నారా లోకేష్ కు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్..

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు కుటుంబ సభ్యులను ఏపీ సర్కార్ ఈ మధ్య వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు లో చంద్రబాబును ముద్దాయిగా చేసి జైలులో వేసిన సర్కారు ఆయన తనయుడు పోయిన సారి ప్రభుత్వంలో మంత్రిగా చేసిన నారా లోకేష్ ను కూడా టార్గెట్ చేసింది. లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ […]

Share:

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు కుటుంబ సభ్యులను ఏపీ సర్కార్ ఈ మధ్య వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు లో చంద్రబాబును ముద్దాయిగా చేసి జైలులో వేసిన సర్కారు ఆయన తనయుడు పోయిన సారి ప్రభుత్వంలో మంత్రిగా చేసిన నారా లోకేష్ ను కూడా టార్గెట్ చేసింది. లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అతడిని సీఐడీ ఏ14గా పేర్కొంది. దీంతో త్వరలోనే లోకేష్ అరెస్టు కూడా ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

చంద్రబాబుతో ఆడుకుంటున్నారా??

మాజీ సీఎం చంద్రబాబు నాయుడును చాలా రోజుల నుంచి జైలుకే పరిమితం చేశారు. బాబు అటు హై కోర్టుకు వెళ్లినా ఇటు సుప్రీం కోర్టును ఆశ్రయించినా కానీ అతడికి మాత్రం బెయిల్ దొరకడం లేదు. ఇక అతడి మీద సీఐడీ నమోదు చేసిన కేసును విచారిస్తున్న విజయవాడ ఏసీబీ కోర్టు కూడా అతడికి బెయిల్ ఇవ్వడం లేదు. బాబు తరఫున నేషనల్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వచ్చి వాదనలు వినిపించినా కానీ ఫలితం లేకుండా పోతుంది. ఎవరెన్ని రకాలుగా మేనేజ్ చేసినా కానీ లాయర్ మాత్రం కన్విన్స్ కావడం లేదు. అతడికి ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీ విధించిన న్యాయమూర్తి మొన్న మరో 11 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో అతడు మరోమారు జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. 

ఇప్పుడు లోకేష్ వంతట…

చంద్ర బాబును అరెస్ట్ చేసి జైలులో వేసిన ప్రభుత్వం ఇక ఇప్పుడు లోకేష్ సంగతి చూసేందుకు సిద్ధమయిందని టాక్ నడుస్తోంది. యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ ను కూడా సీఐడీ ద్వారా అరెస్ట్ చేయించేందుకు రంగం సిద్ధం అయిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో అతడిని లోపలేసేందుకు మొత్తం స్కెచ్ రెడీ అయిందని టాక్. అందుకు అనుగుణంగానే ఆ కేసులో అతడిని ఏ 14 గా పేర్కొంటూ సీఐడీ ప్రకటన చేసింది. ఏపీ సీఐడీ తాజాగా కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఈ విషయాన్ని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తో పాటు పలువురిని ఏపీ సీఐడీ అధికారులు నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కూడా చంద్ర బాబుకు జైలు తప్పదని అంతా అంటున్నారు. 

చంద్రబాబు అలా చేశారు… 

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం టీడీపీ హయాంలో జరిగిందని సీఐడీ వాదిస్తోంది. సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు దగ్గరగా ఉన్న వాళ్ల భూముల విలువను పెంచేందుకు తన అధికారాలను దుర్వినియోగం చేశారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. మంత్రిగా ఉన్న లోకేష్ కూడా తన పవర్స్ మిస్ యూజ్ చేశారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేలా చేశారని అధికారులు చెబుతున్నారు. అందుకోసం సీఎం హోదాలో ఉన్న చంద్ర బాబు అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అసలు డిజైన్‌ ను మార్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాదిస్తోంది. దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. 

ఈ కేసులో నిందితులుగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులు పొమ్మూరు నారాయణ, నారా లోకేష్, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, అతడి సోదరుడు లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కే హౌసింగ్ లిమిటెడ్‌కు చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్ తదితరుల పేర్లను ఎఫ్‌ ఐఆర్‌ లో చేర్చారు. ఇందుకోసం అరెస్ట్ లు చేస్తారని ఊహాగానాలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సీఐడీ తన వేగం పెంచినట్లుగా తెలుస్తోంది. మరో వైపు నారా లోకేష్ ఈ నెల 29 నుంచి తన యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎక్కడైతే యాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల పాదయాత్రకు బ్రేక్ పడింది. చంద్ర బాబు అరెస్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు రాజమండ్రిలో ఉన్న లోకేష్ ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ వరుసగా జాతీయ నేతలతో సమావేశం అవుతూ తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని వారి మద్దతును కూడ గడుతున్నారు.