ఏప్రిల్ 1 నుంచి ఆరు మార్పులు.. కొత్త ట్యాక్స్ సిస్టం లో బోలెడు మినహాయింపులు..

కొత్త ఆర్థిక సంవత్సరం (FY 22-23) ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ తేదీ అనేక విధాలుగా ముఖ్యమైనది. ఈ రోజు నుండి అనేక కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పన్నుల విధానంలో అనేక మార్పులు వచ్చాయి. బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలకు సంబంధించిన అనేక ఉద్యోగాలు మారుతున్నాయి. 2022-23 కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను సంబంధిత చట్టాలు అమల్లోకి వస్తాయి. పన్నుల వ్యవస్థను మరింత సులువుగా, వేగంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త  ట్యాక్స్ సిస్టంను అందుబాటులోకి […]

Share:

కొత్త ఆర్థిక సంవత్సరం (FY 22-23) ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఈ తేదీ అనేక విధాలుగా ముఖ్యమైనది. ఈ రోజు నుండి అనేక కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పన్నుల విధానంలో అనేక మార్పులు వచ్చాయి. బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలకు సంబంధించిన అనేక ఉద్యోగాలు మారుతున్నాయి. 2022-23 కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను సంబంధిత చట్టాలు అమల్లోకి వస్తాయి.

పన్నుల వ్యవస్థను మరింత సులువుగా, వేగంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త  ట్యాక్స్ సిస్టంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది డిఫాల్ట్ కానుంది అంటే .. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు డిఫాల్ట్ గా కొత్త ట్యాక్స్ సిస్టంను పరిగణలోకి తీసుకుంటారు. పాత సిస్టం కావాలనుకుంటే ట్యాక్స్ పేర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. కొత్త ట్యాక్స్ సిస్టం ఎంచుకునే ముందు.. కొత్త సిస్టం లో ఏ ఏ మినహాయింపులు దొరుకుతున్నాయో తెలుసుకోవటం కీలకం.. కొత్త ట్యాక్స్ సిస్టం లో కూడా ఉద్యోగులు, పెన్షనర్లు కు స్టాండర్డ్ డిడక్షన్ ను ప్రభుత్వం కల్పిస్తోంది.. పాత ట్యాక్స్ సిస్టం లో ఇచ్చే డిడక్షన్లు మినహాయింపులు కొత్త సిస్టంలో లేనప్పటికీ.. 6 టాక్స్ మినహాయింపులను మాత్రం కొత్త సిస్టంలో తీసుకొచ్చింది.. వాటిపై మీరు ఓ లుక్కేయండి.. 

పన్ను స్లాబుల్లో మార్పులు: వార్షిక బడ్జెట్ 2023 24 లో మధ్యతరగతి వర్గాలని టార్గెట్ చేసి కేంద్ర ప్రభుత్వం వరాలకు కురిపించింది. కొత్త పన్ను చట్టాన్ని తీసుకువచ్చింది. గతంలో 6 పన్ను స్లాబ్ లో ఉండగా ఇప్పుడు వాటిని ఐదుగురికి కుదించింది. రూ.  లక్షల వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.  రూ. 3 నుంచి 6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ. 6 నుంచి 9 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను కట్టాల్సి ఉంది.

50వేల స్టాండర్డ్ డిడక్షన్..

కొత్త ట్యాక్స్ సిస్టంలో కూడా 50వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. కొత్త ట్యాక్స్ సిస్టం ఎంచుకున్న ఉద్యోగులు పెన్షనర్లకు ఆటోమేటిక్ గా స్టాండర్డ్ డిడక్షన్ యాడ్ అవుతుంది. అయితే వ్యాపారవేత్తలు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫైల్స్ కి స్టాండర్డ్ డిడక్షన్ ను పొందలేరు. కొత్త ట్యాక్స్ సిస్టం ఎంచుకునే ప్రతి ఉద్యోగి 50 వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చని బడ్జెట్ మీటింగ్ లో తెలిపారు. వార్షిక ఆదాయం 15 లక్షలు కంటే ఎక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ డిడక్షన్ లభిస్తుంది.

ఈపీఎఫ్ విత్ డ్రా టిడిఎస్:

ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 193 కింద ఉన్న లిస్టెడ్ డిబెంచర్స్ వడ్డీ చెల్లింపులపై టిడిఎస్ నుంచి పన్ను మినహాయింపులను తొలగించాలని తెలిపారు. టిడిఎస్ నుంచి మినహాయింపు అందుతుంది. నాన్ పాన్ కేసుల్లో టీడీఎస్ రేటును 30 నుంచి 20 శాతానికి తగ్గించారు.

రిబేట్ లో మార్పు

గతంలో రిబేట్ ఐదు లక్షలు గా ఉండేది. కానీ కొత్త ట్యాక్స్ విధానంలో రెజీమ్ లో పన్ను మినహాయింపు పరిమితిని ఏడు లక్షలకు పెంచారు. ఏడు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులు ట్యాక్స్ పే చేయనక్కర్లేదు. సెక్షన్ 87 ఏ ప్రకారం రిబేట్ పొందవచ్చు. 

సెక్షన్ 155:

సెక్షన్ 155లో కీలక సవరణలు చేసింది. ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ టిడిఎస్ లో వస్తున్న పన్నులను పరిష్కరించడానికి ఇలా చేశారు.

జీవిత బీమా పాలసీ:

ఏప్రిల్ ఒకటి 2023 తర్వాత తీసుకునే పాలసీల వార్షిక ప్రీమియం కనుక ఐదు లక్షలు దాటితే వాటికి పన్ను మినహాయింపులు లభించవు.