కరీనా తన అభిమానులను పట్టించుకోలేదు అని అన్న నారాయణ మూర్తి 

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 10 వేల రూపాయలతో ఇన్ఫోసిస్‌ను స్థాపించి.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ​ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు… తాజాగా నారాయణ మూర్తి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అభిమానులను కరీనా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ దీనిని తాజాగా ఓ ఇన్‌స్టా పేజీలో షేర్‌ […]

Share:

ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 10 వేల రూపాయలతో ఇన్ఫోసిస్‌ను స్థాపించి.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా తనకంటూ​ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు… తాజాగా నారాయణ మూర్తి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అభిమానులను కరీనా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ దీనిని తాజాగా ఓ ఇన్‌స్టా పేజీలో షేర్‌ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

  ఏడాది ప్రారంభంలో ఐఐటీ కాన్పూర్‌ చర్చా కార్యక్రమంలో నారాయణ మూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి కరీనా కపూర్‌ ప్రస్తావన తీసుకొచ్చారు.  ఈ క్రమంలో బాలీవుడ్ నటి కరీనా కపూర్‌‌ విషయంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి,

అభిమానుల పట్ల ఆమె వ్యవహరించిన తీరును నారాయణ మూర్తి తీవ్రంగా తప్పుబట్టారు.  అయితే మధ్యలో ఆయన సతీమణి సుధామూర్తి కల్పించుకొని నారాయణ మాటలను వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు.

ఆయన అర్ధాంగి సుధామూర్తి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే సాగింది. కరీనా కపూర్‌‌ని నారాయణ మూర్తి తప్పుబట్టగా.. ఆయనతో సుధామూర్తి విభేదించారు నరాయణ మాటలను వ్యతిరేకిస్తూ నటికి మద్దతుగా నిలిచారు.అయినప్పటికీ నారాయణ మూర్తి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు.

 ఇటీవల ఓ చర్చాకార్యక్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్  గురించి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమానులను కరీనా అంతగా పట్టించుకోదని అన్నారు. ఇందుకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

వీడియో లో ఏముంది అంటే…. 

నారాయణ మూర్తి ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలిపారు..వీడియోలో నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఓసారి తాను లండన్ నుంచి వస్తుండగా విమానంలో పక్క సీట్లో నటి కరీనా కపూర్ కూర్చున్నట్లు చెప్పారు. అప్పుడు ఆమెను చూసి చాలా మంది అక్కడకు హాయ్ అంటూ నటిని పలకరించారని.. అయితే ఆమె కనీసం స్పందించలేదన్నారు. అది చూసి తనకు ఆశ్చర్యం వేసిందన్నారు. ఎవరైనా మనదగ్గరకు వచ్చి పలకరిస్తే లేచి నిల్చుని నిమిషమో, అర నిమిషమో మాట్లాడతాం.. మన నుంచి వాళ్లు కోరుకునేది కూడా అంతే కద అంటూ గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

వెంటనే జోక్యం చేసుకున్న సుధామూర్తి.. నారాయణ మూర్తితో విభేదించారు. ‘‘ఆమెకు కోట్ల మంది అభిమానులుంటారు. బహుశా ఆమె విసిగిపోయి ఉండొచ్చు. ఓ సాఫ్ట్‌వేర్‌ వ్యక్తి, కంపెనీ ఫౌండర్‌ అయిన నారాయణ మూర్తికి 10 వేల మంది అభిమానులు ఉంటారేమో! కానీ సినీ నటికి కోట్ల మంది ఫ్యాన్స్‌ ఉంటారు కదా’’ అని కరీనాకు మద్దతుగా మాట్లాడారు. దీంతో అక్కడున్న వారంతా గట్టిగా నవ్వేశారు.

తన మాటలకు నారాయణ మూర్తి మరింత వివరణ ఇస్తూ.. ‘‘ఎవరైనా మనపై అభిమానం చూపించినప్పుడు.. మనం ఆ ప్రేమను తిరిగి చూపించాలి. అది ఏ రూపంలోనైనా సరే.. తిరిగి చూపించడమనేది చాలా ముఖ్యం’’ అని ఆయన చెప్పారు.ఆ సందర్భంలో కరీనా కపూర్ యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన దగ్గరగా చూడడంతో ఆమెపై ఆయనకు మంచి అభిప్రాయం లేదు. 

అయితే అభిప్రాయం ఉండడంలో తప్పులేదు కానీ ఆ విషయాన్ని మీడియా ముందు చెప్పడమే పెద్ద తప్పు.ఆ పని చేసి నారాయణ మూర్తి తన స్థాయిని తగ్గించుకున్నారు.

 ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.