వేడిని తట్టుకునే శక్తిని పెంపొందించేల వ్యవసాయ విధానాలను మార్చాలి

గోధుమ పంట దాదాపు ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులకు గురవుతుంది. అందువల్ల.. పంట రకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం అవసరం. మెరుగైన పద్ధతులతో పూర్తి స్థాయిలో పంట దిగుమతి పొందేందుకు, రైతులకు కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను, వివిధ వ్యవసాయ పద్ధతులు, రాబోయే వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. రెండో ప్రధాన పంట.. గోధుమలు బియ్యం తర్వాత గోధుమలే  భారతీయుల ప్రధాన ఆహారం. పంజాబ్‌లో ఇది అత్యంత ముఖ్యమైన రబీ […]

Share:

గోధుమ పంట దాదాపు ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులకు గురవుతుంది. అందువల్ల.. పంట రకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం అవసరం. మెరుగైన పద్ధతులతో పూర్తి స్థాయిలో పంట దిగుమతి పొందేందుకు, రైతులకు కొత్త ఉత్పత్తులు, సాంకేతికతలను, వివిధ వ్యవసాయ పద్ధతులు, రాబోయే వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.

రెండో ప్రధాన పంట.. గోధుమలు

బియ్యం తర్వాత గోధుమలే  భారతీయుల ప్రధాన ఆహారం. పంజాబ్‌లో ఇది అత్యంత ముఖ్యమైన రబీ పంట. ఆ రాష్ట్ర, ఆర్థిక వ్యవస్థకు, రైతులకు ప్రధాన మూలం. అయితే రబీ సమయంలో మొదట్లో వీచే వేడిగాలుల కారణంగా గోధుమ పంట పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. 2021-22 లోని రబీ సీజన్‌లో, ఉష్ణోగ్రతలు చాలా అసాధారణంగా పెరిగాయి. గోధుమ పంటకు అధిక ఉష్ణోగ్రత ఉండకూడదు. తగిన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఇది ధాన్యంతో సమానంగా పండుతుంది. ఉష్ణోగ్రత  తగినట్లు లేకపోవడం.. గోధుమల నాణ్యతపైన, పొడవు పైన ప్రభావం చూపింది. 10 రోజుల ముందే పంట పండింది. ఇది గోధుమల నాణ్యతను, దిగుబడిని  ప్రతికూలంగా ప్రభావితం చేసింది. ఫలితంగా.. 2020-21లో పంజాబ్ రాష్ట్రంలో గోధుమ దిగుబడి హెక్టారుకు 4,868 కిలోలు ఉండగా, 2021-22 నాటికి అది హెక్టారుకు 4,216 కిలోలకు పడిపోయింది. అలాగే ఉత్పత్తయిన గోధుమ పంట కూడా తక్కువ నాణ్యతను కలిగి ఉంది. అస్థిర వాతావరణం (అధిక ఉష్ణోగ్రతలు) కారణంగా దేశవ్యాప్తంగా గోధుమ దిగుబడి 2020-21లో హెక్టారుకు 3,521 కిలోల నుండి 2021-22లో హెక్టారుకు 3,484 కిలోలకు స్వల్పంగా పడిపోయింది.

ప్రస్తుత రబీ సీజన్‌లో.. ఉష్ణోగ్రతల అసాధారణ పెరుగుదల ముందుగానే ప్రారంభమైంది. 2023లో ఫిబ్రవరి 5 నుండి 11 వరకు గరిష్ఠ, కనిష్ట వారపు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C ఎక్కువగా నమోదయ్యాయి (లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో నమోదయ్యాయి); తరువాతి వారంలో.. గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.3°C ఎక్కువగా నమోదయ్యింది. అయితే ఈ వారంలో ఫిబ్రవరి 20న.. ఉత్తర భారతదేశంలోని చాలా చోట్ల గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా (5.1°C లేదా అంతకంటే ఎక్కువ) నమోదయ్యాయి.

