చంద్రయాన్-3: ముంబై పోలీసులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా

చంద్రయాన్-3.. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద మన దేశ రాకెట్ అడుగు పెట్టిన క్షణం. ఈ క్షణాలను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రయాన్-3 విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తాము సెపరేట్ గా విజయం సాధిస్తే ఎలా పొంగిపోతారో అలా పొంగిపోయారు. చంద్రయాన్-3 ప్రయోగం కోసం ఇండియా వారు అని మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఎదురు చూశారు. ఎలాగైనా సరే సేఫ్ గా ల్యాండ్ కావాలని […]

Share:

చంద్రయాన్-3.. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద మన దేశ రాకెట్ అడుగు పెట్టిన క్షణం. ఈ క్షణాలను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రయాన్-3 విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తాము సెపరేట్ గా విజయం సాధిస్తే ఎలా పొంగిపోతారో అలా పొంగిపోయారు. చంద్రయాన్-3 ప్రయోగం కోసం ఇండియా వారు అని మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా మంది వ్యక్తులు ఎదురు చూశారు. ఎలాగైనా సరే సేఫ్ గా ల్యాండ్ కావాలని భగవంతుడిని ప్రార్థించారు. అనుకున్నట్లుగానే చంద్రయాన్ -3 జాబిలమ్మ మీద సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇక ఆ క్షణంలో కొందరికి అంతుపట్టరాని విధంగా సంతోషం వచ్చేసింది. వారు సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్న విధానం కూడా వైరల్ అవుతోంది. కొంత మంది సాధారణంగా సెలబ్రేట్ చేసుకోగా.. మరికొందరు మాత్రం వైరల్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇలా వైరల్ సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.  

ముంబై పోలీసులు ఏం చేశారో తెలుసా.. 

చంద్రయాన్-3 సక్సెస్ ను సాధారణ ప్రజలు మాత్రమే కాక అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. చంద్రయాన్-3 సక్సెస్ సందర్భంగా ముంబై పోలీసులు చేసిన ఒక పని వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చంద్రయాన్-3 ద్వారా భారతదేశం సాధించిన అద్భుతమైన విజయాన్ని పురస్కరించుకుని ముంబై పోలీసులు ఆగస్టు 24న సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. డిపార్ట్‌మెంట్ లో ఉండే అంతర్గత మ్యూజిక్ బ్యాండ్ కు చెందిన వ్యక్తులు దేశభక్తి గీతం సారే జహాసే అచ్ఛా తో అద్భుతమైన ప్రదర్శనను ఇచ్చారు. 

వైరల్ అవుతున్న వీడియో..

ఈ వీడియోను ముంబై పోలీసులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన అనేక మంది నెటిజన్లు పోలీసులను మెచ్చుకుంటూ వైరల్ కామెంట్లు చేస్తున్నారు. వారు ఈ వీడియో కింద ఇలా క్యాప్షన్ ఇచ్చారు. ఇది ఎంతో గొప్ప విజయం.. ప్రస్తుతం మా విపరీతమైన భావోద్వేగాలను మాటల్లో వర్ణించలేము, కాబట్టి మేము బదులుగా సంగీతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. దీంతో ఈ వీడియో కొద్ది సేపట్లోనే వైరల్ అయింది. పోలీసులు చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. వావ్ వాటే టాలెంట్ అంటూ కీర్తిస్తున్నారు. 

ఇస్రోకు జేజేలు

కేవలం ముంబై పోలీసులు అని మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులు కూడా ఇస్రో సాధించిన విజయాన్ని మెచ్చుకుంటున్నారు. ఎవరికీ సాధ్యం కాని ఫీట్ ను మీరు చేసి చూపించారంటూ కీర్తిస్తున్నారు. దక్షిణ ధ్రవం మీద అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచానికే పెద్దన్నలా వ్యవహరించే అమెరికాకు కూడా సాధ్యం కాని ఫీట్ ను మన ఇస్రో శాస్త్రవేత్తలు చేసి చూపించారు. రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ త్వరలోనే సూర్యుడి మీద పరిశోధనలకు రాకెట్ పంపిస్తామని చెబుతున్నారు. ఇస్రో విజయాన్ని దేశ ప్రధాని మోదీ కూడా తిలకించారు. బ్రిక్స్ సదస్సు కోసం సౌతాఫ్రికాలో ఉన్న మోదీ ఇస్రో విజయం సాధించగానే ఇస్రో చైర్మన్ కు ఫోన్ చేసి స్వయానా శుభాకాంక్షలు తెలిపారు. ఇస్రో సాధించిన ఘనతను కొనియాడారు. కేవలం అతడు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, అనేక పార్టీల నేతలు ఇస్రోను పొగుడుతూ ట్వీట్లు చేశారు. ఇంతటి ఘనతను సొంతం చేసుకున్న ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.