ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి కొత్త క్రిమినల్‌ చట్టాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను ఈ ఏడాది చివరి నాటికి దేశంలో అమలయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్రిటీష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌‌పీసీ)లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో మూడు బిల్లులను ఆగస్టు 11న ప్రవేశపెట్టారు. వీటి ద్వారా నిర్దిష్ట సమయపాలనతో విచారణలను వేగవంతం […]

Share:

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలను ఈ ఏడాది చివరి నాటికి దేశంలో అమలయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్రిటీష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ), ఇండియన్‌ ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌‌పీసీ)లను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా లోక్‌సభలో మూడు బిల్లులను ఆగస్టు 11న ప్రవేశపెట్టారు. వీటి ద్వారా నిర్దిష్ట సమయపాలనతో విచారణలను వేగవంతం చేయడం, సాక్ష్యాల నాణ్యతను మెరుగుపర్చడం, దాని సమగ్రతను కాపాడటం, బాధితులకు ఉపశమనం, రక్షణ కల్పించడం ద్వారా నేరారోపణ రేటును పెంచడం వంటి లక్ష్యంతో ఈ మూడు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

మూడు కొత్త బిల్లులు ఏంటి?

1. భారతీయ న్యాయ సంహిత బిల్లు

2. భారతీయ నాగ్రిక్ సురక్షా సంహిత బిల్లు

3. భారతీయ సాక్ష్యా బిల్లు

ఈ మూడు బిల్లులను పరిశీలించేందుకు రాజ్యసభ చైర్మన్ జగదీప్‌ ధన్‌కర్‌‌ కేంద్ర హోం వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీకి పంపారు. దీనికి సంబంధించి నివేదికను మూడు నెలల్లోగా సమర్పించాలని కోరారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమై డిసెంబర్‌‌లో ముగుస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లులపై చర్చించి పార్లమెంట్‌లో ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

బ్రిజ్‌ లాల్‌ నేతృత్వంలో కమిటీ..

బిల్లులపై చర్చించేందుకు ఆగస్టు 24న స్టాండింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బిల్లుల ఆమోద ప్రక్రియ వేగవంతం చేయడానికి తరచుగా సమావేశాలు జరుగుతాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. రోజువారీ సమావేశాలను కూడా తర్వాత వెల్లడించే అవకాశం ఉందని తెలిపాయి. ఈ కమిటీకి బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, మాజీ పోలీసు అధికారి బ్రిజ్‌లాల్‌ నేతృత్వం వహించనున్నారు. బ్రిజ్‌ లాల్‌ 2011–12  మధ్య ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌ చీఫ్‌గా పనిచేశారు.

కొత్త బిల్లుల గురించి…

భారతీయ న్యాయ్‌ సంహిత బిల్లు, 2023.. ఇది ఐపీసీ 1860 స్థానంలో రానుంది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) అనేది 1833 చార్టర్‌‌ చట్టం ప్రకారం1834లో స్థాపించిన మొదటి లా కమిషన్ నేపథ్యంలో 1860లో రూపొందిచిన భారతదేశ అధికారిక క్రిమినల్ కోడ్.

భారతీయ నాగ్రిక్‌ సురక్షా సంహిత బిల్లు, 2023.. సీఆర్‌‌పీసీ1898ని స్థానంలో రానుంది. క్రిమినల్‌ ప్రొసిజర్‌‌ కోడ్‌ (సీఆర్‌‌పీసీ) భారతదేశంలో క్రిమినల్‌ చట్టాన్ని నిర్వహించడానికి విధానాలను అందిస్తుంది. ఇది 1973లో అమల్లోకి వచ్చింది. 

భారతీయ సాక్ష్యా బిల్లు, 2023.. ఇది ఎడిడెన్స్ యాక్ట్‌ 1872 స్థానంలోకి రానుంది. బ్రిటీష్‌ కాలంలో 1872లో భారతదేశంలో ఆమోదించిన ఇండియన్‌ ఎడిడెన్స్‌ యాక్ట్‌. భారతీయ న్యాయవ్యవస్థలో సాక్ష్యాల ఆమోదాన్ని నియంత్రించడం

కొత్త చట్టాలు ఎందుకు?

పాత చట్టాలు బ్రిటీష్‌ వలస పాలన అవశేషాలు, భారతీయ న్యాయ వ్యవస్థపై వారి నియంత్రణను కొనసాగించడానికి రూపొందించబడ్డాయి. పాత చట్టాలు పౌరులకు న్యాయం జరిగేలా చూడటం కంటే శిక్షలపైనే ఎక్కువ ఫోకస్‌ ఉన్నాయి. 19 శతాబ్దంలో అమలు చేసిన చట్టాలు ఆధునిక సామాజిక నిబంధనలు, సాంకేతికత లేదా న్యాయ అవసరాలకు అనుగుణంగా లేవు. కాలం చెల్లిన చట్టాలు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశాయి. పాత చట్టాలు మహిళలు, పిల్లలపై నేరాలను తగినంతగా పరిష్కరించలేదు. పాత చట్టాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే నిబంధనలు లేవు. సమర్థవంతమైన దర్యాప్తు, సాక్ష్యాధారాల ప్రదర్శనకు పాత చట్టాలతో ఆటంకం ఏర్పడింది. సైబర్ నేరాలు, టెర్రరిజం, వ్యవస్థీకృత నేరాల వంటి సమకాలీన సమస్యలను పరిష్కరించడంలో చట్టాలు విఫలమయ్యాయి.