శ్వేత మృతి కేసులో మరో బిగ్ ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ లో గర్బవతి శ్వేత అనుమానస్పదపు మృతి కేసు పెను సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో సూసైడ్ లేటర్ దొరికింది. మెుదటగా ఈ కేసులో శ్వేత అత్తామామలను అనుమానించారు. దీంతో అత్తమామల వేధింపులపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా  ఇప్పుడు మరో ఘోరమైన వార్త వెలుగులోకి వచ్చింది.. శ్వేతకు వరసకు అన్నయ్య అయిన వ్యక్తే గర్భిణి శ్వేతను లైంగికంగా వేధించినట్టు తెలిసింది. శ్వేత భర్త మణికంఠ చెల్లెలి భర్త అయిన సత్యం.. ఈ […]

Share:

ఆంధ్రప్రదేశ్ లో గర్బవతి శ్వేత అనుమానస్పదపు మృతి కేసు పెను సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో సూసైడ్ లేటర్ దొరికింది. మెుదటగా ఈ కేసులో శ్వేత అత్తామామలను అనుమానించారు. దీంతో అత్తమామల వేధింపులపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా  ఇప్పుడు మరో ఘోరమైన వార్త వెలుగులోకి వచ్చింది.. శ్వేతకు వరసకు అన్నయ్య అయిన వ్యక్తే గర్భిణి శ్వేతను లైంగికంగా వేధించినట్టు తెలిసింది. శ్వేత భర్త మణికంఠ చెల్లెలి భర్త అయిన సత్యం.. ఈ వేధింపులకు పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా గర్భిణి శ్వేత తల్లిదండ్రుల ఫిర్యాదుతో సత్యంపై లైంగిక వేధింపుల కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టుతో పాటు గర్భిణి శ్వేత మెుబైల్ ఫోన్ ఆధారాల కోసం కీలకంగా మారింది. కాగా మొబైల్ స్క్రీన్ లాక్ ఓపెన్ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే ఈ కేసులో పలు అనుమానాలు చోటు చేసుకున్న ఈ కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాగా ఇంకా ఈ డెత్ మిస్టరీ వీడాల్సి ఉంది. శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 25న రాత్రి గర్భిణి శ్వేత ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అటు ఈ నెల 26న ఉదయం వైఎంసీఏ బీచ్ లో అనుమానాస్పద స్థితిలో శ్వేత విగతజీవిగా కనిపించింది. కాగా బీచ్ లో మృతదేహం కనిపించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విచారణలో సంచలన విషాయాలు వెలుగులోకి వస్తుండడంతో మరిన్ని అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

శ్వేత.. గర్భిణి అని చూడకుండా అత్తమామలు, భర్తతో పాటు మణికంఠ చెల్లెలి భర్త సత్యం కూడా శ్వేతను వేధించినట్లు శ్వేత తల్లి పోలీసుల ముందు ఆరోపించారు. పెళ్లైన నాటి నుంచి శ్వేతకు టార్చర్ మొదలైందన్నారు. అత్తమామలు, భర్త వేధింపులకు తోడు మణికంఠ చెల్లెలి భర్త సత్యం కూడా శ్వేతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నారు. దాంతో శ్వేత చాలా కుంగిపోయిందన్నారు. దీని గురించి శ్వేత తన భర్తతో చెప్పినా అతడు పట్టించుకోలేదన్నారు.. అంతేకాదు.. తప్పు చేసింది చెల్లెలి భర్త అయినా.. తన కూతురితోనే క్షమాపణలు చెప్పించారని శ్వేత తల్లి ఆవేదన వెల్లుబుచ్చుకుంది.. పెళ్లైన 6 నెలలకు టార్చర్ మరింత ఎక్కువైందన్నారు. అదేవిధంగా శ్వేత పేరుమీదున్న స్థలాన్ని తమ పేరు మీదకు రాయాలని శ్వేత అత్తామామలు ఒత్తిడి తెచ్చారన్నారు. భర్తతో కలిసి ప్రశాంతంగా ఉండేందుకు వీలు లేకుండా చేశారన్నారు. శ్వేత భర్తను తన కూతురి నుంచి విడదీశారని శ్వేత తల్లి రమాదేవి కన్నీంటి పర్యంతం అయ్యారు.

శ్వేతది ఆత్మహత్య కాదు అనడానికి చాలా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే వైజాగ్ బీచ్‌లో దూకి చనిపోతే సుమారు 24గంటల వరకు డెడ్ బాడీ దొరికే అవకాశాలు తక్కువ గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక శ్వేత శరీరంపై కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. అందులోనూ.. మృతదేహం ఇసుకలో కూరుకుపోయి ఉంది. దాంతో అనుమానాలు రెట్టింపు అయ్యాయి. పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. కేజీహెచ్ లో శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా ఈ కేసులో శ్వేత యెక్క పోస్టుమార్టం రిపోర్టు చాలా కీలకంగా మారింది. ఆ రిపోర్టు ఆధారంగా శ్వేతది హత్యా? ఆత్మహత్యా? అనేది పోలీసులు తేల్చేయనున్నారు. కాగా పోస్టుమార్టం నివేదికలు రావడానికి నెల రోజులు సమయం పట్టనుందని వైద్యులు తెలిపారు.