70,000 భారతీయుల పాస్‌పోర్ట్‌లు సరెండర్

అందిన సమాచారం ప్రకారం, RPOలో సరెండర్ చేసిన పాస్‌పోర్ట్‌లను కవర్ చేస్తుంది. మొదట తొమ్మిది ఏళ్లలో 2000-4000 వరకు ఈ సంఖ్య ఉన్నప్పటికీ, 2012 & 2013 మధ్యలో పాస్పోర్ట్ లు అప్పగించిన వారి సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తుంది. 2011 మరియు 2022 మధ్య, దేశవ్యాప్తంగా 70,000 మంది భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లను ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల (RPOలు) దగ్గర సరెండర్ చేశారు, ఎనిమిది రాష్ట్రాలు – గోవా, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, […]

Share:

అందిన సమాచారం ప్రకారం, RPOలో సరెండర్ చేసిన పాస్‌పోర్ట్‌లను కవర్ చేస్తుంది. మొదట తొమ్మిది ఏళ్లలో 2000-4000 వరకు ఈ సంఖ్య ఉన్నప్పటికీ, 2012 & 2013 మధ్యలో పాస్పోర్ట్ లు అప్పగించిన వారి సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తుంది. 2011 మరియు 2022 మధ్య, దేశవ్యాప్తంగా 70,000 మంది భారతీయులు తమ పాస్‌పోర్ట్‌లను ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాల (RPOలు) దగ్గర సరెండర్ చేశారు, ఎనిమిది రాష్ట్రాలు – గోవా, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఢిల్లీ మరియు చండీగఢ్ – సరెండర్ చేసిన పత్రాలు సంఖ్య 90 శాతానికి పైగా ఉన్నారు. 

ఈ వ్యవధిలో సరెండర్ చేసిన 69,303 పాస్‌పోర్ట్‌లలో 40.45 శాతం గోవాలోని RPO వద్ద సరెండర్ చేసినట్లు సమాచారం, సమాచార హక్కు (RTI) దరఖాస్తుకు ప్రతిస్పందనగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) షేర్ చేసిన డేటాను వెల్లడించింది ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్.

2011 నుండి RPOలలో సరెండర్ చేయబడిన 69,303 పాస్‌పోర్ట్‌లలో భారతీయ పౌరసత్వంలో కొంత భాగం మాత్రమే. MEA లో రాష్ట్ర మంత్రి V మురళీధరన్ ఈ ఏడాది మార్చి 24న పార్లమెంటులో పంచుకున్న సమాచారం ప్రకారం, 2011 మొదటి నెల నుంచి మరియు అక్టోబర్ 31 మధ్య, 16.21 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు సమాచారం.

RTI చట్టం కింద అందించిన సమాచారం ప్రకారం, RPOల వద్ద సరెండర్ చేయబడిన పాస్‌పోర్ట్‌లను మాత్రమే కవర్ చేస్తుంది, విదేశాలలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాలు మరియు హైకమీషన్‌ల వద్ద వదులుకున్న వాటిని ఇక్కడ వెల్లడించడం జరగదు.

భారత పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు రెండు దేశాలలో పౌరసత్వం అనేది అనుమతించబడదు. ఒక వ్యక్తి  భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంటే, ఒకవేళ అదే సమయంలో మరొక దేశం యొక్క పాస్‌పోర్ట్‌ కూడా తమతో ఉన్నట్లయితే, వారు వెంటనే వారి భారతీయ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి. 

ఎంతమంది తమ పాస్పోర్ట్లు సరెండర్ చేశారు:

సరెండర్ చేయబడిన 69,303 పాస్‌పోర్ట్‌లలో, గోవా అత్యధికంగా – 28,031/ 40.45 శాతం – పంజాబ్ (చండీగఢ్ యుటితో సహా) 9,557 పాస్‌పోర్ట్‌లు (13.79 శాతం), అమృత్‌సర్ మరియు చండీగఢ్‌లోని RPOల వద్ద సరెండర్ చేయబడ్డాయి.

2011 మరియు 2022 మధ్య అహ్మదాబాద్ మరియు సూరత్‌లోని RPOల వద్ద 8,918 పాస్‌పోర్ట్‌లు (12.87 శాతం) సరెండర్ చేయబడ్డాయి, గుజరాత్ ఈ లిస్టులో మూడవ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో, 6,545 పాస్‌పోర్ట్‌లు (9.44 శాతం) నాగ్‌పూర్, పూణే మరియు ముంబై/థానేలోని RPOల వద్ద సరెండర్ చేయబడ్డాయి.

దక్షిణాది రాష్ట్రాలు కేరళ (3,650 సరెండర్ చేయబడ్డా పాస్‌పోర్ట్‌లు, 5.27 శాతం) మరియు తమిళనాడు (2,946 సరెండర్ పాస్‌పోర్ట్‌లు, 4.25 శాతం) కూడా గణనీయమైన సంఖ్యలో ప్రజలు తమ పాస్‌పోర్ట్‌ను వదులుకున్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

లోక్‌సభలో సమర్పించిన MEA డేటా ప్రకారం, 2011 నుండి ప్రతి నెల సగటున 11,422 మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. మరోవైపు, భారతదేశం అంతటా RPOల వద్ద ఈ కాలంలో ప్రతి నెల సగటున 482 భారతీయ పాస్‌పోర్ట్‌లు సరెండర్ చేయబడ్డాయి. భారతదేశంలోని RPOల వద్ద సరెండర్ చేయబడిన పాస్‌పోర్ట్‌లను సంవత్సరాల వారిగా చూసినట్లయితే, 2011లో కేవలం 239 పాస్‌పోర్ట్‌లు మాత్రమే సరెండర్ చేయబడ్డాయి, అయితే తరువాతి రెండేళ్లలో, సంఖ్యలు అధికంగా పెరిగింది – 2012లో 11,492 మరియు 2013లో 23,511 – 2,000-4,000. అయితే రానున్న సంవత్సరాలలో ఈ సంఖ్య ఇంకా అధికమయ్యే అవకాశం లేకపోలేదు.