TTD ప్రకటించిన కొత్త ధర్మకర్తలు వీరే

కొద్ది రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో అలిపిరి మెట్ల మార్గంలో ఓ చిన్నారిని చిరుత చంపిన ఘటన దగ్గరి నుంచి TTD తెగ ట్రోల్ అవుతోంది. అంతకు ముందు తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని టీటీడీ ఒక హోమం చేపట్టింది. ఆ హోమం చేసిన తర్వాత ప్రమాదాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. హమ్మయ్యా అని టీటీడీ రిలాక్స్ అయ్యే లోపే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం టీటీడీని ఉక్కిరి […]

Share:

కొద్ది రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తరచూ వార్తల్లో నిలుస్తోంది. అప్పట్లో అలిపిరి మెట్ల మార్గంలో ఓ చిన్నారిని చిరుత చంపిన ఘటన దగ్గరి నుంచి TTD తెగ ట్రోల్ అవుతోంది. అంతకు ముందు తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని టీటీడీ ఒక హోమం చేపట్టింది. ఆ హోమం చేసిన తర్వాత ప్రమాదాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. హమ్మయ్యా అని టీటీడీ రిలాక్స్ అయ్యే లోపే అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం టీటీడీని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఓ చిన్నారిని చనిపోవడంతో అందరి ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. దీంతో టీటీడీ చేసిన నష్ట నివారణ చర్యలు మరింత ట్రోలింగ్ కు గురయ్యాయి. ట్రోలింగ్ పై స్పందించని బోర్డు తాము అనుకున్నది చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదరింది.

కర్రల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేఖత

ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నపుడు దానిని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేఖించడం కామన్. అటువంటి విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పాటు సామాన్య భక్తులు కూడా ట్రోల్ చేస్తున్నారు. చిరుతలు సంచరిస్తున్న నేపథ్యంలో కాలినడకన వెళ్లే భక్తులకు కర్రలు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయమే అందరి ఆగ్రహావేశాలకు కారణం అయింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు భక్తులు తీవ్రంగా వ్యతిరేఖించారు. సామాన్యంగా వ్యతిరేఖించడం మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఈ నిర్ణయాన్ని ట్రోల్ చేశారు. కొద్ది రోజుల పాటు ఈ సోషల్ మీడియా ట్రోల్స్ తో టీటీడీ పరువు ఘోరంగా పోయిందని కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఎవరెన్ని రకాలుగా ట్రోల్  చేసినా కానీ టీటీడీ మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను అనుకున్న నిర్ణయాన్నే అమలు చేసింది. ప్రస్తుతం నడకదారిలో శ్రీ వారి సన్నిధికి వెళ్లే భక్తులకు కర్రలు ఇస్తున్నారు. 

కొత్త ధర్మకర్తలను ప్రకటించిన బోర్డు

టీటీడీకి మొన్నే కొత్త చైర్మన్ నియామకం అయ్యారు. ఇన్నాళ్లూ చైర్మన్ గా విధులు నిర్వర్తించిన వైవీ సుబ్బారెడ్డి స్థానంలో కొత్తగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా నియామకం అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి స్వయాన చిన్నాన్న అవుతారు. అందువల్ల అతడిని తప్పించరని అంతా అనుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అతడే పదవిలో కొనసాగుతాడని ఊహించారు. కానీ ఎవరి ఊహలకు అందని విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. టీటీడీ చైర్మన్ ను మార్చేశారు. ఈ నిర్ణయం మీద కూడా అనేక మంది అభ్యంతరాలు తెలిపారు. కొత్త చైర్మన్ కరుణాకర్ రెడ్డి అన్యమతస్తుడని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. అయినా కానీ సీఎం మాత్రం తాను అనుకున్న దానికే కట్టుబడి ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా పగ్గాలు చేపట్టగానే కొత్త ధర్మకర్తలను ప్రకటించారు. మొత్తం 24 మంది కొత్త సభ్యులను ధర్మకర్తలుగా నియమించింది. ఇందులో వేరే రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కొంత మంది మీద కేసులు ఉండడంతో పలువురు వీరి నియామకాన్ని వ్యతిరేఖించారు. అయినా కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసి చూపెట్టింది. ఈ 24 మంది కొత్త వారిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు.   

ముగ్గురు YCP ఎమ్మెల్యేలు

సీఎంవో కొత్తగా ప్రకటించిన ధర్మకర్తల జాబితాలో ముగ్గురు అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), పొన్నాడ వెంకట సతీష్ కుమార్ (ముమ్మిడివరం) మరియు M. తిప్పే స్వామి (మడకశిర) ఉండగా… కొంత మంది పరాయి రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అంతే కాకుండా వేరే ప్రాంతాలకు చెందినవారు కూడా ఉన్నారు. ఇక ఏపీ నుంచి నియమితులైన వారిలో గాదిరాజు వెంకట సుబ్బరాజు (ఉంగుటూరు), మేకా శేషుబాబు (పాలకొల్లు), నెరుసు నాగ సత్యం యాదవ్ (ఏలూరు), సిద్ధ వీర వెంకట సుధీర్ కుమార్ (ప్రకాశం) (మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కుమారుడు), సిద్దవటం యానాదయ్య, మాసిమా బాబు (కడప), సీతారామి రెడ్డి ఎల్లారెడ్డి (మంత్రాలయం), చందే అశ్వర్థ నాయక్ (అనంతపురం) ఉన్నారు. దీంతో కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక ఏపీ పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచి ట్రస్టీలుగా డాక్టర్ S. శంకర్, కృష్ణమూర్తి వైద్యనాథన్.. అలాగే కర్ణాటక నుంచి RV దేశ్‌పాండే.. తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి భార్య గడ్డం సీతా రంజిత్ రెడ్డి, అరబిందో ఫార్మా గ్రూప్ కు చెందిన పెనక శరత్ చంద్రారెడ్డి లు ఎంపికయ్యారు. 

వీరి మీదే కేసులు

ఇక మహారాష్ట్ర నుంచి టీటీడీ ధర్మకర్తలుగా సౌరభ్ బోరా, అమోల్ కాలే, మిలింద్ సావర్కర్ ఎంపికయ్యారు. టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన వారిలో రామ్ రెడ్డి సాముల, డాక్టర్ కేతన్ దేశాయ్ (మాజీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్), బాలసుబ్రమణ్యం పళనిసామి, ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డి మరియు సుదర్శన్ వేణు ఉన్నారు. ఇక వీరిలో కొంత మంది మీద కేసులు ఉండడంతో పలువురు ఈ లిస్టు మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెనక శరత్ చంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఇతడి పేరు కూడా ఉండడంతో అంతా విమర్శిస్తున్నారు. అలాగే ఎంసీఐ చీఫ్‌గా డాక్టర్ దేశాయ్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.