NEET PG కౌన్సిలింగ్ 2023 షెడ్యూల్

NEET PG 2023 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను MCC అధికారిక వెబ్సైట్ mcc.nic. in లో విడుదల చేసింది. మీ సూచన కోసం పూర్తి రౌండ్ వారి షెడ్యూల్ పిడిఎఫ్ ఇక్కడ అందించబడింది. షెడ్యూల్ ప్రకారం రౌండ్ 1 నీట్ పీజీ కౌన్సిలింగ్ 2023 రిజిస్ట్రేషన్ జూలై 27, 2023 నుండి ప్రారంభమవుతుంది . MCC NEEET PG కౌన్సెలింగ్ 2023 ఆల్ ఇండియా కోటా,సెంట్రల్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ యొక్క, MD/MS PG డిప్లమా / […]

Share:

NEET PG 2023 కౌన్సిలింగ్ షెడ్యూల్ ను MCC అధికారిక వెబ్సైట్ mcc.nic. in లో విడుదల చేసింది. మీ సూచన కోసం పూర్తి రౌండ్ వారి షెడ్యూల్ పిడిఎఫ్ ఇక్కడ అందించబడింది. షెడ్యూల్ ప్రకారం రౌండ్ 1 నీట్ పీజీ కౌన్సిలింగ్ 2023 రిజిస్ట్రేషన్ జూలై 27, 2023 నుండి ప్రారంభమవుతుంది . MCC NEEET PG కౌన్సెలింగ్ 2023 ఆల్ ఇండియా కోటా,సెంట్రల్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ యొక్క, MD/MS PG డిప్లమా / PG DNB సీట్లలో అడ్మిషన్ కోసం నిర్వహించబడుతుంది. పీడబ్ల్యూడి  అభ్యర్థులు తమ వైకల్య ధ్రువీకరణ పత్రాలను నియమించబడిన వైకల్య కేంద్రాల నుంచి జారీ చేయడానికి MCC పోర్టులోను తెరిచింది.

NEET PG 2023 కౌన్సిలింగ్ నాలుగు రౌండ్లలో షెడ్యూల్ చేయబడింది. రౌండ్ 1,  రౌండ్ 2, మాప్ అప్ రౌండ్, శ్రేయ వేకెన్సీ రౌండ్, NEET PG కౌన్సిలింగ్ ప్రక్రియలు రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫీల్డింగ్, లాకింగ్, సీట్ అలాట్మెంట్ ఫలితం, రిపోర్టింగ్ ఉంటాయి. NEET PG 2023 అర్హత పొందిన అభ్యర్థులు మాత్రమే నీట్ పీజీ కౌన్సిలింగ్ 2023 కోసం నమోదు చేసుకోగలరు.MCC NEET PG కౌన్సిలింగ్ 2023 కోసం నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్  mcc. nic. in. లో లాగిన్ చేయాలి. చాయిస్ ఫీల్డింగ్,లాకింగ్ కోసం, కాలేజీ వారిగా NEET PG 2023 మ్యాట్రిక్స్  MCC ద్వారా విడుదల చేయబడింది.

NBE రూపొందించిన నీట్ పీజీ 2023  AiQ మెరిట్ జాబితా ఆధారంగా MCC అన్ని రాష్ట్రాలు, ESIC కళాశాలలో 50%  AIO సీట్లకు, సెంట్రల్ మరియు డీమ్డ్  విశ్వవిద్యాలయాలు 100 శాతం సీట్లకు నీట్ పీజీ కౌన్సిలింగ్ నిర్వహించింది.  50 శాతం స్టేట్ కోటా సీట్లు మరియు ప్రైవేటు కాలేజీల్లో 100% సీట్ల కోసం, సంబంధిత రాష్ట్ర అధికారులు ప్రత్యేక కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు.

1) కేరళ నీట్ పీజీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ జూలై 20 వరకు కొనసాగించబడుతుంది.

2) తమిళనాడు నీట్ పీజీ 2023 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జూలై 17 వరకు కొనసాగించబడుతుంది.

3) తెలంగాణ నీట్ పీజీ 2023 కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.

4)త్రిపుర నీట్ పీజీ మెరిట్ జాబితా 2023 విడుదల చేయబడింది.

5) గుజరాత్ నీట్ పీజీ కౌన్సిలింగ్ 2023 ప్రారంభమవుతుంది.

MCC కళాశాలల వారీగా సీట్ల లభ్యత మరియు అభ్యర్థులు పూరించిన ఎంపికల ఆధారంగా నీట్ పీజీ సీట్ల కేటాయింపు ఫలితం పిడిఎఫ్ ని విడుదల చేస్తుంది. నీట్ పీజీ 2023 సీట్ల కేటాయింపు ఫలితం. అభ్యర్థి పేరు, రోల్ నెంబర్, ర్యాంక్, కేటాయించిన కోట మరియు వర్గం, కేటాయించిన ఇన్స్టిట్యూట్, కోర్సును పేర్కొంటుంది.

** నీట్ పీజీ కౌన్సిలింగ్ 2023 : అర్హత

 నీట్ పీజీ 2023 కౌన్సిలింగ్లో పాల్గొనడానికి, అభ్యర్థులు ఎన్సిసి అందించిన క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కంటే ఎక్కువ లేదా సమానంగా స్కోర్ చేయాలి. నీట్ పీజీ 2023 ఫలితాలలో పాటు ఈ సంవత్సరం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కూడా విడుదల చేయబడింది.

 ** నీట్ పీజీ 2023 రిజిస్ట్రేషన్ ప్రమాణాలు :

 అభ్యర్థులు సవరించిన 50% ఆల్ ఇండియా కోటా సీట్ల రిజర్వేషన్ కలిగి ఉండాలి.

**  నీట్ పీజీ 2023 కౌన్సిలింగ్ తర్వాత ప్రవేశం :

 నీట్ పీజీ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు కింది విశ్వవిద్యాలయాలు లేదా కళాశాలలో ప్రవేశానికి అర్హులు అవుతారు.

1) 50 శాతం AIO సీట్లు.

2) సెంట్రల్ యూనివర్సిటీలో 100% సీట్లు.

3) AFMS సంస్థలు.

4) డీమ్డ్ యూనివర్సిటీలో 100% సీట్లు.

5) ప్రభుత్వ వైద కళాశాలలో రాష్ట్ర కోట సీట్లు.

6) రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య సంస్థలలో రాష్ట్ర కోట సీట్లు.

** నీట్ పీజీ 2023 కౌన్సిలింగ్ ప్రక్రియ  :

 పైన పేర్కొన్న విధంగా నీట్ పీజీ 2023 యొక్క కౌన్సిలింగ్ ఆన్లైన్ లో నిర్వహించబడుతుంది.ప్రక్రియ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లతో ప్రారంభమవుతుంది. ఇన్స్టిట్యూట్ కి అన్ని పత్రాలను నివేదించడంతో ముగిస్తుంది.