బీరు కోసం యువకుడిని హత్య..

హైదరాబాద్లో మరో సంఘటన కలకలం రేపింది. అటుగా వెళుతున్న యువకుడిని ఆపి బీర్ బాటిల్ను ఇవ్వమని అడగగా, ఇవ్వడానికి నిరాకరించడంతో, కొట్టి చంపేసిన ఘటన ఇప్పుడు మీర్ పేటలో కలకలం రేపుతోంది. యువత ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..  పోలీసులు చెప్పిన ప్రకారం:  అయితే 22 ఏళ్ల వయసున్న వరప్రసాద్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున, వరప్రసాద్ అలాగే తన కాలేజీ స్నేహితుడు అయిన మరో ఫ్రెండ్, […]

Share:

హైదరాబాద్లో మరో సంఘటన కలకలం రేపింది. అటుగా వెళుతున్న యువకుడిని ఆపి బీర్ బాటిల్ను ఇవ్వమని అడగగా, ఇవ్వడానికి నిరాకరించడంతో, కొట్టి చంపేసిన ఘటన ఇప్పుడు మీర్ పేటలో కలకలం రేపుతోంది. యువత ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. 

పోలీసులు చెప్పిన ప్రకారం: 

అయితే 22 ఏళ్ల వయసున్న వరప్రసాద్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్నాడు. అయితే సోమవారం తెల్లవారుజామున, వరప్రసాద్ అలాగే తన కాలేజీ స్నేహితుడు అయిన మరో ఫ్రెండ్, సాయి యాదవ్ కలిసి బీర్ బాటిల్ కొనుక్కుని వెళ్తుంటారు. అయితే వెళుతూ ఉండగా, అటుగా వెళుతున్న మరో నలుగురు యువకులు వీరిద్దరిని స్వాగత్ గ్రాండ్ హోటల్ దగ్గర ఆపి, ఆ ఇద్దరు యువకుల చేతుల్లో ఉన్న బీర్ బాటిల్లను వారికిచ్చేమన్నారు. అయితే అప్పుడే వరప్రసాద్, సాయి యాదవ్ అలాగే అవతల వైపు ఉన్న నలుగురు యువకుల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. 

అయితే బీరు బాటిల్ ను ఇవ్వడానికి వరప్రసాద్ అలాగే సాయి నిరాకరించారు. మాటా మాటా పెరిగి గొడవ వరకు వెళ్ళింది. ఈ గొడవలోనే అవతల నలుగురి వ్యక్తులలో ఒకడు ముందుకు వచ్చి, తమ దగ్గర ఉన్న ఐరన్ రాడ్లు వంటి పరికరాలతో వరప్రసాద్ ని కొట్టడం మొదలుపెట్టాడు. మరోవైపు వరప్రసాద్ స్నేహితుడు సాయి భయంతో అక్కడే నిలబడిపోయాడు. మరోపక్క నలుగురు యువకులు కలిసి వరప్రసాద్నీ చితక బాధడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. 

అప్పుడే అటుగా వెళుతున్న ఒక వ్యక్తి వరప్రసాద్ రక్తం మడుగులో ఉండడం చూసి వెంటనే, తనని దగ్గరలో ఉన్న ఆర్కే హాస్పిటల్కి తరలించినప్పటికీ, ఆ హాస్పటల్ వారు తనని అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరిస్తారు. అయితే ఇంక చేసేదేమీ లేక వెంటనే Owaisi హాస్పిటల్, సంతోష్ నగర్ కి తీసుకువెళ్తారు. అయితే తీవ్ర గాయాలు కారణంగా, మంగళవారం చికిత్స తీసుకుంటూ వరప్రసాద్ మృతి చెందినట్లు పోలీసు వారు నిర్ధారించారు. 

సంఘటన జరిగిన అనంతరం, వరప్రసాద్ మృతికి కారణమైన నితీష్ గౌడ్, పవన్, సంతోష్ యాదవ్, కిరణ్ గౌడ్ లను మంగళవారం అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు పోలీసులు. అంతేకాకుండా వారిని కస్టడీలోకి తీసుకొని వారి నలుగురు మీద ఐపిసి 302 సెక్షన్ కింద మర్డర్ కేసు రిజిస్టర్ చేశారు. 

ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?: 

రోజు రోజుకి యువత తప్పు దారి పడుతున్నారు. ఒకప్పుడు కేవలం చదువు, కుటుంబం మీద దృష్టి ఉంచే యువత ఇప్పుడు, కేవలం మాదకద్రవ్యాలు మీద కుట్రలు, హత్యలు మీద దృష్ట పెడుతున్నారు. ఒకరకంగా వీటన్నిటికీ కారణం యువతని ప్రేరేపించే వ్యసనాలు అందుబాటులోకి రావడం. అంతే కాకుండా, కుట్రలు కుతంత్రాలతో కూడిన సినిమాలకు యువత ఎక్కువగా ఆకర్షితం అవడం. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను గమనించుకోకపోవడం వల్ల పిల్లలు పక్కదారి పట్టే అవకాశం ఉంది. కేవలం చిన్నతనం నుంచి అలవాటు చేసే కొన్ని విలువలు, యువతని ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా చెడు స్నేహం, పతనానికి మొదటి మెట్టు. అందుకే యువత మంచి స్నేహాన్ని మాత్రమే వెతకాలి. చెడు స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉందని గుర్తుంచుకోండి. 

ఇప్పుడు జరిగిన సంఘటనలో యువత మద్యపానానికి, కుట్రలకి, హత్యలకి వెనకాడట్లేదు అని నిరూపితమైంది. అందుకే యువత మేలుకో..