన్ఐఏ సమగ్ర వివరణ ఇచ్చింది. నిందితుడు శ్రీను (Srinu) జగన్ వద్దకు వచ్చి వైఎస్ఆర్సీ 160 సీట్లు గెలుస్తుందని చెప్పి దాడికి పాల్పడ్డాడని ఎన్ఐఏ పేర్కొంది. ఈ కేసులో సాధారణ దర్యాప్తు కొనసాగుతుందని, లోతైన దర్యాప్తు పూర్తయినందున తదుపరి దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ (NIA) తెలిపింది.