స్కామ‌ర్ల చేతిలో మోస‌పోయిన వ్య‌క్తి

ముంబైలో ఒక సంఘటన చోటుసుకుంది. ఈ సంఘటనతో ప్రతి ఒక్కరు అలర్ట్ అయ్యారు. టెలిగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆన్లైన్లో మూవీస్ కి రివ్యూ ఇచ్చే పార్ట్ టైం జాబ్ అనేది మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇందులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న అక్షరాల కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు.  వివరాల్లోకి వెళితే:  భారతదేశంలో ఆన్‌లైన్ స్కామ్ కేసులు పెరుగుతున్న క్రమంలో, దేశవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు ఈ సైబర్ హాకర్ల బారిన పడి లక్షల రూపాయలు […]

Share:

ముంబైలో ఒక సంఘటన చోటుసుకుంది. ఈ సంఘటనతో ప్రతి ఒక్కరు అలర్ట్ అయ్యారు. టెలిగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆన్లైన్లో మూవీస్ కి రివ్యూ ఇచ్చే పార్ట్ టైం జాబ్ అనేది మరో వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఇందులో పార్ట్ టైం జాబ్ చేస్తున్న అక్షరాల కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే: 

భారతదేశంలో ఆన్‌లైన్ స్కామ్ కేసులు పెరుగుతున్న క్రమంలో, దేశవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు ఈ సైబర్ హాకర్ల బారిన పడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. స్కామర్‌లు ప్రజలను మోసగించడానికి వివిధ మార్గాలను రకరకాలుగా ఎంచుకుంటున్నారు. అటువంటి స్కామ్‌లో సినిమా రేటింగ్ స్కామ్ ఒకటి, ఇక్కడ స్కామర్‌లు పార్ట్‌టైమ్ ఇవ్వడమే కాకుండా, ఎక్కువ కమిషన్ వస్తుందని చెప్పి మోసం చేసి డబ్బుని వారి ఎకౌంట్లో జమ చేయమంటూ ప్రేరేపిస్తారు ఇలా ప్రజలను మోసగిస్తారు. ఇటీవల జరిగిన ముంబై స్కామ్ లో, మోసగాళ్లు ఆ వ్యక్తిని బెదిరించి, ఇన్కమ్ టాక్స్ గురించి భయపెట్టి, ఆ వ్యక్తి నుంచి కోటి రూపాయలు రాబట్టారు. 

అసలు ఏం జరిగింది: 

నివేదిక ప్రకారం, విరార్, గోకుల్ టౌన్‌షిప్‌లో నివసిస్తున్న 43 ఏళ్ల డాక్టర్ కి, ఈ సంవత్సరం జనవరి 2న టెలిగ్రామ్ యాప్‌లో ఒక మెసేజ్ రావడం జరిగింది. పంపిన వ్యక్తి, హఫీజా@094 అనే వ్యక్తి, కొంత డబ్బుని డాక్టర్ కి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ వ్యక్తి ఆఫర్ చేసిన జాబ్ వివరాల్లోకి వెళ్తే, ఆన్‌లైన్‌లో సినిమాలను రేటింగ్ ఇవ్వడం ద్వారా డబ్బు అనేది పెద్ద మొత్తంలో సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఆ జాబు ద్వారా వచ్చిన కమిషన్ను, డాక్టర్ ఎకౌంట్లోకి వేయాలంటే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని, టెలిగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి చెప్పడం జరిగింది.

ఆఫర్ వినగానే ఆనందపడిన, డాక్టర్ వాళ్లు ఆఫర్ చేస్తున్న పార్ట్ టైం జాబ్ అంగీకరించాడు. అంతే కాకుండా అతని బ్యాంక్ వివరాలను పంచుకున్నాడు. తరువాత, సినిమా చూసి రివ్యూ ఇవ్వడానికి, డాక్టర్కి ఆన్‌లైన్‌లో 28 సినిమా టిక్కెట్‌లను కూడా పంపించారు, తర్వాత ఆ సినిమాలు చూసి వాటికి అతను రేటింగ్ ఇచ్చాడు. మొదటి పని పూర్తి చేసిన తర్వాత, అయితే దానికి కమిషన్ కింద అతని బ్యాంక్ అకౌంట్ లో 850 రూపాయలు పడ్డాయి. 

అయితే ఎక్కువ కమిషన్ కోసం ఆశపడుతున్న డాక్టర్ ఆశని ఇంకా రెట్టింపు చేయడానికి, కామెర్లు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే తమ ఎకౌంట్లో కొంత మొత్తం జమ చేయాలని కోరారు. డబ్బులు అందిన తర్వాత ఆ డాక్టర్ కి ఎక్కువ మొత్తంలో కమిషన్ అందుతుందని నమ్మకంగా ప్రామిస్ చేశారు. మరుసటి రోజు, స్కామర్ సూచించిన విధంగా డాక్టర్ రూ.9,900 తనకి తెలియని బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే తర్వాత ఆ డాక్టర్ కొన్ని రోజులు పనిచేసి సుమారు రూ.31 లక్షలు కమీషన్‌గా పొందినట్లు తెలుస్తోంది. 

ఆఖరికి ఇలా మోసపోయాడు: 

పార్ట్ టైం జాబ్ చేస్తే సంపాదించిన 31 లక్షలు విత్‌డ్రా చేసుకోవాలని, డాక్టర్ నిర్ణయించుకోగా, ముందుగా రూ.15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని టెలిగ్రామ్లో పరిచయమైన వ్యక్తి మళ్లీ మెసేజ్ చేసాడు. నాలుగైదు రోజుల్లోనే, మోసగాళ్లు కమీషన్ను రూ.1.96 కోట్లకు పెంచుకుంటూ పోయారు. అంతేకాకుండా, స్కామర్లు ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగేలా చేస్తామని బెదిరించి, రూ. 8 లక్షలు ‘ఆదాయ పన్ను’ చెల్లించేలా చేశారు.

నివేదిక ప్రకారం, డాక్టర్ చివరిగా తన కమీషన్‌ను రికవరీ చేయడానికి రూ. 1.09 కోట్లు డిపాజిట్ చేసాడు. తాను మోసపోయానని గ్రహించిన తర్వాత పోలీసులను ఆశ్రయించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.