ఎంఏ చిదంబరం స్టేడియంలో కొత్త స్టాండ్‌ ఏర్పాటు

ఆస్టాండుకు మాజీ సీఎం పేరు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పేరు మార్చి 22న ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డే కోసం ప్రేక్షకులకు తెరవబడుతుంది; కొత్తగా కనిపించే అన్నా పెవిలియన్‌లో అత్యాధునిక ఇన్ డోర్ శిక్షణా సౌకర్యం ఉంటుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో అన్నా పెవిలియన్‌ను ఏర్పాటు చేసే కొత్త స్టాండ్‌కు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పేరు పెట్టబోతున్నట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. కొత్తగా కనిపించే అన్నా పెవిలియన్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో […]

Share:

ఆస్టాండుకు మాజీ సీఎం పేరు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పేరు

మార్చి 22న ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డే కోసం ప్రేక్షకులకు తెరవబడుతుంది; కొత్తగా కనిపించే అన్నా పెవిలియన్‌లో అత్యాధునిక ఇన్ డోర్ శిక్షణా సౌకర్యం ఉంటుంది.

ఎంఏ చిదంబరం స్టేడియంలో అన్నా పెవిలియన్‌ను ఏర్పాటు చేసే కొత్త స్టాండ్‌కు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి పేరు పెట్టబోతున్నట్లు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. కొత్తగా కనిపించే అన్నా పెవిలియన్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యాధునిక ఇన్ డోర్ శిక్షణా సౌకర్యం ఉంటుంది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మార్చి 17న తన తండ్రి అయిన ఎం కరుణానిధి.. 1969 నుండి 2011 మధ్య ఐదుసార్లు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా.. ఆయన పేరు మీద ఈ కొత్త స్టాండ్‌ను ప్రారంభించనున్నారు. ఈ మార్చి 22 నాటికి కొత్త మద్రాస్ క్రికెట్ క్లబ్ స్టాండ్ కూడా సిద్ధంగా ఉంటుందని సమాచారం.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా హాజరుకానున్నారు.

భారతదేశంలో అత్యంత పురాతనమైన స్టేడియంలలో ఈడెన్ గార్డెన్స్ మొదటిదైతే, ఎంఏ చిదంబరం స్టేడియం రెండవది. 2023 లో జరగబోయే 50 ఓవర్ల ప్రపంచ కప్‌కు సిద్ధమయ్యేలా దీని పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. అయితే, మార్చి 22న భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే మూడవది, చివరిది అయిన వన్డే కోసం ఈ కొత్త స్టాండ్‌లతో ముస్తాబు చేశారు. 

ఈ స్టాండ్‌లలో దేనికీ ఒక మాజీ క్రికెట్ ఆటగాడి పేరు గానీ, అడ్మినిస్ట్రేటర్ పేరు గానీ, లేదా రాజకీయ నాయకుడి పేరు గానీ పెట్టడానికి అనుమతించలేదు. అయినా ఐదుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించి, 2018లో మరణించిన ఎం కరుణానిధి గౌరవార్థం.. ఆయన పేరు పెట్టడానికి తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మినహాయింపునిచ్చింది. తన రాజకీయ జీవితంలో కరుణానిధి ఓటమి లేని నేత.  చివరిగా ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్నికలలో చెపాక్ నియోజకవర్గం నుండి గెలుపొంది ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు.

ఇదే స్టేడియంలో డీఎంకే మాజీ నేత, సీఎం సీఎన్ అన్నాదురై పేరిట ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను కరుణానిధి ప్రారంభించారు. పెవిలియన్ స్టాండ్‌లను నిర్మించాలని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించినప్పటి నుండి, దీనికి కరుణానిధి పేరు పెట్టే ఆలోచనలోనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా, వరుసగా వచ్చిన డిఎంకే ప్రభుత్వాలతో అసోసియేషన్ కి సన్నిహిత సంబంధం ఉంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ పి. అశోక్ సిగమణి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కే. పొన్ముడి కుమారుడు.

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ చరిత్రను తెలిపే మ్యూజియం కూడా రాబోతోంది. రెండు కొత్త స్టాండ్‌లతో రాబోయే ఈ స్టేడియం.. సామర్థ్యం దాదాపు 38,000 వరకు ఉంటుందని అంచనా.

కాగా, మార్చి 22న భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న మూడో వన్డేకు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతాయని టీఎన్‌సీఏ ప్రకటించింది. టిక్కెట్‌లను మార్చి 13 నుండి PAYTM, http://www.insider.in ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. లోయర్ స్టాండ్‌ I లో వీల్‌చైర్‌లను ఉపయోగించే అభిమానుల కోసం కూడా సీట్లు ఉంటాయి.