ఈ ముందస్తు వేడిగాలులు.. ఆహార భద్రత పైన చూపే ప్రతికూల ప్రభావాలను, దాని పర్యవసానాలను అంచనా వేస్తూ, పరిస్థితిని పర్యవేక్షించడానికి జాతీయ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి. పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కూడా నిఘా ఉంచింది. పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఇతర వ్యవసాయ పరిశోధనా సంస్థలు.. వేడి ఒత్తిడిని తగ్గించడానికి ఈ సలహాలను జారీ చేస్తున్నాయి

నీటిపారుదల తరచుగా ఉండేలా చూసుకోవాలి: 

ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరిగితే, మార్చి చివరి వరకు తరచుగా తేలికపాటి నీటిపారుదల జరిగేలా చూడాలి. అయినా కూడా, వరదల కారణంగా ఒత్తిడికి దారితీసే భారీ నీటిపారుదల జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పొటాషియం నైట్రేట్ లేదా సాలిసిలిక్ యాసిడ్‌ను పిచికారీ చేయండి

ఎకరానికి 2% KNO3 (4 కిలోల పొటాషియం నైట్రేట్, 13:0:45, 200 లీటర్ల నీటిలో) లేదా సాలిసిలిక్ యాసిడ్‌ను 75 ppm చొప్పున (15 గ్రాముల సాలిసిలిక్ యాసిడ్ ని 450  మిల్లీ లీటర్ల ఇథైల్ ఆల్కహాల్‌ 200 లీటర్ల నీటిలో కలిపి కరిగించాలి.) ధాన్యం పుట్టే సమయంలో ప్రారంభ దశలో, సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. 

రబీ 2023-24 కోసం, సీజన్ వచ్చే ముందు ఈ క్రింది అంశాలను జాగ్రత్తగా గమనించుకోవాలి

వేడిని తట్టుకునే గోధుమ రకాలు: 2021-22లో అధిక ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల పొలాల్లో వేడిని తట్టుకునే రకాలను అంచనా వేయడానికి అవకాశం  కలిగింది. పీబీడబ్ల్యూ 766 (సునేహ్రి) ఉత్తమమని సర్వేలు వెల్లడించాయి. వేడి ఒత్తిడిలో దిగుబడిలో కనీస తగ్గింపుతో అధిక దిగుబడిని కలిగి ఉంది. పీబీడబ్ల్యూ 824, పీబీడబ్ల్యూ 869, డీబీడబ్ల్యూ 187, పీబీడబ్ల్యూ 677 వంటి ఇతర రకాలు కూడా బాగా పనిచేశాయి. ఇంకా, జాతీయ స్థాయిలో నిర్వహించిన అఖిల భారత సమన్వయ పరిశోధన ట్రయల్స్‌లో పీబీడబ్ల్యూ 826, 2021-22 లో వేడి గాలులు వీచిన సీజన్‌తో సహా మొత్తం మూడు సంవత్సరాల పరీక్ష సమయంలో వాయువ్య మైదానాల జోన్‌లో (పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో) ధాన్యం దిగుబడికి మొదటి స్థానంలో నిలిచింది.  ఇంకా.. పీబీడబ్ల్యూ 826 వేడి గాడ్పులను తట్టుకొనే సామర్ధ్యం పశ్చిమ జోన్ కంటే వెచ్చగా ఉండే ఈశాన్య మైదానాల జోన్లో (అంటే తూర్పు ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల మైదానాలలో) పండించడం ద్వారా నిర్ధారించబడుతుంది.

పరిరక్షణ వ్యవసాయం

వరి అవశేషాలను నిలుపుకున్న పొలాల్లో హ్యాపీ సీడర్‌ని ఉపయోగించి, గోధుమలను విత్తడం వల్ల నేల ఉపరితలంపై రక్షక కవచం ఏర్పడుతుంది. ఈ రక్షక కవచం మార్చి, ఏప్రిల్‌లో ఉష్ణోగ్రతలను తక్కువగా ఉంచుతుంది. పంట అధిక ఉష్ణోగ్రతలను భరించగలిగేలా చేస్తుంది.

గోధుమ పంట దాదాపు మొత్తం సీజన్‌లో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు గురవుతుంది. అందువల్ల.. అన్ని దశలలోను వేడిని తట్టుకునే రకాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం అవసరం. ICAR వారి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ వీట్ అండ్ బార్లీ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్, పంజాబ్ మరియు ఇతర రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఈ పరిస్థితిపై పరిశోధనలు చేస్తున్నాయి. అయితే అధిక ఉష్ణోగ్రతల సవాలును ఎదుర్కోవడానికి ఈ పరిశోధనలను బలోపేతం చేయడానికి మరిన్ని వనరులు అవసరం.

మెరుగైన పద్ధతులతో పూర్తి పంటను పొందేందుకు, రైతులకు అవగాహన కల్పించేందుకు తప్పనిసరిగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి.