ప్ర‌జ‌ల‌తోనే ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పండి:  మోదీ

రాబోయే 2024 ఎలక్షన్లకు బిజెపి సన్నాహాలు మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం నరేంద్ర మోదీ తమ బిజెపి ఎంపీలకు, ప్రజలకు మరింత దగ్గర కావాలంటూ సలహా ఇచ్చారు. అంతేకాదు, ప్రజలకు చేరువవ్వడానికి, వీలైతే పెళ్లిళ్లకు కూడా వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి అని సెలవిచ్చారు. ఉత్తరప్రదేశ్ సమావేశం: ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందర్భంగా బిజెపిలో ఎలక్షన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సక్సెస్ మంత్ర సూచించినట్లు ఉత్తరప్రదేశ్ లో జరిగిన సమావేశమే తెలియజేస్తోంది. […]

Share:

రాబోయే 2024 ఎలక్షన్లకు బిజెపి సన్నాహాలు మొదలుపెట్టినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం నరేంద్ర మోదీ తమ బిజెపి ఎంపీలకు, ప్రజలకు మరింత దగ్గర కావాలంటూ సలహా ఇచ్చారు. అంతేకాదు, ప్రజలకు చేరువవ్వడానికి, వీలైతే పెళ్లిళ్లకు కూడా వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి అని సెలవిచ్చారు.

ఉత్తరప్రదేశ్ సమావేశం:

ఎలక్షన్లు దగ్గర పడుతున్న సందర్భంగా బిజెపిలో ఎలక్షన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ముఖ్యంగా నరేంద్ర మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సక్సెస్ మంత్ర సూచించినట్లు ఉత్తరప్రదేశ్ లో జరిగిన సమావేశమే తెలియజేస్తోంది.

ప్రస్తుతం ప్రజలకు దగ్గరగా ఉన్న బిజెపి మరింత దగ్గర అవ్వాలని, భారతదేశ ప్రధానమంత్రి మోదీ తమ ఎన్డీఏ ఎంపీలకు సలహా ఇచ్చారు. అంతేకాకుండా, ఇతరుల మాదిరిగా ఎన్ డి ఏ అన్నది స్వార్థపూరితమైనది కాదని, ఇతరుల కోసం సహాయం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వీలైతే సమస్యలను తెలుసుకోవడానికి ప్రజలు సమకూరే సమావేశాలలో కూడా పాల్గొనాల్సిన అవసరం ఉందని ఎంపీలకు మోదీ సూచించారు. అంతేకాకుండా వీలైతే పెళ్లిళ్లకు కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని, ప్రజలతో ఎంత కనెక్ట్ అయితే వారి సమస్యలు అంత ఈజీగా పరిష్కరించవచ్చు అని అభిప్రాయపడ్డారు.

రామ మందిరం విషయమే కాకుండా, ముఖ్యంగా ఇతర అంశాలపై కూడా దృష్టి సారించాలని, తమ ఎంపీలకు మోదీ సూచించారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలతో మమేక్యమైపోవాలని, వారి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని ఎంపీలకు సూచించారు. 

విడతల వారీగా సమావేశాలు:

అయితే ప్రస్తుతం జరిగిన సమావేశంలో ఉత్తరప్రదేశ్, బ్రిజ్, కాన్పూర్, బండల్కండ్ ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు ప్రస్తుతం జరిగిన సమావేశంలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే ఎంపీలు ముఖ్యంగా తమ లోకల్ ప్రజల సమస్యలను తీర్చేందుకు ముఖ్యంగా ముందు ఉండాలని, ప్రజల సమావేశంలో కూడా తమ పాల్గొనాలని ఉద్దేశపడ్డారు మోదీ.

2024 లో కూడా జరగబోయే ఎలక్షన్స్ లో తమదే పై చేయి అని అందులో ఎటువంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు మోదీ. ప్రజలలో కొంతమంది కోపంగా కూడా మాట్లాడొచ్చు, విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కాబట్టి మనమే వారిని కూడా శాంతింప చేసి, వారి సమస్యలను పరిష్కరించడమే మన కర్తవ్యం అంటూ ముఖ్యంగా మాట్లాడారు మోదీ.

అయితే ప్రస్తుతం బిజెపి తరపున ఉన్న ఎన్డీఏ 430 ఎంపీలను 11 గ్రూపులుగా విభజించినట్లు తెలుస్తోంది. అయితే గ్రూపుల వారీగా సమావేశాలు ప్రస్తుతం జరగనున్నాయి. సుమారు ఆగస్టు 10 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వచ్చే బుధవారం తదుపరి జరిగే సమావేశాలలో, మరో 96 మంది ఎంపీలతో మోదీ కనెక్ట్ అవ్వనున్నారు. అందులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ కి సంబంధించిన ఎంపీలు రానున్నట్లు సమాచారం.

ముఖ్యంగా 2024 ఎలక్షన్ సందర్భంగా, ప్రస్తుతం జరగబోయే సమావేశాలు విజయానికి తొలి మెట్లు అంటున్నారు మోదీ. అయితే సమావేశంలో భాగంగా హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ ఘట్కారి, అంతేకాకుండా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా సమావేశంలో భాగం అవ్వబోతున్నారు. ఏది ఏమైనాప్పటికీ, ప్రతి పార్టీలోని రాబోయే ఎలక్షన్స్ గురించి ముఖ్యమైన ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. కానీ ఎవరు పాలనలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయాలనేదే అందరూ కోరుకుంటున్నారు.