చంద్రుడికి ఆ పేరు పెట్టండి

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో అందరికీ చంద్రుడి మీద ఆశలు పెరిగిపోయాయి. కొద్ది రోజుల నుంచి వార్తల్లో ఎక్కడ చూసినా కానీ చంద్రుడి గురించే చర్చ. చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో విదేశాల్లో ఉన్న ప్రధాని అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లకుండా బెంగళూరుకు చేరుకుని ఇస్రో సైంటిస్టులను అభినందించారు. దీంతో అంతా ఇస్రోను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. చంద్రుడి మీద మన ల్యాండర్ కాలు మోపిన ప్రదేశానికి శివ శక్తి పాయింట్ గా ప్రధాని మోదీ […]

Share:

చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో అందరికీ చంద్రుడి మీద ఆశలు పెరిగిపోయాయి. కొద్ది రోజుల నుంచి వార్తల్లో ఎక్కడ చూసినా కానీ చంద్రుడి గురించే చర్చ. చంద్రయాన్-3 ల్యాండింగ్ సమయంలో విదేశాల్లో ఉన్న ప్రధాని అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లకుండా బెంగళూరుకు చేరుకుని ఇస్రో సైంటిస్టులను అభినందించారు. దీంతో అంతా ఇస్రోను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. చంద్రుడి మీద మన ల్యాండర్ కాలు మోపిన ప్రదేశానికి శివ శక్తి పాయింట్ గా ప్రధాని మోదీ నామకరణం చేశారు. ఇక దీని మీద కొత్త వాదనలు చేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. 

తెర మీదికి వింత డిమాండ్

చంద్రుడి మీద కేవలం మనం మాత్రమే కాకుండా అనేక దేశాల వారు కూడా ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ఆస్తి కేవలం ఏ ఒక్క దేశానికి చెందినదో కాదు. అన్ని దేశాల సమాన ఆస్తి. కేవలం ప్రయోగాలు చేసేందుకు మాత్రమే అందరికీ వీలుంటుంది. అంతే కానీ ఈ ఆస్తి మాది అని గుత్తాధిపత్యం చెలాయించడం కుదరదు. కానీ చంద్రుడిని ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించమని హిందూ ధర్మకర్త ఒకరు డిమాండ్ చేశారు. అది మాత్రమే కాకుండా చంద్రుడి మీద మన ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని రాజధానిగా ప్రకటించాలని కూడా అతడు డిమాండ్ చేశాడు. 

అధ్యక్షుడతడు.. 

ఇటువంటి వింత డిమాండ్ చేసిన వ్యక్తి ఏ సాధారణ వ్యక్తో అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ డిమాండ్ చేసింది హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ కావడం గమనార్హం. అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు, ఇతర మతాల కంటే ముందు చంద్రుడిపై తన యాజమాన్యాన్ని భారత ప్రభుత్వం నొక్కిచెప్పాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా ఈ విషయాన్ని పార్లమెంట్ కూడా ఆమోదించాలన్నారు. దీంతో అతడి వైరల్ డిమాండ్ తెగ ట్రోల్ అవుతోంది. ఏంటిదని అంతా కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటీవలే మన ల్యాండర్ చంద్రుడి మీద దిగిన ప్రదేశాన్ని శివ శక్తి పాయింట్ గా పిలుస్తామని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ నిర్ణయాన్ని దేశం మొత్తం స్వాగతించింది. ఇస్రో చైర్మన్ సోమనాథన్ కూడా ప్రధాని నిర్ణయం సరైందే అని తెలిపారు. అంత మాత్రాన ఇలా హిందూ రాజ్యంగా ప్రకటించాలని డిమాండ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. 

ఓ వీడియో విడుదల… 

హిందూ జాతీయ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ ఈ డిమాండ్ కు సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశాడు. ఈ వీడియోలో అతడు చేసిన పలు కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అతడి కామెంట్స్ మీద పలువురు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. చంద్రుడిని పార్లమెంటు హిందూ సనాతన్ రాష్ట్రంగా ప్రకటించాలని, చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రదేశాన్ని రాజధానిగా ‘శివశక్తి పాయింట్’గా అభివృద్ధి చేయాలని అతడు డిమాండ్ చేశాడు. తద్వారా జిహాదీ మనస్తత్వం ఉన్న ఏ ఉగ్రవాది అక్కడికి చేరుకోకూడదని కూడా అతడు వీడియోలో పేర్కొన్నాడు. ఇలా రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదంటూ అంతా అంటున్నారు. మన భారతదేశం సాధించిన విజయాన్ని అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా హిందూ ముస్లిం అంటూ విడదీసి చూడడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. 

అతడికి కొత్తేం కాదు.. 

హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ కు ఇటువంటి వింత డిమాండ్ లు వింత స్టేట్ మెంట్లు ఇవ్వడం కొత్తేం కాదు. ఇది వరకు కూడా అతడు ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. 2020 లో, దేశం కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్నప్పుడు, అతను దేశ రాజధానిలో “గోమూత్ర పార్టీ”ని నిర్వహించాడు. ఆ పార్టీలో అతడితో పాటు పలువురు హిందూ మహాసభ సభ్యులు కూడా గో మూత్రం తాగారు. కరోనా నివారణకు ఇలా చేయాలంటూ అందరికీ పిలుపునిచ్చారు. ఇలా గో మూత్రం తాగడం మరియు అందర్నీ తాగమనడం మీద అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. అంతే కాకుండా కరోనా వైరస్ అనేది జంతువులను చంపి తినే వ్యక్తుల కారణంగానే వచ్చిందని కూడా అతడు వైరల్ వ్యాఖ్యలు చేశాడు. మీలో ఎవరైనా కానీ జంతువును చంపినప్పుడు, అది ఆ ప్రదేశంలో విధ్వంసం కలిగించే ఒక విధమైన శక్తిని సృష్టిస్తుందని తెలిపారు. దీంతోనే కరోనా అనేది వ్యాప్తి చెందిందని తెలిపారు. అంతే కాకుండా ప్రపంచదేశాలు కరోనాను నిర్మూలించేందుకు ఇండియా నుంచి ఆవు మూత్రాన్ని దిగుమతి చేసుకోవాలిని అతడు డిమాండ్ చేశాడు.