Muslim: దుర్గాదేవి నగలు కోసం ముస్లిం సోదరుడు

దుర్గాదేవి (Devi) పూజ (Pooja) నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నారు భారత దేశ ప్రజలు. తొమ్మిది రోజులు తొమ్మిది ప్రతిమలను తమదైన సైలిలో కొలుస్తూ భక్తులు పరవశంలో మునిగి తేలుతుంటారు. అయితే ఒక ముస్లిం (Muslim) భక్తుడు తమ ప్రాంతంలో పెట్టిన దుర్గాదేవి (Devi) ప్రతిమ కోసం తనదైన శైలిలో ఒక సహాయాన్ని చేసి, భారతదేశం (India)లో ప్రతి మతం ఒక్కటే, హిందూ-ముస్లిం (Muslim) భాయి భాయి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేశాడు.  రూ. 50,000 కట్టి […]

Share:

దుర్గాదేవి (Devi) పూజ (Pooja) నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నారు భారత దేశ ప్రజలు. తొమ్మిది రోజులు తొమ్మిది ప్రతిమలను తమదైన సైలిలో కొలుస్తూ భక్తులు పరవశంలో మునిగి తేలుతుంటారు. అయితే ఒక ముస్లిం (Muslim) భక్తుడు తమ ప్రాంతంలో పెట్టిన దుర్గాదేవి (Devi) ప్రతిమ కోసం తనదైన శైలిలో ఒక సహాయాన్ని చేసి, భారతదేశం (India)లో ప్రతి మతం ఒక్కటే, హిందూ-ముస్లిం (Muslim) భాయి భాయి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేశాడు. 

రూ. 50,000 కట్టి మరీ: 

సోదరభావ బంధాన్ని ప్రదర్శిస్తూ, ఒడిశా (Orissa)లోని కటక్(Cuttack) నగరానికి చెందిన ఒక ముస్లిం (Muslim) వ్యక్తి మంగళవారం స్థానిక దుర్గా పూజ (Pooja) కమిటీ దసరా (Dussehra)ను ఉత్సాహంగా జరుపుకునేలా చూసేందుకు ముందుకు వచ్చారు. ఆ ముస్లిం (Muslim) వ్యక్తి తన స్వంత ఆర్థిక విరాళాలను అందించడమే కాకుండా, పూజ (Pooja) సమయంలో దుర్గాదేవి (Devi)ని దేవీ నగలతో విలువైన అలంకారాలతో అలంకరించి అబ్బురపరిచేలా చూసేందుకు, కమిటీ తనఖా పెట్టిన బంగారు ఆభరణాలను విడిపించాడు. 

కటక్ నగరంలోని సుతాహత్‌కు చెందిన ఎస్కే లియాఖుద్దీన్ అహ్మద్(Ahmad) అనే ముస్లిం (Muslim) భక్తుడు స్థానిక ఆర్థిక సంస్థ నుంచి ఆభరణాలను విడుదల చేసేందుకు రూ.50,000 తన వంతు సహాయం చేశాడు. సుతాహత్ పూజ (Pooja) కమిటీతో తనకు చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉందని అహ్మద్ తెలిపారు. అంతేకాకుండా ఈ విధంగా సోదర భావంతో దేవి (Devi)కి అలంకరించవలసిన ఆభరణాలు తిరిగి తీసుకురావడంలో తన వంతు సహాయం చేసినందుకు సంతోషిస్తున్నట్లు వెల్లడించాడు ముస్లిం (Muslim) సోదరుడు.

అయితే తనఖా పెట్టిన ఆభరణాలను బయటికి తీసుకువచ్చే అవకాశం కేవలం కమిటీ వారికి ఉండడంతో, Sk లియాఖుద్దీన్ అహ్మద్ తనఖా పెట్టిన ఆభరణాల విడుదల చేసేందుకు డబ్బును విరాళంగా ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. ఇది దుర్గాదేవి (Devi)పై అతని ప్రేమను తెలియజేస్తుందని కమిటీ సభ్యులు ప్రత్యేకించి పేర్కొన్నారు

సుతాహత్‌లో పెద్ద సంఖ్యలో ముస్లిం (Muslim)లు ఉన్నారు. దుర్గా పూజ (Pooja)లో సమాజంలోని స్త్రీ, పురుషులిద్దరూ పాల్గొంటారు. వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన కటక్ నగరంలో దసరా (Dussehra) సందర్భంగా దాదాపు రెండు వందల పూజ (Pooja) మండపాలు కనిపిస్తాయి. అయితే, దసరా (Dussehra) సమయాలలో ఈ ప్రత్యేకమైన నగరం తన చరిత్రలో ఎప్పుడూ ఎలాంటి మత కల్లోలాలు చూడలేదు. 

Read More: Same-sex marriage verdict: న్యాయమూర్తులు అంగీకరించిన, విభేదించిన అంశాలు..

నవరాత్రుల సంబరాలు: 

నవరాత్రి (Navaratri)ని సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రి (Navaratri), ఆషాఢ నవరాత్రి (Navaratri), శారదా నవరాత్రి (Navaratri), మాఘ నవరాత్రి (Navaratri) అంటారు. వీటిలో, పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి (Navaratri), వసంత కాలంలో వచ్చే వసంత నవరాత్రి (Navaratri) చాలా ముఖ్యమైనవి.

1. వసంత నవరాత్రి (Navaratri): వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే బసంత నవరాత్రి (Navaratri), వసంత ఋతువులో (మార్చి-ఏప్రిల్) తొమ్మిది రూపాల దేవీ మాతని ఆరాధించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగ. దానిని చైత్ర నవరాత్రులని కూడా గుర్తిస్తారు. ఈ తొమ్మిది రోజుల పండుగను రామ నవరాత్రులని కూడా అంటారు.

2. గుప్త నవరాత్రి (Navaratri): ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో (జూన్-జులై), తొమ్మిది రూపాల దేవీ మాతని ఆరాధించడానికి, పూజించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన (చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం) గుప్త నవరాత్రులను జరుపుకుంటారు.

3. శరన్నవరాత్రులు: అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనది. దీనిని మహా నవరాత్రి (Navaratri) అని అంటారు, ఈ ఉత్సవాన్ని అశ్విన మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను, శరద్ ఋతువులో (శీతాకాలం మొదట్లో అంటే, సెప్టెంబరు-అక్టోబరు) జరుపుకుంటారు.

4. పౌష్య నవరాత్రి (Navaratri): పౌష్య నవరాత్రి (Navaratri) అనేది తొమ్మిది రూపాల దేవీ మాతని ఆరాధించడానికి, పూజ (Pooja)ించడానికి అంకితం చేసిన తొమ్మిది రోజులు, దీనిని పుష్య మాసంలో (డిసెంబరు-జనవరి) వచ్చే పౌష్య నవరాత్రి (Navaratri) అంటారు. పౌష్య శుక్ల పక్షంలో, పౌష్య నవరాత్రులు జరుపుకుంటారు.

5. మాఘ నవరాత్రి (Navaratri): గుప్త నవరాత్రి (Navaratri)గా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రి (Navaratri)ని, మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి) తొమ్మిది రూపాలలో శక్తిని మాతను (దేవీ మాత) తొమ్మిది రాత్రులు ఆరాధించే పండుగగా గుర్తిస్తారు. మాఘ నవరాత్రి (Navaratri)ని మాఘ శుక్ల పక్షాన జరుపుకుంటారు.